Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Tg Bjp 2

Off The Record : BJP కి అగ్నిపరీక్షగా మారిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు?

Published Date :January 13, 2026 , 7:57 pm
By Gogikar Sai Krishna
  • త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ నగారా
  • బీజేపీకి ప్రతిష్టాత్మకంగా పురపోరు
  • 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికలు
  • పురపాలికల్లో ఏ పార్టీ పొజిషన్ ఏంటో తేల్చనున్న పోల్స్
Off The Record : BJP కి అగ్నిపరీక్షగా మారిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్రామీణం కాదు…పట్టణమే తమ బలమని కమలం పార్టీ భావిస్తోంది. నగరాల్లో తమ క్రేజ్ వేరే లెవల్‌ అని ప్రతీసారి కాన్ఫిడెన్స్‌గా చెబుతోంది. ఇప్పుడు తెలంగాణలో అదే మాట…బీజేపీకి అగ్ని పరీక్షగా మారింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి నగారా మోగనుంది. 117 మున్సిపాలిటీలకు, 6 మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ర్ట ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గుర్తుల మీద ఈ ఎన్నికలు జరుగుతాయి. పురపాలికల్లో ఏ పార్టీ పొజిషన్ ఏంటో స్పష్టమవుతుంది. ఆయా పార్టీలకు ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్‌ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమలం పార్టీకి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఆ పార్టీకి పట్టణ పార్టీ అనే పేరు ఉంది. సర్పంచ్ ఎన్నికలతో గ్రామాల్లోకి కూడా వెళ్లామని చెప్పుకుంటున్న ఆ పార్టీ…తనకున్న పేరును నిలుపుకోవాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితి. పార్టీ తన ఉనికిని చాటు కోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవాలి అనే మాట వినిపిస్తోంది.

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఈ ఎన్నికల్లో నంబర్ వన్ గా నిలవాలని టార్గెట్ గా పెట్టుకున్నామంటున్నారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో సుమారు 45 మున్సిపాల్టీలు, పలు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ ప్రజా ప్రతినిధులదేననే టాక్ పార్టీలో వినబడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోని కమలం పార్టీ పురపాలక ఎన్నికలను మాత్రం సీరియస్‌గా తీసుకున్నామంటోంది. అర్థ, అంగ బలంతో రంగంలోకి దిగుతామంటోంది. గెలిచే వారికే టికెట్లు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నిజామాబాద్, కరీం నగర్ కార్పొరేషన్ లలో ప్రభావం చూపింది. చెప్పుకోదగ్గ డివిజన్లను కైవసం చేసుకుంది. మున్సిపాలిటీల్లో మాత్రం పెద్దగా గెలిచింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పార్టీ రాష్ట్రస్థాయిలో సమన్వయ కమిటిని ఏర్పాటు చేసింది. మున్సిపాల్టీలవారిగా అభ్యర్థుల ఎంపిక, సమన్వయం కోసం టీమ్‌లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు ఈ ఎన్నికలు మాత్రం పరీక్షే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • off the record
  • TG BJP

తాజావార్తలు

  • Andhra Pradesh: ‘దివ్యాంగ శక్తి’ పథకం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..

  • PAN Card New Rules 2026: పాన్ కార్డ్ అప్లికేషన్ రూల్స్ ఛేంజ్.. ఏప్రిల్ 1 నుండి ఈ డాక్యూమెంట్స్ ఉండాల్సిందే!

  • Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్‌కు యువ క్రికెటర్ ఫిదా!

  • Iran-Israel: మరో టాప్ లీడర్‌ను లేపేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన

  • Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ‘రివెంజ్’ షురూ.. సినిమాలో యామీ గౌతమ్ సర్ప్రైజ్ రోల్ ఇదే!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions