Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం అందరినీ సంతృప్తి చేయలేకపోతుందా? ఇబ్బంది పెడుతున్న ఆ అంశం ఏంటి

Cng

Cng

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ పని మొదలు పెట్టిందిగానీ… ఎక్కడ ముగించాలో, అందర్నీ ఎలా సంతృప్తి పరచాలో అర్ధంగాక సగంలోనే ఆపేసిందా? దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటున్నాయా? అది ప్రభుత్వానికి సైతం నెగెటివ్‌గా మారుతోందా? ఏ విషయంలో అంతలా ఇబ్బంది పడుతోంది పార్టీ? ఎందుకలా జరుగుతోంది?

Read Also: Off The Record: జనసేన ఎమ్మెల్యే వర్సెస్‌ టీడీపీ ఇంఛార్జ్‌..! విశాఖలో పొలిటికల్‌ హీట్‌..!

తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల ఏర్పాటు వ్యవహారం ఎలా ఉందంటే.. వస్తా కూర్చో అని చెప్పి వెళ్ళిపోయినట్టు ఉందంటున్నారు. వెళ్ళిన వాడు తిరిగి రాడు.. కూర్చున్నోడు వెళ్లిపోలేడు. అదిగో ఇదిగో అనడం ఒక ఎత్తైతే.. ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకుంటూ.. కొర్రీలు పెట్టుకుంటున్నారట. అందుకే ఎప్పటికప్పుడు కమిటీల ప్రకటన వాయిదా పడుతూనే ఉందని అంటున్నారు. అధికారంలో ఉండి కూడా… కమిటీల్ని వేసుకోలేక పోవడాన్ని ఆ పార్టీ నేతలు ఎలా చూస్తారో కానీ.. బయటి నుంచి చూసే వాళ్ళకు మాత్రం.. వీళ్ళింతే, జీవితంలో మారరని అనిపిస్తోందట. కొత్త పీసీసీ అధ్యక్షుడిని మాత్రం నియమించి.. కమిటీని మర్చిపోయారు కాంగ్రెస్‌ పెద్దలు. అధికారంలో ఉన్న పార్టీకి కమిటీలు కీలకం. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొని ప్రజల్లో సానుకూలతను పెంచడానికి పార్టీ నేతలే ముఖ్యం. అయినాసరే.. ఆ విషయం పట్టనట్టుగా ఉంటున్నారు కాంగ్రెస్‌ పెద్దలు. గడిచిన వారం రోజులుగా ప్రతి రోజు.. ఇవాళ, రేపు అంటున్నారే తప్ప కసరత్తు జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టు ఉందట వ్యవహారం. పిసిసి కమిటీ.. వర్కింగ్ ప్రెసిడెంట్ లతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులతో జాబితా వస్తుందని చెబుతున్నారు.

Read Also: Samantha : చీరలో సమంత హొయలు.. ఆ ఫోజులు చూశారా..

అయితే, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ పోస్టులకు బ్రేకులు పడ్డాయన్నది మరో ప్రచారం. ఇలా, పిసిసి కమిటీ వ్యవహారం దాగుడు మూతలాటలాగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకంగా ఉండే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ని ఎంపిక చేయడానికి ఎన్నేళ్ళు యుద్ధం చేస్తారోనని వెటకారమాడే వాళ్ళ సంఖ్య సైతం పెరుగుతోంది పార్టీలో. అసలు విషయం ఏంటంటే.. పీసీసీ కమిటీలో మావాడే ఉండాలని సీనియర్స్‌ అంతా పట్టుదలగా ఉండటంతో.. ఎవరికీ సర్దిచెప్పలేక ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారట. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సైతం పార్టీలో మావాడు లేకుంటే ఎలాగంటూ.. ఎప్పటికప్పుడు కొర్రీలు వేసుకుంటూ వ్యవహారాన్ని సాగదీస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య మైనార్టీ నుంచి ఓ నాయకుడి పేరు బయటికి వచ్చింది. వెంటనే ఆయనకు
వ్యతిరేకంగా కొందరు ఫిర్యాదులు చేశారట. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి కూడా చాలా మంది కమిటీలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ప్రతీ నాయకుడూ.. వచ్చిన పేరు తమ వాళ్ళది కాకుంటే.. వెంటనే కొర్రీ వేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చిందని, తమకు అన్యాయం జరిగిందని అంటూ.. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు PCC చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు.

Read Also: India Bangladesh: బంగ్లాకు షాక్ ఇచ్చిన భారత్.. దిగుమతులపై పోర్ట్ ఆంక్షలు..

కానీ, లిస్ట్‌ ఫైనల్‌ అవకముందే, ఎవరూ ప్రకటించకుండానే ఆమెకు ఎలా తెలిసింది? వివరాలు ఎలా బయటికి వచ్చాయన్నది ఇంకో లొల్లి. కమిటీ కసరత్తు మొదలుపెట్టకుంటే అది వేరే సంగతి. వ్యవహారం జోలికి ఎవరూ వెళ్ళరు. కానీ కూర్పు మొదలు పెట్టి.. సగంలో ఆపడంతోనే.. అసలు లొల్లి అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ప్రతిపక్షం అటు సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటే.. కనీసం అధికార పార్టీ కమిటీ వేసుకుని అడుగు ముందుకు వేయకపోతే ఎలాగన్నది క్వశ్చన్‌. కాంగ్రెస్‌ పెద్దల పరిస్థితి చూస్తుంటే.. తేనె తుట్టె మీదికి రాయి విసిరేసి పారిపోయినట్టుందని అంటున్నారు. కమిటీ ప్రస్తావన లేకున్నా అయిపోయేదిగానీ.. మొదలుపెట్టి ఆపడంతోనే సమస్య జఠిలం అవుతోందన్నది విస్తృతాభిప్రాయం. కొర్రీలు.. ఫిర్యాదులు కాంగ్రెస్ లో సహజమే. కానీ, దాన్నుంచి బయటపడి ఇప్పటికైనా పీసీసీ కమిటీ వేసుకుని టీమ్‌ని సిద్ధం చేసుకోకుంటే.. చేసిన పనిని చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం కూడా పూర్తిగా ఇరకాటంలో పడుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది.

Exit mobile version