Site icon NTV Telugu

Off The Record: ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఒక్కసారిగా కూల్ అవడానికి కారణాలేంటి?

Raja Singh

Raja Singh

Off The Record: ఉందా…? మీకా దమ్ముందా…? నిజంగా ఉంటే… పార్టీ నుంచి నన్ను సస్పెండ్‌ చేయండి. ఒక్కొక్కరి జాతకాలు వరుసబెట్టి బయటపెడతానన్న ఆ నాయకుడు ఇప్పుడు కూల్‌.. కూల్‌… అంటూ కాంప్రమైజ్‌ మంత్రం జపిస్తున్నారట. ఇన్నాళ్ళు సొంత పార్టీ మీదికి, సీనియర్‌ లీడర్స్‌ మీదికి సంధించిన అస్త్రాలను వాపస్‌ తీసుకుంటున్నారట. అంతలా మారిపోయిన ఆ బీజేపీ లీడర్‌ ఎవరు? ఏంటా మనసు మార్పిడి వ్యవహారం?

Read Also: Love Jihad: ఉజ్జయినిలో లవ్ జిహాద్..! హిందువునని చెప్పి యువతిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు..!

బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్‌ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి. అసలు ఎమ్మెల్యే ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆయన మనసులో వేరే ఆలోచనలు ఏవన్నా ఉన్నాయా అన్న ఎంక్వైరీలు సైతం పెరిగిపోయాయి. రాజాసింగ్‌ రాష్ట్ర పార్టీలో ఎవర్నీ వదిలిపెట్టకున్నా… అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేశారన్నది నాయకుల అభిప్రాయం.

Read Also: Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?

ఇక, తనకు సంబంధం లేని అంశాల్లో సైతం స్పందించి కిషన్‌రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారాయన. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినా, ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు లేఖ రాసినా…. అందులో బీజేపీ ప్రస్తావన ఉంటే చాలు…. రాజాసింగ్ సొంత పార్టీ పైనే బాణాలు ఎక్కుపెడుతూ రియాక్ట్‌ అయ్యేవారు. తనపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోందని, దమ్ముంటే సస్పెండ్ చేయండి, అందరి బాగోతాలను బయటపెడతానని కూడా ఒక దశలో సవాల్‌ చేశారు రాజాసింగ్‌. అయితే… తాజాగా ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని తెలంగాణ బీజేపీ వర్గాలే అంటున్నాయి. ఇన్నాళ్లు పార్టీ మీద ఫైర్‌ ఫైర్స్‌ ద ఫైర్‌ అన్న ఎమ్మెల్యే రెండు రోజుల నుంచి శాంతి మంత్రం జపిస్తున్నారట. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉందని అంటున్నారు. ఇన్ని రోజులు రాజాసింగ్ వ్యవహారం పార్టీ అంతర్గత విషయం అని దాటవేస్తూ వచ్చిన కిషన్ రెడ్డి… తాజాగా సెటైరికల్‌గా మాట్లాడారు. ఆయన సీనియర్ నాయకుడు, పార్టీ కోసం త్యాగం చేశారు… నేను కేవలం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను, రాజా సింగ్ ఏం చెబితే దాన్ని పాటిస్తామని కిషన్‌రెడ్డి అనడం… ఎమ్మెల్యేకి ఎక్కడో తగిలినట్టుందని విశ్లేషిస్తున్నారు కొందరు.

Read Also: Off The Record: సీఎం రేవంత్ ని నాడు వద్దన్న నేతలే.. నేడు పోటీ పడి పిలుస్తున్నారా?

ఆ తర్వాతే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శాంతి సందేశం పంపారట రాజాసింగ్‌. టైమ్ ఇస్తే వచ్చి కలుస్తానని, తన సమస్యలు చెప్పుకుంటానని అన్నట్టు సమాచారం. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా.. నేను మాత్రం పార్టీ కోసం పని చేస్తున్నానని… వివరించినట్టు తెలిసింది. అందరం కలిసి ముందుకు పోదాం అని అన్నారట. అయితే, నిన్నటిదాకా ఎంతదాక అయినా సరే… అంటూ తేడాగా మాట్లాడిన రాజా సింగ్.. ఇప్పుడు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అనడంపై చర్చ జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. ఇది శుభ పరిణామమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఉన్న ఎమ్మెల్యేకి ఇకపై ఎంత ప్రాధాన్యం దక్కుతుంది? ఆయన రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version