OTR : మహబూబ్‌నగర్‌లో ఉన్నట్టుండి పెరిగిన పొలిటికల్ హీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలమూరులో పొలిటికల్ హీట్ ఉన్నట్టుండి ఎందుకు పెరిగింది? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ళ పర్వం వెనక ఏం జరిగింది? మీకు చెయ్యడం చేతకావడం లేదని ఒకరంటే…. మీరు చేసిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామంటూ మరొకరు కౌంటర్ వేస్తూ… రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారా? మహబూబ్‌నగర్ పొలిటికల్ స్క్రీన్‌పై కనిపిస్తున్న కొత్త సీన్స్ ఏంటి? మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఇప్పుడే ఎన్నికలు జరగబోతున్నాయా అన్నంతగా రాజకీయం వేడెక్కింది. SIR, సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులతో పాటు , రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలతో హడావిడి చేస్తోంది బీఆర్ఎస్. అధికార కాంగ్రెస్ ప్రజాపాలన వైఫల్యాల పేరుతో నిత్యం ఏదో ఒక అంశంతో ప్రజల్లో ఉంటోంది ప్రతిపక్షం. సందర్భానుసారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు విపక్ష నాయకులు. ఈ క్రమంలోనే…తాజాగా పట్టణంలో కోట్ల రూపాయతో చేపట్టి అసంపూర్తిగా ఉన్న వివిధ నిర్మాణాలను సందర్శిస్తూ… వీటిని ఇంకెప్పుడు వినియోగంలోకి తెస్తారని ప్రశ్నిస్తున్నారు గులాబీ నాయకులు. ఈ పరిణామం అధికార పార్టీ నేతలకు అస్సలు మింగుడు పడ్డం లేదట. జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో 250 కోట్లతో నిర్మాణం మొదలైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కళాభవన్, శిల్పారామంలాంటి వాటిని సందర్శిస్తున్న బీఆర్ఎస్ లీడర్స్… పనుల అసంపూర్తి గురించి ప్రశ్నిస్తున్నారు. వాటిని ఎప్పుడు వినియోగంలోకి తెస్తారంటూ నిలదీయడం ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో తమ హయాంలో జరిగిన రైతు సంక్షేమం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తమదే ప్రజా ప్రభుత్వం అంటూ.. కాంగ్రెస్ సర్కార్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
అదే సమయంలో అటు కాంగ్రెస్ కూడా ఎక్స్ మినిస్టర్‌కు గట్టిగా కౌంటర్ ఇస్తోంది. గత ప్రభుత్వం ఆర్ధిక దోపిడీతో పాటు విద్వంసానికి పాల్పడిందంటూ ప్రతి విమర్శలు చేస్తున్నారు హస్తం లీడర్స్. సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ , కళా భవన్ , శిల్పారామం వంటి వాటిని ప్రణాళికా బద్దంగా చేపట్టలేదని, సర్కార్ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ మండి పడుతోంది కాంగ్రెస్ టీమ్. రెండున్నరేళ్ళలో మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చి వచ్చే యాభై ఏళ్ళ భవిష్యత్‌ను ద్రుష్టిలో ఉంచుకోని అండర్ గ్రౌండ్ డ్రైనేజి, వాటర్ పైప్ లైన్ సిస్టం పనులు చేపట్టబోతున్నామని వివరిస్తున్నారు. మరో పక్క విద్యారంగంలో పాలమూరును అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ , ఇతర కాంగ్రెస్ నేతలు కూడా సందర్భానుసారం శ్రీనివాస్ గౌడ్‌కు గట్టి కౌంటర్లే వేస్తున్నారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. మరోవైపు అభివృద్ధి అంశంపై పదేళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందో , రెండున్నరేళ్ల కాంగ్రెస్‌లో ఏం జరిగిందో బహిరంగంగా చర్చిద్దామని సవాల్ విసురుతున్నారు అధికార పార్టీ నాయకులు. ఈ క్రమంలో… ఇప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్టుందని అంటున్నారు పాలమూరు ప్రజలు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా ఈ స్థాయిలో రాజకీయ హడావిడి లేకపోవడంతో మహబూబ్‌నగర్ పొలిటికల్ సందడి ఎట్నుంచి ఎటు టర్న్ అవుతుందోనన్న విశ్లేషణలు పెరిగిపోతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!