Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Mlas Revolt Against Minister Konda Surekha In Warangal

Off The Record: వరంగల్ లో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..?

Published Date :June 21, 2025 , 10:14 pm
By Chandra Shekhar Pamena
  • వరంగల్‌ కాంగ్రెస్‌లో పీక్స్‌కు చేరిన వార్‌..
  • మంత్రి సురేఖ మీద జిల్లా ఎమ్మెల్యేల తిరుగుబాటు..
  • మంత్రి భర్త మురళి చేసిన వ్యాఖ్యలతో అందరి మండిపాటు..
  • సీనియర్స్‌ని ఉద్దేశించి కొండా మురళి వ్యాఖ్యలు..
  • పార్టీ మారినప్పుడు రాజీనామాలు చేయాలంటూ టార్గెట్‌..
  • కొండా దంపతులపై ఎమ్మెల్యేల కారాలు మిరియాలు..
  • ఢిల్లీ వెళ్ళి పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయబోతున్నారా?..
  • మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇంకా మండిపాటు..
  • భద్రకాళి బోనాలపై ఎమ్మెల్యేల్ని తీసిపారేసినట్టుగా మాట్లాడిన మంత్రి?..
  • ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీలో మంత్రికి మైనస్‌ మార్కులు?..
  • గొడవ ఇలాగే ఉంటే పార్టీకి నష్టమన్న అభిప్రాయాలు
Off The Record: వరంగల్ లో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: అక్కడ కాంగ్రెస్‌ పార్టీలో అగ్గి ఓ రేంజ్‌లో అంటుకుందా? మంత్రికి వ్యతిరేకంగా.. ఏకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు మొత్తం ఒక్కటయ్యారా? ఊరందరిదీ ఒక దారి అయితే.. ఆ మంత్రి దంపతులది మాత్రం మరో దారిగా మారిందా? ఒకరు మొదలుపెడితే.. ఇంకొకరు కొనసాగిస్తున్న ఆ రచ్చ ఏంటి? ఏ జిల్లాలో జరుగుతోంది?

Read Also: Mohan Babu: ఈ “కన్నప్ప” సినిమాలో అందరూ హీరోలే

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇది ఎక్కడో మొదలైంది గానీ.. చివరికి ఎట్నుంటి ఎటు వెళ్తోందన్నది మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల యుద్ధం హస్తిన దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు.. జిల్లా ఎమ్మెల్యేలు. ఈ ఆధిపత్య పోరు చాలా పెద్ద రచ్చకే దారితీస్తోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఒక్కటై మంత్రి మీదకి కత్తి ఎత్తడాన్ని అంత తేలిగ్గా తీసి పారేయలేమంటున్నాయి రాజకీయ వర్గాలు. మంత్రి తమను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలకు ఉండేది. అదలా ఉండగానే.. మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు మురళి. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చారట. మంత్రి భర్త మాటలతోనే మండిపోతున్న టైంలో.. వరంగల్‌ భద్రకాళి టెంపుల్ బోనాల వ్యవహారంపై నేరుగా మంత్రే మాట్లాడిన మాటలతో.. ఏకంగా పెట్రోల్‌ పోసినట్టయిందట. కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్‌రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై కారాలు, మిరియాలు నూరుతున్నట్టు తెలుస్తోంది.

Read Also: Off The Record: స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ డైలమా.. కారు ప్లాన్ తేడా కొట్టిందా?

ఇక, త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అటు కొండా మురళి చేసిన వ్యాఖ్యల మీద పార్టీ పరిశీలకులను నియమించినట్టు ప్రకటించారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఆ లొల్లి అలా ఉండగానే… మీడియా చిట్ చాట్‌లో సురేఖ మరింత పెట్రోల్‌ పోశారు. భద్రకాళి ఆలయ బోనాల విషయంలో ఎవరెవరో తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, రాజకీయాలు చేసే ప్రయత్నంలో ఉన్నారన్న అర్ధం వచ్చేలా మంత్రి అన్న మాటలతో ఫైర్‌ రెట్టింపైంది. దీంతో ఒకప్పటి… పాలిటిక్స్ ఇప్పుడు చేయాలని అనుకుంటే పరిస్థితులు కలిసి వస్తాయా..? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒకటి…రెండు వ్యవహారాల్లో అధిష్టానం దగ్గర మైనస్‌లో ఉన్న కొండా.. ఏరికోరి ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో…. కొండా లొల్లి ఎటు దారితీస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఇలాంటి ఎపిసోడ్స్‌లో పార్టీ అధిష్టానం కూడా చూసీ చూడనట్టు ఉంటే.. అందరికీ నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సమస్యకు ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పడుతుందా? లేక ఎపిసోడ్ కొనసాగుతుందా అన్నది చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AICC
  • congress
  • konda murali
  • Minister Konda Surekha
  • off the record

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions