Off The Record : మీ ఊరా, మా ఊరా…? రా… తేల్చుకుందాం అంటూ సవాళ్ళు
- మీ ఊరా, మా ఊరా...? రా... తేల్చుకుందాం అంటూ సవాళ్ళు
- ఇద్దరి మధ్య పాత పగల్లేవ్, కుటుంబ వివాదాల్లేవ్
- పొలిటికల్ వివాదాల్ని పర్సనల్‌గా తీసుకుంటున్న నేతలు
- లోకల్ గొడవలతో మొదలుపెట్టి పార్టీల అధినేతల దాకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సీజన్లో కోడి పందేలకంటే ఎక్కువగా…. ఆ ఇద్దరు నేతల మధ్య పగలు రగులుతున్నాయా? నీ నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పమని ఒకరు సవాల్ చేస్తే… మరి నీ సంగతేంటంటూ మరొకరు రివర్స్‌లో వేలు చూపిస్తున్నారు. పందెం కోళ్లలా కాలు దువ్వుతున్న ఆ మహిళా నేతలు ఎవరు? ఎక్కడ పేలుతున్నాయి ఆ మాటల తూటాలు? రాయలసీమలో పొలిటికల్ పౌరుషాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య నిత్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇద్దరు మహిళా నేతల వంతొచ్చింది. పెతాపం నీదా? నాదా? మీ ఊరా, మా ఊరా…? రా… తేల్చుకుందాం అంటూ.. సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దీని గురించే హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ మధ్య పేలుతున్న మాటల తూటాలు ఎటు పోతాయోనన్న ఆందోళన సైతం పెరుగుతోంది రెండు వర్గాల్లో. ఈ ఇద్దరు నేతల మధ్య పాత పగలు లేవు. కుటుంబ గొడవలు అంతకంటే లేవు. కేవలం రెండేళ్ల నుంచే వివాదాలు మొదలయ్యాయి. అది కూడా రాజకీయ గొడవలే. కానీ…. దాన్ని ఇద్దరూ పర్సనల్‌గా తీసుకుంటున్నారట. అందుకే నిత్యం ఏదో ఒక అంశం మీద కయ్యానికి దిగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పరం అంటున్న మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. అయితే… ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ఇద్దరూ లోకల్ గొడవల్ని తీసుకెళ్లి.. ప్రత్యర్థి పార్టీ అధినేతలపై చిందులు తొక్కుతున్నారు . జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.. ఆయన్ని నుంచి మేము కాపాడామని అంటున్నారు మంత్రి సవిత….. అదే సమయంలో ఇటు ఉష శ్రీచరణ్‌ని ప్రశ్నిస్తే.. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
రోటీన్ గా సాగే వీరి మాటల యుద్ధం తాజాగా మరింత పీక్ స్టేజ్ కి వెళ్లింది. నువ్వు పెనుకొండకు ఏం చేశావో చెప్పాలంటూ మంత్రి సవితను మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ డిమాండ్ చేయగా.. అందుకు మినిస్టర్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎప్పటిలానే జగన్ నుంచి మొదలుపెట్టి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని, కొంతమంది వలస పక్షులు, వారి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలను రప్పా రప్పా అంటూ రెచ్చగొడుతున్నారని కామెంట్ చేశారు. జగన్ అయినా, ఉష అయినా అభివృద్ధి చేస్తుంటే సహకరించక పోగా ఓర్చుకోలేకపోతున్నారంటూ విమర్శించారు మంత్రి. గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉష శ్రీచరణ్ ఐదేళ్ళలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన18 నెలల్లో పెనుకొండ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో నేను చెప్తానని.. కళ్యాణదుర్గానికి నువ్వు చేసింది చెప్పాలంటూ మాజీమంత్రిని సవాల్ చేశారు మినిస్టర్. అందుకు ఉష శ్రీచరణ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు .మంత్రి సవితను పెనుకొండ నియోజకవర్గానికి చేశావో చెప్పమంటే జగన్ గురించి ఎందుకు మాట్లాడుతుంటారంటూ ఫైర్ అయ్యారు. జగన్ 2.0లో ఫస్ట్ టార్గెట్ నవ్వేనంటూ ఉషాశ్రీ వార్నింగ్ ఇచ్చారు..మొత్తం మీద ఈ మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.
Also Read
తాజావార్తలు
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!