Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాలపై ‘ఈగల్ ఫోర్స్’ విరుచుకుపడింది. రెండు వేర్వేరు ఔట్లెట్లపై ఏకకాలంలో జాయింట్ రైడ్స్ నిర్వహించిన అధికారులు, అక్రమ దందాను ఛేదించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న ఇద్దరు యజమానుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి 152 నిషేధిత ఈ-సిగరెట్లు, 34 ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు, 3 స్కానర్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఒక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వేప్స్ విక్రయిస్తూ ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కస్టమర్ల నుంచి నేరుగా వాట్సాప్‌లో ఆర్డర్లు స్వీకరించి, QR కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్లు పొందేవారు. ఆ తర్వాత ఆర్డర్ చేసిన వేప్స్ను పోర్టర్, రాపిడో వంటి డెలివరీ యాప్స్ ద్వారా కస్టమర్ల ఇళ్లకు పంపేవారు. ఈ క్రమంలో నిందితులకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను పరిశీలించగా.. అందులో రూ.2.31 కోట్లకు పైగా భారీ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
ఈ లావాదేవీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, హైదరాబాద్‌లోనే దాదాపు 130 మంది వేప్ వినియోగదారులను గుర్తించారు. అంతేకాకుండా.. బ్యాంకింగ్ లావాదేవీలను విశ్లేషించడం ద్వారా మొత్తం 351 మంది కొనుగోలుదారుల వివరాలను రాబట్టారు. కేవలం విక్రయదారులే కాకుండా.. వేప్స్ కొనుగోలు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. వేప్స్ అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన పూర్తి సప్లై చైన్‌ను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!