Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- చైనా గురించి భారత్ ఎప్పుడో హెచ్చరించింది, ఆ సమయంలో మేము వినలేదు..
- ఆర్థికంగా అతిగా ఆధారపడటంపై బెల్జియం ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Belgium: బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ చైనా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాపై ఆర్థికంగా అతిగా ఆధారపడతటం వల్ల యూరప్ ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే భారత్ గుర్తించి యూరప్‌ను హెచ్చరించినప్పటికీ, అప్పట్లో తాము దీనిని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన బెల్జియం ప్రధాని డివెవర్, ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కార్యక్రమంలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
చౌక విదేశీ వస్తువులు తమ మార్కెట్లను ముంచెత్తడాన్ని యూరప్ చాలా కాలంగా అనుమతించిందని, దీంతో స్థానిక పరిశ్రములు కుంటుపడ్డాయని, అదే సమయంలో కీలక వస్తువులు, సరఫరా కోసం యూరప్ ఇతర దేశాలపై మరింతగా ఆధారపడాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, బెల్జియం ప్రధాని చైనా పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, పెరుగుతున్న చైనా ఆర్థిక ప్రభావం, యూరప్ మార్కెట్లో చౌకైన చైనా వస్తువుల గురించి భావించవచ్చు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
యూరప్ కన్నా ముందుగానే భారత్ ఈ సమస్య గురించి హెచ్చరించిందని, కానీ ఆ సమయంలో మేము వినలేదని ఒప్పుకున్నారు. అతిగా ఆధారపడటం చివరకు రాజకీయ ఒత్తిడికి ఆయుధంగా మారే ప్రమాదం ఉందని బెల్జియం ప్రధాని అన్నారు. భారత ప్రధాని మోడీ చాలా కాలం క్రితమే ఈ మాట చెప్పారని గుర్తుచేసుకున్నారు. భౌగోళిక-రాజకీయ అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో భారత్‌ను బెల్జియం అత్యంత ముఖ్యమైన, విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని డి వెవర్ చెప్పారు. మా జాబితాలో భారత్ నంబర్-1 అని, భారత్ లిస్టులో లేకపోతే ఒక ప్రాథమిక విషయాన్ని కోల్పోయినట్లే అవుతుందని ఆయన అన్నారు. భారత్-బెల్జియం సంబంధాలను ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక రంగాల్లో “మరో స్థాయికి” తీసుకెళ్లాలని తమ దేశం కోరుకుంటోందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!