OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్కు దూరమైనట్టేనా? ఆ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారా? ఎప్పట్నుంచో జరుగుతున్న ప్రచారానికి తాజాగా బయటికి వచ్చిన ఓ వీడియో క్లారిటీ ఇచ్చేసిందా? ఏంటా వీడియో? అందులో ఏం చెప్పారు మల్లారెడ్డి? దాని గురించి ఇప్పుడు గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో తనదైన డిఫరెంట్ స్టైల్‌తో తరచూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి… తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అది కూడా…. తన వ్యాఖ్యలతోనే. ఆ మాటలు విన్న చాలా మందికి ఆయన ఇక కారు దిగేసినట్టేనా? బీఆర్ఎస్కు బైబై చెప్పేసినట్టేనా అన్న సందేహాలు వస్తున్నాయట. ఇంకొందరైతే… సందేహాల స్థాయి దాటిపోయి…ఆయన అంత క్లారిటీగా మాట్లాడేస్తుంటే…. ఎనీ డౌట్ అని కూడా గట్టిగా అంటున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే… తాజాగా ఓ సన్నిహితుడితో బర్త్‌డే కేక్ కట్ చేయించిన మల్లారెడ్డి…. కావాలని అన్నారో, కాకతాళీయంగా అన్నారోగాని ఆ మాటల చుట్టూనే కొత్త చర్చలు మొదలయ్యాయి. ఆయన ఏమన్నారో ఒక్కసారి వినండి. బీఆర్ఎస్కు దూరమయ్యానని నన్ను మర్చిపోతున్నారంటూ సన్నిహితుడితో అన్న మాటలు సరికొత్త చర్చకు దారితీశాయి. అంటే… మల్లన్న మానసికంగా ఇప్పటికే గులాబీ తోటకు దూరమయ్యారా అంటూ మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయవర్గాలు. అది నిజమేనా అన్నట్టు కొన్ని రోజులుగా పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు మల్లారెడ్డి. అలాగే పార్టీ నిరసన కార్యక్రమాలతో సైతం టచ్ మీ నాట్ అంటున్నారాయన. ఇక తాజాగా అనుచరుడి బర్త్‌డే సందర్భంగా అన్న మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో పాటు గులాబీ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు మాజీ మంత్రి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆయన దూరం అవ్వాలనుకోవడానికి కారణాలను కూడా అన్వేషిస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ సమావేశాల తర్వాతి నుంచి మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారని గుర్తు చేస్తున్నారు నాయకులు. అప్పుడు జరిగిన ఒక ఘటన కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని అంటున్నారు. తన పెళ్ళి 50 ఏళ్ల వేడుకను అత్యంత ఘనంగా చేసుకున్నారు మల్లారెడ్డి. అలాంటి కార్యక్రమానికి
కేసీఆర్ రాలేదంటూ కాస్త నారాజ్ అయ్యారంటూ అప్పట్లో చర్చ జరిగింది. పార్టీలోని కొందరు నాయకుల కారణంగానే… తన ఫంక్షన్‌కు కేసీఆర్ రాలేదని అప్పట్లో సన్నిహితుల దగ్గర అన్నారట ఆయన. ఇక నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మల్లన్న… ఈ మధ్యకాలంలో పార్టీ తీసుకున్న ఏ కార్యక్రమానికి అటెండ్ అవలేదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాలు , సభ్యత నమోదు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కానీ…. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క ప్రోగ్రామ్‌కు కూడా అటెండ్ అవలేదు మల్లారెడ్డి. అలాగే…ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు అన్ని సమావేశాలకు హాజరవుతున్న కేటీఆర్… మేడ్చల్ వైపు చూడలేదు. అసలు ఈ నియోజకవర్గంలో మీటింగ్ జరుగుతుందా లేదా అన్నది కూడా పార్టీ నాయకులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ పరిణామాలు జరుగుతున్న టైంలోనే… తాజా వీడియో బయటికి రావడంతో… ఇక ఆయన బీఆర్ఎస్కు దూరమైనట్టేనా అన్న చర్చలు మొదలయ్యాయి.అయితే బీఆర్ఎస్ లోని కొందరు నేతలు మాత్రం… మల్లారెడ్డికి వేరే ఆలోచనలు ఉన్నాయని, అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పిన మాజీ మంత్రి తన కుటుంబ సభ్యుల్లో తాను సూచించిన వారికి టికెట్లు ఇవ్వాలని కండిషన్లు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా చిట్ చాట్‌లో తన మనోగతాన్ని చెప్పారు కూడా. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుంచి నలుగురైదుగురు పోటీలో ఉంటారని, అది ఏ పార్టీ నుంచి అయినా కావచ్చని అన్నారు. ఇలా చెప్పిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవడంలాంటివి జరిగాయి. ఆ రెండు సందర్భాల్లోగాని, వెళ్ళి వచ్చాకగాని మల్లారెడ్డి కనీస సమాచారం ఇవ్వలేదని బీఆర్ఎస్ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలంగాణ భవన్లో చెప్పుకుంటున్నారు. ఇలాంటి రకరకాల పరిణామాలు జరుగుతున్న క్రమంలో… అసలు మల్లారెడ్డి మళ్లీ పార్టీకి దగ్గర అవుతారా? లేక తాను వీడియోలో అన్నట్టు నిజంగానే బీఆర్ఎస్కి దూరమవుతారా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాలంటున్నారు పరిశీలకులు.
Also Read
- Tags
- BRS
- malla redy
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
-
Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
-
Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!