OTR : ఆదినారాయణ రెడ్డి అలక వెనుక అసలు కథేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ… ఎమ్మెల్యేది అలకా…? అరాచకమా…? అధికార పక్షంలో ఉండికూడా… ఐ హర్టెడ్. నేను రాజీనామా చేసేస్తా….? గెలిపించిన పార్టీకి దూరమైపోతానంటూ రోజంతా హై డ్రామా ఎందుకు నడపాల్సి వచ్చింది? ఏది ఎమోషనల్ బ్లాక్మెయిల్లో భాగమా…? నిజంగానే హర్ట్ అయ్యారా? అదీ…ఇదీ… కాకుండా ఇంకేవో లెక్కలు ఆ శాససనభ్యుడిని వెంటాడుతున్నాయా? ఎవరాయన? ఏంటా రాజీనామా రచ్చ? అనుకున్నదొక్కటి…అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అంటూ బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గురించి చర్చ జరుగుతోందట పొలిటికల్ సర్కిల్స్‌లో. ఐ హర్టెడ్… నేను అలిగా… బుంగమూతి పెట్టుకున్నా అంటూ… ఆయన జమ్మలమడుగు నుంచి అమరావతి వెళ్ళి నానా హంగామా చేయడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఎందుకలా చేశారంటూ పార్టీ వర్గాలు కూడా రకరకాల యాంగిల్స్‌లో ఆరా తీస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేగా కడప జిల్లాలో అన్ని విషయాల్లో చక్రం తిప్పుతున్న ఆది… ఇప్పుడు అలిగి, అమరావతిలో చిన్న పిల్లాడిలా గోల చేయాల్సి పరిస్థితి ఎందుకొచ్చిందంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. నిరుడు జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మొదలు, నిన్నటి మున్సిపల్, పరిషత్, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల వరకు… తన నియోజకవర్గం దాటి జిల్లాలోని ఎనిమిది సెగ్మెంట్స్‌లో వేలే కాదు, కాళ్లూ తల అన్నీ పెట్టి మేనేజ్ చేశారు ఆదినారాయణ రెడ్డి.
ఇంకా చెప్పాలంటే…ఈ ఎన్నికల ప్రక్రియలో… బీజేపీకంటే టీడీపీ పెద్దలతోనే ఆయన ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరపారని అంటారు. టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్ష పదవిని తన సోదరుడి కుమారుడికి ఇప్పించుకోవడంలో ఆదిదే కీలక పాత్ర అని చెప్పుకుంటారు. కానీ… తాజా పరిషత్ ఎన్నికల పరిణామాలు ఆయనకు షాకిచ్చాయని, దాని ఫలితంగానే జమ్మలమడుగు నుంచి అమరావతికి పరుగులు పెట్టాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. తన సోదరుడి కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డిని జమ్మలమడుగు జడ్పీటీసిగా, మరో సోదరుడి కుమారుడు గోవర్థన్ రెడ్డిని ముద్దనూరు జడ్పీటిసీగా ఏకగ్రీవంగా గెలిపించుకున్నారాయన. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ సీటు వీళ్ళలో ఒకరికి దక్కుతుందని ఆశించారు. కానీ… అనూహ్యంగా….బీజేపీ కోటాకు వెళ్తుందనుకున్న జడ్పీ ఛైర్మన్ సీటును టీడీపీ ఓన్ చేసుకుంది. సరిగ్గా ఇక్కడే ఎమ్మెల్యేకి మండిపోయిందట. మాకు దక్కుతుందని ఫిక్స్ అయిన జిల్లా పరిషత్ పీఠంపై వేరే ఎవరో కూర్చుంటే చూస్తూ ఎలా ఉంటామంటూ ఫైరైపోతున్నారట ఆదినాయణరెడ్డి. ఆ విషయంలోనే తాడోపేడో తేల్చుకునేందుకే అమరావతి బాట పట్టారని, అవసరమైతే బీజేపీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం కూటమిలోని కుమ్మలాటలను బయట పెట్టిందని అంటున్నారు.
Also Read
కడప జిల్లాలో బీజేపీ తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ఆది. కానీ… ఆయన జమ్మలమడుగుకే పరిమితం అవకుండా… జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, ప్రత్యేకించి టీడీపీ వ్యవహారాల్లో కూడా తలదూర్చడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసహనం ఉన్నా… ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నారట. కానీ… ఇప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంలో మాత్రం ఆయన దూకుడుకు వాళ్ళే బ్రేక్ వేసినట్టు చెప్పుకుంటున్నారు. మెజార్టీ ఉన్న తమను కాదని, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీకి జడ్పీ ఛైర్మన్ ఎలా ఇస్తారని, అదీకూడా… ఆదినారాయణ రెడ్డి చెప్పిన ఆయన కుటుంబ సభ్యులకు ఇస్తే….మా పరిస్థితి ఏంటంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడ్డం తిరిగినట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు అలా పట్టుబట్టిన క్రమంలోనే కడప జడ్పీ చైర్మన్ పీఠం ఆ పార్టీ కోటాలో పుత్తా నరసింహారెడ్డికి దక్కిందని అంటున్నారు. సరిగ్గా ఈ విషయంలోనే ఫ్రస్ట్రేట్ అయిపోయిన ఆదినారాయణరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టిమరీ…తన అసంతృప్తిని బహిర్గతం చేశారట. కడప జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాలు ఉండగా అందులో 32 టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. బీజేపీ మూడు, జనసేన రెండు చోట్ల గెలిచాయి. 32 సీట్లున్న తమను కాదని, మూడు సీట్లున్న బీజేపీకి ఛైర్మన్ ఎలా ఇస్తారన్నది టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్న. ఈ పరిణామాలే ఆదిలో అసహనాన్ని పెంచాయని అంటున్నారు.
జడ్పీ చైర్మన్ పీఠంపై తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డిని కూర్చొబెట్టి మురిసిపోవాలనుకున్న ఆదినారాయణరెడ్డి ప్లాన్ బెడిసికొట్టడంతోనే… రాజధానికి చేరుకుని ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్ర స్థాయిలో తన వాణి వినిపించాలనుకున్నట్టు అంచనా వేస్తున్నారు. కథలో ఇంకో కీలక మలుపు ఉందన్నది కొందరి వాదన. కడప జడ్పీ పీఠం తమకే వస్తుందన్న ధీమాతో ఆదినారాయణరెడ్డి అనుచరులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు చాలా మంది భారీగా బెట్టింగ్స్ వేశారట. తీరా… అది టీడీపీ కోటాలోకి వెళ్లడంతో…బెట్టింగ్స్ కాసిన చాలామంది ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారని, దీంతో… ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాని ఫ్రస్ట్రేషన్‌లోనే ఆయన అమరావతి బాట పట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ఊపులోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మీద కూడా చిర్రుబుర్రులాడారట. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే… జమ్మలమడుగు స్వగృహంలో ఉన్న ఆదినారాయణ రెడ్డికి రాత్రి 10 గంటల సమయంలో కూడా ఓ మంత్రి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడంతో ఆనందానికి హద్దులు లేవట. కానీ… గంటల వ్యవధిలోనే మొత్తం తిరగబడటంతో మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు కూటమిలో కుమ్ములాటలకు దారి తీస్తాయా? ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!