Off The Record : జనసేనలో మరో డర్టీ పిక్చర్..? ఎమ్మెల్యే పై ₹60 లక్షల ఇల్లు వివాదం..!
- అరవ శ్రీధర్ ఎపిసోడ్ ముగియకముందే మరో వివాదం
- ఈసారి పెళ్ళి అయిన ఎమ్మెల్యే మీద ఆరోపణలు
- దుమారం రేపుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి ఎమ్మెల్యే వ్యవహారం
- ఇప్పటికే బెట్టింగ్, పేకాట క్లబ్‌ల ఆరోపణలపై పవన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేనలో మరో డర్టీ పిక్టర్ నడుస్తోందా? పార్టీ పరువు బజారుకు లాగడానికి ఇంకో అరవ శ్రీధర్ రెడీ అయ్యారా? సార్… వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్ళాయా? భారీ ఖర్చుతో కట్టించిన ఇంటిని ఇతరులకు గిఫ్ట్‌గా ఇచ్చారన్నది నిజమేనా? ఎమ్మెల్యే భార్య పవన్‌ని కలిసి ఫిర్యాదు చేయాలనుకుంటున్నా అపాయింట్మెంట్ దొరకడం లేదన్నది నిజమేనా? ఎవరా వివాదాస్పద శాసనసభ్యుడు? ఏంటా వ్యవహారం? జనసేన అధిష్టానం ఇప్పుడో క్లిష్టమైన సమస్యని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. కొట్టాం…. హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో కుంభస్థలాన్ని కొట్టేశామని ఆనందిస్తూ…. ఆ పవర్‌ని ఎంజాయ్ చేయాలో లేక పార్టీ నేతలు కొందరు వేసే చిల్లర వేషాలకు తలపట్టుకోవాలో అర్ధంకాని సంక్లిష్ట స్థితిలో ఉన్నారట గ్లాస్ పెద్దలు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఎపిసోడ్ పూర్తిగా చల్లారకముందే ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడి బాగోతం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా మారింది. అరవ శ్రీధర్‌కి పెళ్ళవలేదు. పెళ్ళి చేసుకుంటానని మోసగించాడన్నది సదరు యువతి ఆరోపణ.
కానీ…. ఇప్పుడు హాట్ టాపిక్ అయిన ఎమ్మెల్యేకి మాత్రం పెళ్లి అయింది. యువకులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రిస్క్ తీసుకుని మరీ… కొత్త తరానికి అవకాశాలు ఇస్తే…. ఇప్పుడు వాళ్ళే తలనొప్పిగా మారుతున్నారన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే నడుస్తున్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారమే పార్టీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసిందని అనుకుంటుండగానే… ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఆయన ప్రవర్తనకు సొంత పార్టీ నేతలే షాకవుతున్నారట. అంతేకాదు… అతన్నెవరికన్నా చూపించండర్రా అని సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలోని ఒక నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం గెలవడానికి ముందు, గెలిచాక అన్నట్టుగా తయారైందట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఇప్పటికే బెట్టింగ్‌లు, పేకాట క్లబ్‌ల ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అది పెద్ద రచ్చ అవడంతో…పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించి అప్పట్లో గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారు కూడా. అయినా సదరు శాసనసభ్యుడి తీరులో పెద్దగా మార్పు రాలేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో ఓ మహిళ కోసం సుమారు 60 లక్షల రూపాయలతో కొత్త ఇల్లు కట్టించి ఇచ్చి దగ్గరుండి గృహప్రవేశం చేయించారన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాకుండా వ్యక్తిగత సిబ్బంది ద్వారా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు జనసేన వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ వివాదంలో చిక్కుకుని పార్టీని కూడా ఇరకాటంలోకి నెట్టగా…. ఇప్పుడు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ఇంకెన్ని తలనొప్పులు తెస్తాడోనని కంగారు పడుతున్నారు జనసైనికులు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే…సదరు ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసేందుకు ఆయన భార్య, బావమరిది, మరి కొందరు కుటుంబ సభ్యులు కలిసి పవన్‌కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పవన్‌ను కలవడానికి నెలలుగా ప్రయత్నిస్తున్నా… అవకాశం రావడంలేదని ఎమ్మెల్యే భార్య తరఫు వ్యక్తులు చెపుతున్నారు.
ఇక గతంలో కూడా ఆయనగారి మీద వసూళ్లకు సంబంధించి పలు ఆరోపణలు వచ్చాయని, అయినప్పటికీ పార్టీ తరఫున చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన యాక్షన్ లేకపోవడం వల్లే…. ఒకర్ని చూసి ఒకరు అన్నట్టు ఇలాంటి వ్యవహారాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం జనసేన నాయకుల్లో కూడా వ్యక్తమవుతోంది. గృహప్రవేశం ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యే వ్యవహారం బయటికి రావడం, రచ్చ అవుతుందన్న ఉద్దేశ్యంతో… పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా…స్థానిక నాయకత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం. ఈ ఇష్యూ ను అంతర్గతంగా సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. అయితే సదరు ఎమ్మెల్యే భార్య మాత్రం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్‌ను కలిసి ఈ వ్యవహారాన్ని నేరుగా ఆయన ముందే పెట్టాలని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే మరో అరవ శ్రీధర్ అవుతారా లేక అంతర్గతంగా సెట్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
- Tags
- janasena
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!