OTR: తన బయోపిక్ పక్కన పెట్టి సోనియా గాంధీపై సినిమా? జగ్గారెడ్డి ప్లాన్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ… సీరియస్ పొలిటీషియన్‌కు ఇప్పుడు సినిమా ప్రేమ ఎందుకు పుడుతోంది? మొన్న తన జీవిత చరిత్ర మీద సినిమా అన్నారు. ఇప్పుడేమో… కాదు కాదు… సోనియా గాంధీ పుస్తకాన్నే సిల్వర్ స్క్రీన్కు ఎక్కిస్తానంటున్నారు. అసలాయనకు ఈ సినిమాల మోజేంటి? ఆయన రాజకీయాలకు, ఈ మూవీ ప్లాన్స్‌కు ఉన్న లింకేంటి? ఎవరా లీడర్? ఏంటా మూవీ మేటర్? తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ జగ్గారెడ్డి. కానీ….ఈ మధ్య ఆయనకి సినిమాల మీద మోజు పెరిగినట్టు కనిపిస్తోందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. నిన్న మొన్నటి దాకా… తన జీవిత చరిత్రపై సినిమా తీస్తానన్న జగ్గన్న… ఇప్పుడు ఏకంగా సోనియా గాంధీ రాసిన పుస్తకంపై సినిమా తీస్తానని ఎందుకు ప్రకటించారంటూ చర్చ జరుగుతోంది. ముందైతే…. జగ్గారెడ్డి అనే టైటిల్‌తోనే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారాయన. అందుకు సంబంధించిన కొంత వర్క్ కూడా జరిగిందట. తన తల్లి జమ్మాయమ్మ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలని ఫిక్స్ అయినట్టు చెప్పుకున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
అయితే ప్రస్తుతం తన సినిమాకి బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు సోనియా గాంధీ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా తీయాలని డిసైడయ్యారట ఈ కాంగ్రెస్ సీనియర్. సోనియా రాసిన పుస్తకంలోని అంశాలను చూసిన తర్వాత ఆయనకు సినిమా తీయాలని ఎందుకు అనిపించిందన్నది అసలు ప్రశ్న. ఆ సినిమా తీసి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారనే చర్చ కూడా సహజంగానే జరుగుతోంది. ఇవన్నీ కాదు…అసలు జగ్గారెడ్డికి ఆ సినిమాపై ఆసక్తి ఎందుకు పెరిగిందన్నది ఇంకో క్వశ్చన్. అందుకు సమాధానంగానా అన్నట్టు సోనియా రాసిన పుస్తకంలోని అంశాలలో తన జీవితానికి ముడిపడి ఉండే, సారూప్యత కలిగిన అంశాలు ఉండటంతో…ముందు ఆ సినిమానే తీయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన జగ్గారెడ్డికి.. అన్నీ తానై… పెంచారట తల్లి జమ్మాయమ్మ. తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు సంగారెడ్డికి ఇందిరాగాంధీ వస్తే.. తన తల్లి తనను కూడా వెంటపెట్టుకుని ఒకరోజు ముందే సభా ప్రాంగణం దగ్గరికి వెళ్లి కూర్చున్నారంటూ గుర్తు చేసుకుంటున్నారట ఆయన.
Also Read
కొడుకుని రాజకీయ నాయకుడిని చేయాలనే తపన అప్పట్లోనే జమ్మాయమ్మకు ఉండేదని వివరిస్తున్నారు. దాదాపుగా అలాంటి స్టోరీనే సోనియా గాంధీ రాసిన పుస్తకంలో ఉండడంతో… జగ్గారెడ్డి సింక్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఈ దేశానికి కోడలుగా వచ్చిన సోనియాగాంధీ… ఇందిర, రాజీవ్ చనిపోయాక ఇక్కడి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇద్దరు పిల్లలని పెంచి.. కాంగ్రెస్ లాంటి మహా వృక్షంలోని రాజకీయాలను చదివి… తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ కొంత తన జీవితానికి సింక్ అవడంతో ఆ పుస్తకాన్నే సినిమాగా తీయాలని ఫిక్స్ అయ్యారట. సాధారణంగానే జగ్గారెడ్డికి గాంధీ ఫ్యామిలీ అంటే పిచ్చి. అలాంటి కుటుంబం నుంచి సోనియాగాంధీ తన జీవితా అనుభవాలను పుస్తకం రూపంలో బయటికి ఇవ్వడంతో ఆయన మనసు మారిందని అంటున్నారు.
ఈ దేశానికి కోడలుగా వచ్చిన సోనియా గాంధీ ఎంతో శ్రమపడి… ఇక్కడి సాంప్రదాయాలకు అనుగుణంగా నిలబడి… దేశంలోనే స్ట్రాంగెస్ట్ ఉమెన్ గా ఎదిగిన తీరు పట్ల జగ్గారెడ్డి ఇంప్రెస్ అయ్యారన్నది ఆయన సన్నిహితుల మాట. దీనికి తోడు తన జీవితానికి సంబంధించిన ఘటనలు కూడా తోడవడంతో…. సినిమా తీయడానికి ముందడుగు వేశారని అంటున్నారు. తనపై తీయాలనుకున్న సినిమాను కూడా వాయిదా వేసుకుని… సోనియాగాంధీ పుస్తకం ఆధారంగా తీయాలని డిసైడ్ అవడానికి అదే కారణం అంటున్నారు. రాజకీయ నాయకులు ఏం చేసినా దాని వెనక ఏదో ఒక వ్యూహం ఉంటుందనేది సహజంగా జరిగే చర్చ. ఆ లెక్కన జగ్గారెడ్డికి కూడా అలాంటి వ్యూహం ఏదైనా ఉందా అనే అనుమానాలకు తావివ్వకుండా.. తన జీవిత అనుభవాలు.. సోనియాగాంధీ పుస్తకంలో అంశాల్ని కలిపి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారన్నది ఇన్సైడ్ టాక్.
- Tags
- jaggareddy
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!