Site icon NTV Telugu

Off The Record: ఆ ముగ్గురు IASల బదిలీల వెనుక కారణాలు ఏంటి..?

Ias

Ias

Off The Record: ఆ ముగ్గురు ఐఎఎస్‌ల బదిలీ వెనక కారణాలేంటి? పనిలో అసమర్ధతా? లేక అవినీతి, అక్రమాల ఆరోపణలా? ఇంతకు వారికి ఇచ్చింది ప్రమోషనా? డిమోషనా? ఏం చేశారో అర్ధంకాని రీతిలో ట్రాన్స్‌ఫర్స్‌ ఎందుకయ్యాయి? ఎవరా బ్యూరోక్రాట్స్‌? ఏంటా కథ?

Read Also: Pahalgam Terror Attack: జిప్‌లైన్ ఆపరేటర్ మూడుసార్లు అల్లాహు అక్బర్ అన్నాడు.. ఆపై కాల్పులు

20 మంది ఐఏఎస్ అధికారులను తాజాగా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ సీఎస్ స్థాయి నుంచి నాన్ క్యాడర్ ఐఏఎస్ వరకు బదిలీలు చేయగా… కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. పాలనా సౌలభ్యం కోసం ఇలాంటి ట్రాన్స్‌ఫర్స్‌ సాధారణమే అయినా…. ఈసారి మాత్రం కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. పదేళ్ల నుంచి ఒకే పదవిలో కొనసాగుతూ వచ్చిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను ఇప్పుడు సీఎంవోలోకి తీసుకున్నారు. సుదీర్ఘ కాలం ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్‌ను సీఎం కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగానికి కార్యదర్శిగా బదిలీచేసింది సర్కార్‌. స్మార్ట్‌ ప్రొయాక్టివ్‌ ఎఫిషియంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ…. స్పీడ్‌ విభాగానికి కూడా ఆయనను సీఈవోగా నియమించింది. క్రీడలు, యువజన విభాగం, ఆర్కియాలజీ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లి వచ్చారు జయేష్‌. ఈసారి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారని, అందుకోసం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిశారన్న ప్రచారం జరిగింది. కానీ… సీఎస్ రేసులో ఉన్న జయేష్‌ను సీఎంవోలోకి తీసుకుని… రామకృష్ణరావును సీఎస్‌గా నియమించారు. దీంతో జయేష్ఆ పదవి పై పెట్టుకున్న ఆశలు ఆడియశాలయ్యాయి. ఇక బదిలీల్లో మరో సీనియర్ ఐఏఎస్‌ డిమోట్‌ అయ్యారన్న చర్చ జరుగుతోంది సెక్రటేరియట్ వర్గాల్లో. ఎం.దానకిషోర్ మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చారు. ఆయన్ను ఆ భాద్యతల నుంచి తప్పించి.. కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్, లేబర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, ఎంప్లాయ్‌మెంట్ & ట్రైనింగ్ డైరెక్టర్ గా నియమించింది.

Read Also: Off The Record: మావోయిస్టులతో చర్చలు.. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందా..?

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన కిషోర్‌కు ప్రాధాన్యత పెరిగిందని… గతంలో కంటే కీలక శాఖలల్లో ఆయన్ను రేవంత్ సర్కారు నియమించిందన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ…వాస్తవంగా ఆయనకు ఇవ్వాలనుకున్నది వేరని, తీరా జరిగింది ఇంకొకటని, అందుకే డిమోషన్‌ మాటలు వినిపిస్తున్నాయంటున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన దానకిషోర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినా… ఆయన పనితీరు నచ్చక ఇతర శాఖలకు బదిలీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ముందసలు దాన కిషోర్ ను సీఎంవోలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారట. కానీ… ఆయన పర్ఫార్మెన్స్ బాగోలేదని ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదికతో అభిప్రాయం మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇక పర్యాటక, యువజనశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ పోస్టులోకి బదిలీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో చేసిన రీ పోస్ట్‌పై వివాదం రేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ స్మిత మీద తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో తిరిగి సచివాలయం బయట ఉండే ఆర్థిక కమిషన్‌ కార్యాలయానికి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. స్వయంకృతంవల్లే మళ్ళీ డిమోషన్ అయినట్లు సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది.

Read Also: Sri Vishnu : నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు.. శ్రీవిష్ణు క్లారిటీ

ఇక, సీనియర్ ఐఏఎస్ అయిన స్మితాసభర్వాల్‌ ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారని, కాంగ్రెస్‌ సర్కార్‌తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు కూడా అంటున్నారు. పర్యాటక శాఖలో ఫైల్స్ అన్నీ పెండింగులోనే పెట్టారని… సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు సైతం రెగ్యులర్‌గా రావడంలేని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది రోజుల నుంచి స్మితా ఈ వ్యవహారాలను మానిటర్‌ చేస్తున్నారు. ఆదివారం జరిగిన బదిలీల్లో స్మితను పర్యాటక శాఖ భాద్యతల నుంచి తప్పించడంతో ఆ పదవిని ఎవరితో భర్తీ చేస్తారోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరంగా ఇక పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటోందని, ఇక ఎవ్వర్నీ ఉపేక్షించే ప్రసక్తి ఉండకపోవచ్చని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version