OTR : హరీష్ రావును టార్గెట్ చేసిన కాంగ్రెస్! మైనంపల్లి ఆపరేషన్ సిద్ధిపేట సక్సెస్ అవుతుందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ఆయనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందా?గతంలో వాళ్లు వేసిన స్కెచ్‌నే…ఇప్పుడు మళ్లీ వీళ్లు సైతం అమలు చేసే పనిలో ఉన్నారా..! ఆయనను అక్కడే ఫిక్స్ చేయాలనే ఆలోచన ఎంత వరకు వర్కవుట్ అవుతుంది..!? సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గడువు దగ్గర పడుతోంది. అధికార పార్టీ అప్పుడే హడావుడి మొదలుపెట్టింది. వచ్చే రెండు..మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సిద్ధిపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టాస్క్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఐతే…అది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేదే ఇప్పుడు ఇంటరెస్టింగ్‌గా మారిందట. ఆ విషయం పక్కన పెడితే…మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. గతంలో BRS అధికారంలో ఉన్నప్పుడు.. కాంగ్రెస్ ముఖ్యనేతలను బయటకు వెళ్లకుండా నియోజకవర్గానికే పరిమితం చేసేలా ఎత్తుగడ వేసే వాళ్లు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఎత్తుగడ అమలు చేసే పనిలో పడిందట. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల బాధ్యత…మైనంపల్లి హన్మంతరావుకు పార్టీ అప్పగించింది. BRS నేత హరీష్‌ను…అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి మైనంపల్లిని ఎంచుకుంది కాంగ్రెస్.
సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేది మైనంపల్లి వ్యవహార శైలిపైనే ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హరీష్‌ను బలంగా ఎదుర్కోవడానికి ఓ నాయకుణ్ణి ఎంచుకోవాలని భావించిన కాంగ్రెస్…ఆ బాధ్యతను మైనంపల్లికి అప్పగించిందట. మైనంపల్లి సిద్ధిపేటకు వెళ్లిన రోజే కేటీఆర్…మైనంపల్లి నియోజకవర్గంలో సమావేశం పెట్టారు. దీంతో మైనంపల్లి…గాంధీభవన్ వేదికగా…కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఇప్పటికే సిద్ధిపేటలో మైనంపల్లి మున్సిపల్ ఎన్నికల పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఐతే ఇక్కడ BRSను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు సవాలుగా మారనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులను కలుపుకొనిపోవడం కూడా మైనంపల్లికి ఛాలెంజింగ్ టాస్క్‌గా మారబోతోందట. ఇప్పటికే గజ్వేల్ నర్సారెడ్డి-మైనంపల్లికి మధ్య కొంత గ్యాప్ ఉందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో…సిద్ధిపేట కాంగ్రెస్ నాయకులను కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ భావిస్తోందట.
Also Read
సిద్ధిపేటలో సొంతపార్టీ నేతలను కాపాడుకుంటూనే…మైనంపల్లి వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుందని భావిస్తున్నారు పార్టీ క్యాడర్. ఇక్కడ హరీష్ రావు లాంటి నేతను ఎదుర్కోవడం అంటే అంత ఈజీగా అయ్యే పనేనా అనే చర్చ జరుగుతోంది. మరి మైనంపల్లి వద్ద ఉన్న పొలిటికల్ స్కెచ్ ఏంటి? ప్రత్యర్థికి అటు మాటలు…ఇటు చేతలు ఉన్న నేతగా పేరుంది. అలాంటి నాయకుడిని ఎదుర్కొని మైనంపల్లి…ఆపరేషన్ సిద్ధిపేటలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి..!?
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!