Site icon NTV Telugu

Off The Record: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి గ్యాప్ పెరుగుతుందా..?

Rr

Rr

Off The Record: ఉద్యోగ సంఘాలకు, తెలంగాణ సర్కార్‌కు మధ్య గ్యాప్‌ పెరుగుతోందా? అందుకే ముఖ్యమంత్రి నోటివెంట ఆ మాటలు వచ్చాయా? ఏడాదిన్నరగా ఎప్పుడూ ఆ స్థాయిలో మాట్లాడని ముఖ్యమంత్రి స్వరం సడన్‌గా ఎందుకు మారింది? ఉద్యోగుల సమర నినాదం వెనకున్న వ్యూహం ఏంటి? ముగ్గురు ఐఎఎస్‌ల కమిటీ వివాదాన్ని పరిష్కరించగలదా? ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఎక్కడ తేడా కొట్టింది?

Read Also: India Pakistan: ‘‘నోటామ్’’ జారీ చేసిన భారత్.. పాక్ సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విన్యాసాలు..

తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక, సమరమే అంటూ.. ఉద్యోగ సంఘాల జేఏసీ పేరుతో వచ్చిన ప్రకటనపై సీఎం తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అడగడం, ఆ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడం లాంటివి సహజమే. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు వేరు కాదు. కానీ, ఇప్పుడు కొన్ని ఉద్యోగ సంఘాలు అనుసరిస్తున్న వ్యవహార శైలిపై ప్రభుత్వ పెద్దలకు కాస్త భిన్నమైన అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ .. ఒకటి…రెండు సంఘాలు వాళ్ళు ఏం చెప్తే అదే అన్నట్టుగా ఉండేదట. అలాగే… సంఘాల నేతలు కూడా గవర్నమెంట్‌ మాట జవదాటకుండా.. తలూపేసి ఉద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టారన్న విమర్శలు సైతం ఉన్నాయి.

Read Also: Rajinikanth : రజినీకాంత్ ’కూలీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ నెలలోనే..

ఇక, అదే సమయంలో.. బీఆర్‌ఎస్‌ లీడర్స్‌కంటే ఎక్కువగా ఉద్యోగ సంఘాల నేతలు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ని విమర్శించేవారన్న అభిప్రాయం ఉంది. ఉద్యోగులు ఒక రాజకీయ పార్టీ వ్యవహారాల మీద కామెంట్‌ చేయడాన్ని అప్పట్లో కాంగ్రెస్ నేతలు కొంత సీరియస్ గానే తీసుకున్నారు. అటు ఎంప్లాయిస్‌ యూనియన్స్‌ లీడర్స్‌ తీరు మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ వ్యవహారాల ప్రభావమో… మరోటోగానీ….. ఇప్పటికీ ఆ సంఘాల నేతలతో కొందరు మంత్రులు కూడా టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓ మంత్రి గ్యాప్‌ను తగ్గించే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్‌ కాలేదని తెలిసింది. అదే సమయంలో గత పదేళ్లలో ఎప్పుడూ నోరు మెదపని వాళ్ళు, ఒకటో తేదీన జీతాలు ఇవ్వకున్నా కామ్‌గా ఉన్నవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్‌ అటాక్‌ చేయడాన్ని సహించలేకపోతున్నారట ప్రభుత్వ పెద్దలు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పినా … సమరమే అంటూ స్టేట్మెంట్ ఇవ్వడమంటే… ప్రభుత్వాన్ని రెచ్చ గొట్టే ప్రయత్నం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట.

Read Also: Samantha : అల్లు అర్జున్-అట్లీ మూవీలో నటించట్లేదు..

గతంలో వీఆర్వోలను ఉద్యోగాల నుండి తొలగించినా కూడా నోరు మెదపని సంఘాల నేతలు ఇప్పుడు తిరుగుబాటు అనే వరకు వచ్చారని, అందుకే.. వాళ్ళ విషయంలో కాస్త కఠినంగానే స్పందించాలని సర్కార్‌ పెద్దలు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. మొదట ఆర్ధిక పరిస్థితిని తెలియచేస్తూనే.. కాస్త సమయం ఇచ్చి సమస్యను పరిష్కారం చేసుకుందాం అనే ఆలోచనలో ఉందట ప్రభుత్వం. ఆ దిశగానే ఉద్యోగ సంఘాలకు ఇండికేషన్ ఇవ్వాలని చూసినా.. ఆ సంగతి పట్టించుకోకుండా, సమరమే అనే వరకు రావడం వెనక ఏదో ఉందని అనుమానిస్తోంది ప్రభుత్వం. కొన్ని ఉద్యోగ సంఘాల వెనక… ఓ రాజకీయ పార్టీ ఉండి మాట్లాడిస్తోందన్న అనుమానం ప్రభుత్వానికి ఉందంటున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే… రాజకీయ పార్టీల చేతిలో పావులు అవకండని సీఎం రేవంత్ కామెంట్స్ చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో సంఘాలను కలుపుకుని పని చేస్తామంటూ భరోసా ఇచ్చారు సీఎం.

Read Also: Pawankalyan : వీరమల్లుకు కొత్త చిక్కులు.. వాళ్లతో పోటీ తప్పదా..?

కానీ, ఇప్పుడు కొందరు ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్న తీరు చూసి సిఎం అలా రియాక్ట్‌ అయి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయవర్గాల్లో. గతంలో రెవెన్యూ ఉద్యోగుల పట్ల నెగిటివ్ కామెంట్స్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి. అప్పుడు కూడా పెద్దగా స్పందించలేదని… ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చూసి కూడా ఉద్దేశ పూర్వకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కాలు దువ్వుతున్నారన్నది సర్కార్‌ పెద్దల అభిప్రాయం అట. ఏదేమైనా…. ఉద్యోగ సంఘాల వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేబినెట్‌ సబ్ కమిటీ పిలిచి మాట్లాడితే…. పరిస్థితి నార్మల్‌ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సర్కార్‌ పెద్దలు దీన్ని ఎలా సెట్‌ చేస్తారో చూడాలి మరి.

Exit mobile version