OTR : తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడువు ముగుస్తోంది… టైం దగ్గర పడుతోంది…. క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం కామ్‌గా ఉన్నారు. ఏం జరగబోతోంది…? అసలేం జరగబోతోంది…? మేరా నంబర్ కబ్ ఆయేగా? అంటూ కాంగ్రెస్ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నారట. వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కోరకమైన కంగారు అయితే… అందరిలోనూ భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరువాళ్లు? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది ప్రస్తుతం బాగా టెన్షన్లో ఉన్నారట. అందుకు కారణం కొందరిది భయమైతే….. మరికొందరిది ఆశ. ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా… పదవులు భర్తీలో జాప్యం ఎందుకన్నది కొంత మంది క్వశ్చన్. అలాంటి వాళ్ళంతా నాకెప్పుడూ పదవి వస్తుందంటూ ఆశగా చూస్తున్నారు. ఎంత చూసినా… ఇంకా ముందుకు రావడంలేదు, కాలం గడిచిపోతోందన్నది వాళ్ళ టెన్షన్. ఇందులో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేసిన నాయకులు సైతం ఉన్నారు. ప్రతిసారి… ఈ నెల, వచ్చే నెల అంటూ గడువు పెడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్. క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయిగానీ.. మాకు మాత్రం పదవులు దక్కడం లేదని కంగారు పడుతున్నారు నామినేటెడ్ పదవుల ఆశావహులు. నాయకుల్ని డిజప్పాయింట్ చేయడం కాకపోతే… ఇదేంటన్న వాదన సైతం పార్టీలో ఉంది. ఇటీవల కొన్ని కులాల ప్రాతిపదికన కార్పొరేషన్లు, ఫెడరేషన్స్‌కు చైర్మన్స్ని నియమించారు. కానీ… మిగిలిన వాటి సంగతి ఏంటన్నది బిగ్ క్వశ్చన్. అటు ప్రభుత్వం వచ్చిన మొదట్లో 37 మంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని కట్టబెట్టింది. ఈ నెలాఖరుతో వాళ్ళ పదవీకాలం కూడా పూర్తి కావస్తోంది. దీంతో వాళ్ళంతా కూడా రెన్యువల్ కోసం టెన్షన్‌గా చూస్తున్నారు. వాళ్ళలో ఎంత మందికి ఎక్స్టెన్షన్ ఇస్తారు, ఎందర్ని పక్కనపెడతారన్న చర్చలు సైతం ఉన్నాయి. ఇక ప్రభుత్వం గనక కసరత్తు మొదలుపెట్టి భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే… పాత పోస్ట్‌లు 37, కొత్తగా మరో 20 నుంచి 25 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది.
అటు ఇటుగా 100 మంది నాయకులను నామినేటెడ్ పోస్టుల్లో అకామిడేట్ చేయాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. అయితే ప్రస్తుతం పదవుల్లో ఉన్న 37 మంది నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఇటీవల 12 నుంచి 13 మంది కార్పొరేషన్ చైర్మన్ లకు సంబంధించిన వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో నివేదిక కోరిన జాబితాలో ఉన్న వాళ్లను కొనసాగించే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. కానీ… సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉందన్నది ఎవరికీ అంత చిక్కటం లేదు. ఇప్పుడున్న వారిలో 5 లేదంటే ఆరుగురికి మాత్రమే రెన్యువల్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ కోసం పనిచేయడం మానేశారని.. కేవలం ప్రోటోకాల్‌ని ఎంజాయ్ చేస్తున్నారన్న అభిప్రాయం పెద్దల్లో ఉందట. కేవలం పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్న వాళ్ళకే ఛైర్మన్ పదవుల రెన్యువల్ ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన అరడజన్కు మించి రెన్యువల్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, అన్వేష్ రెడ్డి, మెట్టు సాయికుమార్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్ .. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని మాత్రమే కొనసాగించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. పదవుల భర్తీ… రెన్యువల్ విషయంపై త్వరలోనే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వారంలో దీనిపై కసరత్తు జరగవచ్చన్నది పార్టీ వర్గాల మాట. మొత్తానికి గడువు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులకుల్లో టెన్షన్ పెరిగిపోతోందట. కొనసాగిస్తారా లేదా అని పదవుల్లో ఉన్నవాళ్లు, ఇప్పుడు కాకుంటే ఇక పదవి రాదని ఆశావహులు కంగారుగా ఎదురు చూస్తున్నారు.
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
తాజావార్తలు
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క