Site icon NTV Telugu

Off The Record: సీఎం రేవంత్ ని నాడు వద్దన్న నేతలే.. నేడు పోటీ పడి పిలుస్తున్నారా?

Nlg

Nlg

Off The Record: ఏడాదిన్నర ఆయనకు నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టిన వాళ్ళే నేడు రండి…రండి…రండి అంటూ సాదర స్వాగతాలు పలుకుతున్నారు. మీ సేవలు మాకు అక్కర్లేదు. మా సంగతి మేం చూసుకోగలం అంటూ… గొప్పలకు పోయినవాళ్ళు ఇప్పుడు రిబ్బన్‌ కటింగ్స్‌కు పోటీలు పడి పిలుస్తున్నారు. ఏ నాయకుడి విషయంలో జరిగిందది? ఇంతలోనే అంత మార్పు ఎందుకు వచ్చింది?

Read Also: Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందనుకున్న నేతలకు… ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసుకుంటున్నారు హాస్తం పార్టీలోని కొందరు నేతలు. గడిచిన ఏడాది కాలంగా సీఎం రేవంత్ రెడ్డి వరస పర్యటనలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాను చుట్టేస్తున్నారు. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గానికి మూడు సార్లు వచ్చివెళ్లగా, మూసీ పునరుజ్జీవం కోసం భువనగిరి సెగ్మెంట్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అటెండ్‌ అయ్యారు. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండకు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని ఒక యూనిట్‌ను జాతికి అంకితం ఇచ్చేందుకు మిర్యాలగూడ నియోజకవర్గానికి వచ్చి వెళ్లారాయన. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లోనే ప్రారంభించారు సీయం. అలాగే… ఈనెల 6న ఆలేరు నియోజకవర్గంలో గంధమళ్ల రిజర్వాయర్ పనులు, పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి సీయం వచ్చి వెళ్లారు. ఇక ఈనెల చివరిలో.. నాగార్జునసాగర్ సెగ్మెంట్‌లో సీఎం టూర్ ఉండొచ్చని అంటున్నారు.

Read Also: Love Jihad: ఉజ్జయినిలో లవ్ జిహాద్..! హిందువునని చెప్పి యువతిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు..!

అలా… ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను చుట్టేశారు ముఖ్యమంత్రి. దీని చుట్టూనే… ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఎన్నికల ప్రచారం మినహా… అంతకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఏ సందర్భంలోనూ జిల్లాలో పర్యటించలేదు రేవంత్‌రెడ్డి. చివరికి ఆయన పాదయాత్ర కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జరగలేదు. గట్టిగా మాట్లాడుకుంటే…. మా జిల్లాలో ఆయన యాత్ర అవసరం లేదు. మా సంగతి మేం చూసుకోగలం అంటూ… అప్పట్లో బీరాలు పోయారట జిల్లా కాంగ్రెస్‌ సీనియర్స్‌. అలాంటిది ఇప్పుడు అదే జిల్లాకు చెందిన నాయకులు వరుసగా మా నియోజకవర్గానికి రమ్మంటే… మా నియోజకవర్గానికి రమ్మంటూ పోటీలు పడి పిలవడం గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సీయం ఓకే చెప్తే చాలు.. సీనియర్లతో సంబంధం లేకుండానే తమ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాలకుగాను… తొలిసారి గెలిచిన ఐదుగురు, రెండో విడత గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం పర్యటన కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారట. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వరుస టూర్స్‌ని చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు.

Read Also: Nani : ఇన్నేళ్లుగా నాకు ఆ ఒక్క సినిమానే నచ్చింది

ఇక, ఏడాదిన్నర, రెండేళ్లలోనే ఎంత మార్పు? మన సీనియర్స్‌ ఇంతలా మారిపోయారా అంటూ ముక్కునవేలేసుకుంటున్నారట. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉమ్మడి జిల్లాలోకి అడుగు పెట్టొద్దని చెప్పిన సీనియర్స్‌, అప్పట్లో రేవంత్ రెడ్డికి సహకరించని నాయకులు…. తాజాగా మాటకు ముందు సీఎం… మాటకు వెనక సీఎం అని మాట్లాడుతుండటాన్ని చూసి హవ్వ అంటున్నారట కార్యకర్తలు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పిసిసి చీఫ్ వర్సెస్ జిల్లా సీనియర్ నేతలు అన్నట్లుగా పరిస్థితి మారడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ పాదయాత్రకు సహకరించని పరిస్దితులను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఇక మారిన పరిస్దితుల్లో సీనియర్ల కంచుకోటల్లో సైతం రేవంత్ మార్క్ కనిపిస్తోందంటున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లా హస్తం పార్టీ నేతలు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిస్తే…. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగానే ఉంటాయన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ కేడర్‌ లేటెస్ట్‌ వాయిస్‌.

Exit mobile version