OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకరు ఎంపీ…మరొకరు ఎక్స్ మినిష్టర్. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కట్టలు తెంచుకుంది. స్థానిక సమరం ముందు డైరెక్ట్ ఫైట్ కు తెరలేచింది. రోడ్డెక్కి మరీ పర్సనల్ గా టార్గెట్ చేసుకోవడం రాజకీయ వేడిని రాజేస్తోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘రూపాయి ‘ పాలిటిక్స్ ఎక్కడ షురూ అయ్యాయి…?. నువ్వు ఒక్కటి అంటే నేను పది అంటా అంటున్న ఆ నేతలు ఎవరు…?. సీఎం రమేష్… బీజేపీ అనకాపల్లి ఎంపీ. చుట్టపు చూపుగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లోకి వచ్చి…చక్రం తిప్పుతున్న కీలక నేత. గుడివాడ అమర్నాథ్… వైసీపీ మాజీ మంత్రి, పక్కా లోకల్. వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు వార్ ఓపెన్ అయిపోయింది. అదీకూడా… రాజకీయ, నిర్మాణాత్మక విమర్శల స్థాయి దాటిపోయి వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగజారడం చర్చనీయాంశమైంది. ఇది స్థానిక ఎన్నికల ముందు వాతావరణాన్ని వేడెక్కించే ప్రయత్నమా..? లేక ఇంకేదైనా అజెండా ఉందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. చోడవరం నియోజకవర్గం పర్యటన సందర్భంగా వైసీపీ సమన్వయకర్త అమర్నాథ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ సీఎం రమేష్. గాజువాక, అనకాపల్లిలో చెల్లని రూపాయిని…చోడవరంలో మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అక్కడ చెల్లనిది ఇక్కడ మాత్రం ఎలా చెల్లుతుందంటూ బహిరంగ వేదిక మీదే కామెంట్ చేశారాయన. గాజువాకలో అమర్నాథ్ ఓటమిని ప్రస్తావిస్తూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హాట్ అయ్యాయి.అటు, అమర్నాథ్ కూడా అంతే స్థాయిలో ఘాటుగానే తగులుకోవడంతో ఊహించని విధంగా అనకాపల్లి జిల్లాలో రూపాయి రాజకీయం హీట్ పెంచుతోంది. ఈ ఎపిసోడ్‌తో… అసలు అమర్నాథ్, CM రమేష్ మధ్య నడుస్తున్నది వ్యక్తిగత వైరమా…? లేక రాజకీయ విభేదాలా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. అయితే… సిట్టింగ్ ఎంపీ, మాజీమంత్రి పరస్పరం పర్సనల్‌గా టార్గెట్ చేసుకోవడానికి ఇటీవల అనకాపల్లి జిల్లాలో జరిగిన పరిణామాలే కారణమని అంటున్నారు. సీఎం రమేష్‌ను ఎక్కువ ఫ్రస్టేషన్‌కు గురి చేసింది పంచదార్ల అక్రమ మైనింగ్ అని అంటున్నారు లోకల్ ఫ్యాన్ లీడర్స్. ఇక్కడ వందల ఏళ్ల చరిత్ర ఉన్న ధర్మ లింగేశ్వర స్వామి ఆలయం కొండలను మైనింగ్ లీజులు ముసుగులో కొల్లగొట్టేస్తున్నారంటూ… పెద్ద పోరాటమే చేసింది ప్రతిపక్షం.
ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతుగా నిలబడటంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళింది. అందుకు మాజీమంత్రి అమర్నాథ్ నాయకత్వం వహించడం, ఉల్లంఘనల నిర్ధారణ, ఒత్తిళ్లు ఫలిచడంతో మైనింగ్ పర్మిషన్స్ రద్దు వంటి కీలక పరిణామాలు జరిగాయి. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడంతో ఫణిగిరి కొండలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. అనుమతుల మంజూరుతో పాటు అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవడంలో విఫలం అయ్యారనే కారణాలతో రెవెన్యూ, మైనింగ్ విభాగాలలో సీనియర్ ఉద్యోగులపై వేటు పడింది. నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు చేసినందుకు మైనింగ్ కంపెనీకి భారీ పెనాల్టీలు పడ్డాయి. అయితే… ఈ క్వారీ అంతా ఎంపీ సీఎం రమేష్, ఆయన అనుచరులదేనని ఆరోపిస్తోంది వైసీపీ. ఇవిగో ఆధారాలంటూ కొన్నిటిని బయటపెట్టి తీవ్ర విమర్శలు చేసింది. ఇక అమర్నాథ్ అయితే…. నైతిక బాధ్యత వహించి ఎంపీ పదవికి సీఎం రమేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. పార్టీ వేదికైనా, బహిరంగ సభ అయినా… ప్రత్యక్షంగానో…పరోక్షంగానో ఎంపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఎక్స్ మినిస్టర్. అలాగే… ఈ మధ్య గోవాడ సహా అనకాపల్లి జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాల భూములపై ప్రభుత్వ ఆలోచనలను ఎండగడుతోంది విపక్షం. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను లిక్విడేట్ చేయడం ద్వారా దొడ్డి దారిన రాజకీయ పెద్దలు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణల్ని విస్తృతం చేసింది. ఈ ఎత్తుగడ వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెడతామని ప్రకటిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలు, ఎంపీ, ఎమ్మెల్యేలపై అక్రమాల ఆరోపణలు ప్రధాన అస్త్రంగా చేసుకోవాలనేది వైసీపీ ఆలోచన. దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాలు, జిల్లా స్థాయి సమావేశాల్లో నాయకత్వానికి దిశా నిర్దేశం చేస్తోంది.
Also Read
ఈ పరిస్థితుల్లో అర్బన్‌తో పోలిస్తే… రూరల్ ఓటర్ ఫ్యాన్ పార్టీకి దగ్గరైనట్టు అంచనా వేస్తున్నారు. పైగా, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత కనిపిస్తోందన్నది వైసీపీ లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో… కీలకమైన అనకాపల్లి జిల్లాలోని స్థానిక ఎన్నికల బాధ్యతను ఎంపీ భుజనకెత్తుకున్నట్టే కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయన నియోజక వర్గాల్లో పర్యటిస్తుండగా….ఫస్ట్ అటెంప్ట్‌లోనే అమర్నాథ్ను టార్గెట్ చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. కమలం జెండా కూడా అంతగా పరిచయం లేని అనకాపల్లి లోక్‌సభ సీటును భారీ మెజారిటీతో గెలిచిన సీఎం రమేష్…. కూటమి తరపున వ్యూహాలు పన్నడం, ప్రచారంలో లీడ్ తీసుకోవడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. జిల్లాలో జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఎంపీ. ఈ క్రమంలో వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు దొరక్కుండా చూడటం ఆయన ప్లాన్‌గా చెబుతున్నారు. అయితే… అందుకు తాను ఊహించని స్థాయిలో వైసీపీ నుంచి ఎదురు దాడి రావడం ఆయనకు మింగుడుపడ్డం లేదని చెబుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ఈ ఫ్రస్టేషన్లో భాగమే అమర్నాథ్ను పర్సనల్‌గా టార్గెట్ చేయడం అన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో… సీఎంరమేష్ వర్సెస్ వైసీపీ గా అనకాపల్లి జిల్లా రాజకీయం కనిపిస్తోంది. అందులో భాగంగానే చెల్లని రూపాయి కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!