OTR : ధర్మవరంలో పోటీ టీడీపీ వర్సెస్ బీజేపీ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక త్యాగాల్లేవ్…. ఉన్నదల్లా ఓన్లీ తెగించడాలే. ఇవ్వాల్సినంత ఇచ్చేశాం, చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసేశాం. ఇప్పుడిక తగ్గేదే లే అంటున్నారట అక్కడ తెలుగు తమ్ముళ్లు. బలం లేని చోట వాళ్ళకే అంతుంటే… నూటికి నూరు శాతం గెలిచే సత్తా ఉన్న మేమెందుకు తగ్గాలి అంటూ టీడీపీ లీడర్స్ ప్రశ్నిస్తోంది ఎక్కడ? ఏ మంత్రి లక్ష్యంగా మాటల తూటాలు పేలుతున్నాయి? అంతర్గతంగా ఎన్ని తేడాలున్నా, ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా….పెద్దోళ్ళు చెప్పారనో, పరువు పోతుందనో…ఇన్నాళ్ళు సర్దుకుపోయిన కూటమి నేతలు కొందరు ఇప్పుడు నో అంటున్నారట. స్థానిక ఎన్నికలు జరగబోతున్న టైంలో… ఇక త్యాగాల్లేవ్… ఓన్లీ తెగించడాలేనని అంటున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా టీడీపీ లీడర్స్‌లో ఈ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసి ఇటు జనసేన, అటు బీజేపీ గెలుపు కోసం పనిచేశారని, లోకల్ బాడీస్‌లో కూడా అదే ట్రెండ్ కొనసాగితే… ఇక తమ ఉనికే ప్రశ్నార్ధకమవుతుందని చాలామంది టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నారు. ధర్మవరం మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం. ఆల్రెడీ గట్టిగా ఉన్న పార్టీ పునాదుల్ని పరిటాల శ్రీరామ్ మరింత బలోపేతం చేసినట్టు చెబుతారు స్థానిక తమ్ముళ్ళు. ఐదేళ్లపాటు తన సొంత నియోజకవర్గాన్ని వదిలి ధర్మవరం వచ్చి ఇక్కడ పార్టీ కోసం పని చేశారని, తీరా ఎన్నికల్లో విజయం గ్యారెంటీ అనుకున్న సమయంలో పొత్తులో భాగంగా సీటు బీజేపీకి వెళ్ళిందని గుర్తు చేస్తున్నారు. అయినా… అధిష్టానాల సూచనల మేరకు అంతా కలిసికట్టుగా పని చేశారు. దాంతో… బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలవడం, ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కడం చకచకా జరిగిపోయాయి. అయితే అప్పటి నుంచి… ధర్మవరంలో బీజేపీ నాయకులు ఒంటెత్తు పోకడలతో మేం ఇబ్బంది పడుతున్నామంటూ… టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయట. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎలక్షన్స్‌లో చైర్మన్ స్థానంతో పాటు 90% శాతం కౌన్సిలర్ సీట్లు తమకే కావాలని టిడిపి నాయకులు భావిస్తున్నారు.
ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశాం కాబట్టి… కచ్చితంగా మాకు మున్సిపల్ ఛైర్మన్ సీటు కావాలన్నది టీడీపీ లీడర్స్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. కానీ… బీజేపీ వైఖరి మాత్రం సైకిల్ స్పీడ్‌కు బ్రేకులు వేసేలా ఉందట. పైగా ఛైర్మన్ స్థానానికి నేరుగా ఎన్నికలు జరుగుతున్నందున దీని కోసం రెండు పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 40 వార్డులు ఉండగా పునర్విభజన తర్వాత 48కి పెరగవచ్చు. అయితే… పొత్తు ధర్మం సంగతి ఎలాఉన్నా… మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి… మేం 30 స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని బీజేపీ నాయకులు డిసైడైనట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో… ఇప్పటికే బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇద్దర్ని ఛైర్మన్ రేస్‌లో తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు జనసేన కూడా ఎక్కువ స్థానాలు కావాలని పంతం పట్టినట్లు సమాచారం. వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా బీజేపీగాని, జనసేనగాని గెలిచే పరిస్థితి లేదన్నది పొలిటికల్ వాయిస్. దీంతో… తమకు అన్యాయం జరిగిందని లోకల్ టీడీపీ లీడర్స్ ఫీలైతే మాత్రం వాళ్ళు సహకరించే పరిస్థితి ఉండబోదని, మొదటికే మోసం వస్తుందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ధర్మవరంలో. మంత్రి సత్యకుమార్ దీనిపై స్పందిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు తదుపరి అడుగులు ఉంటాయన్నారు. ఆ డెసిషన్ ఎలాఉన్నా…. బీజేపీ మాత్రం ఇలాగే దూకుడు ప్రదర్శిస్తే… ధర్మవరం మున్సిపాలిటీలో పోటీ వైసీపీ వర్సెస్ కూటమిగా కాకుండా… టీడీపీ వర్సెస్ బీజేపీగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో తుది నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ మాత్రం పెరుగుతోంది.
Also Read
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!