Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?
- 2024 ఓటమి తర్వాత గుంటూరుకు మకాం మార్పు
- సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ దాడి తర్వాత మారిన సీన్
- పరామర్శ కోసం అంబటి ఇంటికి పెద్ద సంఖ్యలో కాపు నేతలు
- అంబటి రాంబాబుని కాపు టైగర్ అని పొగిడిన జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీమంత్రి అంబటి రాంబాబు పేద్ద… ప్లానింగ్‌లో ఉన్నారా? అందుకోసం అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆయన అడుగులన్నీ ఆ దిశగానే పడుతున్నాయా? ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టూర్స్ పెంచడం వెనకున్న ఉద్దేశ్యం అదేనా? ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు అంబటి…. ఆయన పెద్ద ప్లానింగ్ ఏంటి? ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అంబటి రాంబాబు. అది పాజిటివో, నెగెటివో… మేటర్ ఏదైనా, రీజన్ ఎందుకైనా ఓవరాల్‌లో వార్తల్లో ఉంటారాయన. నాలుగు దశాబ్దాల పొలిటికల్ కెరీర్‌లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంబటి. జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఓడిపోయిన రాంబాబు… ఆ తర్వాత గుంటూరుకు మకాం మార్చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, గుంటూరు వెస్ట్ నిోయజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. గత జనవరి 31న అంబటి…. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్నే లేపింది.
ఆ మాటలకు రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు మాజీమంత్రి ఇల్లు, ఆఫీసుపై దాడి చెయ్యడం, తర్వాత ఆయన మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించడం చకచకా జరిగిపోయాయి. అంబటి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు గుంటూరులో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలు పలువురు వచ్చారు. అదే సమయంలో కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి వచ్చారు. సరిగ్గా ఇక్కడే కొత్త కేరక్టర్‌కు బీజం పడిందన్నది లేటెస్ట్ పొలిటికల్ టాక్. రాంబాబు ఇంటికి వచ్చిన జగన్….. ఆయన్ని కాపు టైగర్ అంటూ ప్రశంసించారు. ఇక జైలునుంచి విడుదలయ్యాక కూడా కాపు నేతల పరామర్శలు పది రోజులపాటు కొనసాగాయి. స్వయంగా అధినేత జగన్ కాపు టైగర్ అనడం, తన సామాజికవర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా పరామర్శకు రావడంతో… మాజీమంత్రి మనసులో కొత్త ఆలోచన పురుడు పోసుకుందట.
Also Read
దాని గురించే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు కాపు సామాజికవర్గంలో కూడా కొత్తగా మాట్లాడుకుంటున్నారు. అంబటి తాను కూడా వంగవీటి మోహనరంగా లాగా కాపు కులానికి నాయకుడిగా, పెద్దగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయన వేస్తున్న అడుగులు, అమలు చేస్తున్న వ్యూహాలన్నీ ఈ విషయాన్నే చెబుతున్నాయన్నది విశ్లేషకుల మాట. రాంబాబు జైలునుంచి బయటకొచ్చాక మొదటిసారి విశాఖపట్టణం వెళ్లారు. అక్కడ కాపు కులానికి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ తోపాటు కాపు నేతల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే… తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రెండు రోజులు పక్యటించారాయన. మొదట ద్వారకా తిరుమలకు వెళ్లిన అంబటి రాష్ట్ర కాపునాడు అభినందన సభలో పాల్గొన్నారు.
అక్కడనుంచి కాకినాడ వెళ్లి ముద్రగడ పద్మనాభం, కురసాల కన్నబాబును కలిశారు. తర్వాత తాడేపల్లిగూడెంలో కాపునేతల సమావేశంలో పాల్గొన్నారు. ఇలా వరుసబెట్టి కాపు నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ తన ఇంటి మీద జరిగిన దాడి, ప్రభుత్వం పెట్టిన కేసులు, జైలుకు పంపించడం గురించి మాట్లాడారు. వెళ్ళిన ప్రతిచోట కాపు కులానికి చెందిన తనను ప్రభుత్వం టార్గెట్ చేసి మరీ వేధించిందంటూ మాట్లాడుతున్నారాయన. అలాగే… తన ఇంటిపై దాడి చేసినవారు కూడా ఒకే సామాజికవర్గానికి చెందినవారని ఆరోపిస్తున్నారు. తన ఇంటిపై దాడి చెయ్యడానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్లాన్ చేస్తే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవితోపాటు ఆమె భర్త రామచంద్రరావు అమలు చేశారని, ఆఫీసుపై దాడి చేసివాళ్ళు కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్లంటూ తాను వెళ్ళిన చోటల్లా చెబుతున్నారాయన.
కాపు కులానికి చెందిన వాడిని కాబట్టే టార్గెట్ చేసి మరీ…. నా ఇంటిపై దాడి చేయడంతో పాటు అక్రమంగా జైలుకు పంపారని అంటున్నారాయన. ఇదంతా చూస్తున్న పలువురు విశ్లేషకులు కాపుల సింపతీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారని, దీన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో కాపు పెద్దగా ఎదగాలనుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పలువురు విశ్లేషకులు. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పర్యటించడం ద్వారా తనను తాను ఆ సామాజికవర్గానికిగా లీడర్‌గా ప్రమోట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
కాపు డామినేషన్ ఉన్న గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్ళడం, కాపునాడు నేతల సమావేశంలో పాల్గొనడం, వైసీపీలో ఉన్న కాపు నేతలతో స్పెషల్ మీటింట్స్ పెట్టుకోవడంలాంటివన్నీ ఇందులో భాగమేనన్నది మెజార్టీ పొలిటికల్ ఒపీనియన్. కానీ… ఇక్కడే.. కాస్త తేడా మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనపాటికి ఆయనేదేదో ఊహించుకుని తిరుగుతున్నారుగానీ…. వాస్తవానికి అంత సీన్ ఉందా అంటూ…. సొంత గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో కామెంట్స్ చేయడం కొసమెరుపు. అందుకు వాళ్ళ రీజనింగ్ వాళ్ళు చెబుతున్నారు. నిజంగానే అంబటికి కాపు పెద్ద అయ్యేంత స్థాయి ఉంటే…. ఆయన ఇంటి మీద ఆరు గంటలపాటు దాడి జరిగితే…. గుంటూరులో ఉన్న కాపులు ఎందుకు స్పందించలేదన్నది వాళ్ళ క్వశ్చన్. ఎవరి వాదనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా… వోవరాల్‌గా అంబటి మాత్రం పెద్ద ప్లానింగ్‌లో ఉన్నారన్నది ఆయన కదలికల్ని గమనిస్తున్నవారి విశ్లేషణ. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
- Tags
- Ambati Rambabu
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!