Off The Record:నీకది.. నాకిది..మంత్రాంగం ఫలించిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోకల్ బాడీ MLC సీటు కోసం BRS-MIM మధ్య పెద్ద చర్చలే సాగాయా? ఓ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఎడతెగని మంతనాలు జరిగాయా? ఆ చర్చలు కొలిక్కి వచ్చాకే.. MLC సీటును MIMకు ఇచ్చారా? ఇంతకీ ఏంటా మంత్రాంగాలు? నీకది.. నాకిది అన్నట్టుగా సాగిన చర్చల సారాంశం ఏంటి?
Also Read
ఎమ్మెల్సీ సీటు మజ్లిస్‌కు ఇవ్వడం వెనుక పెద్ద కథే నడిచిందా?
హైదరాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానం మజ్లిస్ ఖాతాలో పడింది. ఈ సీటులో అధికారపార్టీ BRS పోటీ చేయకుండా.. మిత్రపక్షం MIMకు వదిలేసింది. గులాబీ పార్టీ తన నిర్ణయం ప్రకటించడం.. MIM నుంచి మీర్జా రెహమత్ బేగ్ నామినేషన్ వేయడం.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చకచకా జరిగిపోయింది. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ.. ఈ MLC సీటును మజ్లిస్‌కు ఇవ్వడం వెనుక రెండు పార్టీల మధ్య పెద్ద కథే నడిచిందట. ప్రస్తుతం ఆ వివరాల చుట్టూనే రాజకీయ పక్షాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. అవునా.. అంత తతంగం నడిచిందా? అంత జరిగిందా? సమస్యను అలా సెట్ చేశారా? అని చెవులు కొరుక్కుంటున్నారు గులాబీ పార్టీ లీడర్స్.
రాజేంద్రనగర్ సీటు కోసం మజ్లిస్ ఉడుంపట్టు
మజ్లిస్, బీఆర్‌ఎస్ మధ్య చర్చల్లోకి వచ్చిన ఆ నియోజకవర్గమే రాజేంద్రనగర్. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌పై మజ్లిస్ పార్టీ క్రమంగా పాగా వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య కొన్నిచోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ సాగినా.. రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం హోరాహోరీ పోరును తలపించింది. ఆ ఎన్నికల్లో MIM నుంచి మీర్జా రెహమత్ బేగ్ పోటీ చేసి ఓడిపోయారు. తాజా MLC ఎన్నికల్లో రాజేంద్రనగర్ సీటు చర్చకు రావడానికి కారణం మజ్లిస్ ఉడుంపట్టేనని తెలుస్తోంది.
మజ్లిస్‌కే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి రాజేంద్రనగర్ సీటు కాపాడుకున్న బీఆర్‌ఎస్
వాస్తవానికి హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో అధికారపార్టీ BRSకు పూర్తి మెజారిటీ ఉంది. అభ్యర్థి పోటీలో ఉంటే గెలుచుకునే సీటే. అయినప్పటికీ మజ్లిస్‌కు వదిలేసింది గులాబీపార్టీ. MLC సీటు గురించి రెండు పార్టీల మధ్య చర్చలు మొదలైన సమయంలో MIM ఓ ప్రతిపాదన చేసిందట. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి తమకు విడిచి పెట్టాలని.. బదులుగా MLC వదులుకుంటామని మజ్లిస్ నేతలు చెప్పారట. ఆ ప్రతిపాదనకు BRS నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. పైగా తామే MLC సీటు వదులుకుంటాం.. రాజేంద్రనగర్ మాకు విడిచిపెట్టండి అని మిత్రపక్షాన్ని కోరారట గులాబీ పార్టీ పెద్దలు. దానికి MIM అంగీకరించడం.. ఆ పార్టీ నుంచి గతంలో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసి ఓడిన మీర్జా రెహమత్ బేగ్ ఏకగ్రీవం కావడం జరిగింది.
50 చోట్ల పోటీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన అక్బరుద్దీన్
తెరవెనుక జరగిన ఈ ఎపిసోడ్ ఇప్పుడు బయటకు రావడంతో అధికారపార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహ పూర్వక వాతావరణమే ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో MIM విస్తరిస్తోన్నా.. తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణలో 50 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో MIM ఏం చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రాజేంద్రనగర్ సీటు తరహాలోనే రెండు పార్టీలు సర్దుబాటు చేసుకుంటాయో లేదో చూడాలి.
- Tags
- bjp
- BRS
- MIM
- MLC Seat
- off the record
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..