Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగం చేయబోతోందా? అది ఇప్పటిదాకా ఎవ్వరూ ఊహించని ఎక్స్‌పెరిమెంటా? దాన్ని గనుక ఖచ్చితంగా వర్కౌట్ చేయగలిగితే… ఇక తిరుగుండదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారా? అధికారంలో ఉన్నందున ఇప్పుడు ఈ ఉప ఎన్నిక గెలుపును సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? కొత్త ప్రయోగం చేద్దామన్న ఆలోచనా ఆయనదేనా? ఇంతకీ ఏంటా ఎక్స్‌పెరిమెంట్? వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది?
Read Also: Allu Aravind : ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలని టార్గెట్ ఫిక్స్ చేసిందట అధిష్టానం. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. గెలిచి తీరాల్సిందేనని, అంతా సమష్టిగా పని చేయాలని ఆదేశించారట పార్టీ పెద్దలు. అయితే, ఈ సారి పార్టీ వ్యూహం మారుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకోసం సెగ్మెంట్ పరిధిలో నివాసముంటున్న సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా ఉపఎన్నికల్లో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీని ఈజీగా కట్టడి చేయొచ్చని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరికీ, సుపరిచితమైన వ్యక్తిని బరిలోకి దించాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.
అయితే, జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారట సీఎం. ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని, క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రముఖ వ్యక్తిని బరిలోకి దింపింతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని లెక్కలేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా… ఇప్పటికే పలువురు సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను పరిశీలించి.. కొందరిపై సర్వేలు కూడా జరిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, పేరుకు జూబ్లీహిల్స్ ధనిక ప్రాంతమైనా.. నియోజకవర్గంలో ఎక్కువగా మధ్యతరగతి, వర్కింగ్ క్లాస్ ఓటర్లు ఉన్నారు. కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే వీరంతా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారోనని తెలుసుకునేందుకు సర్వేలు జరిపిస్తున్నట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనివార్యమైంది. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. దీంతో ఉప ఎన్నికలో ఆయన భార్యకు టికెట్ ఇవ్వడం వల్ల సానుభూతి కలిసి వస్తుందని గులాబీ పార్టీ భావిస్తోందట. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన క్లీన్ ఇమేజీ, రాజకీయ నేపథ్యం లేని ప్రముఖ వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల ఓటర్ల మనసును గెలుచుకోవచ్చని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
Read Also: Kolkata Gang Rape Case: ప్రధాన నిందితుడి గురించి వెలుగులోకి సంచలన విషయాలు.. 2018లోనే..
ఇక, కమ్మ సామాజిక వర్గం నుంచి గట్టి వ్యక్తి దొరక్కపోతే.. ముస్లింకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు భారీ సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. ఆ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల విజయం సులువు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తే, ముందుగా మజ్లిస్ పార్టీతో సంప్రదిం పులు జరిపిన తరువాతే నిర్ణయం తీసు కుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్న అజారుద్దీన్ వ్యవహారాల శైలి ఇటీవల వివాదాస్పదం అయ్యింది. తనకు తానే అభ్యర్ధినని ప్రకటించుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. నవీన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయనకు నియోజకవర్గంలో కొంత సానుకూల వాతావారం ఉందనే టాక్ నడుస్తోంది. అవన్నీ ఎలా ఉన్నా… సీఎం రేవంత్‌రెడ్డి చేయాలనుకుంటున్న ప్రయోగం గురించి మాత్రం ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి రాజకీయవర్గాలు.
