Off The Record: బీజేపీలో ముగ్గురు నేతల మూడుముక్కలాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లా బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? అర్బన్ సీటుపై కన్నేసిన ముగ్గురు నేతలు పార్టీని గ్రూపులుగా చీల్చేశారా? ఇప్పుడు ఉనికికోసం ఆపసోపాలు పడుతున్నారా? అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
మూడు ముక్కలాటలా బీజేపీ గొడవలు
ఇందూరు జిల్లాలో హాట్ సిట్‌గా ఉన్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో.. బీజేపీ నేతలకు అస్సలు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, నియోజకవర్గ ఇంఛార్జ్ ధన్‌పాల్ సూర్యనారాయణలు ముగ్గూరు అర్బన్ సీటుపై కన్నేశారు. గత ఎన్నికల్లోనే చివరి క్షణంలో సీటు చేజారిందనే కసితో ఉన్నారు ధన్‌పాల్. ఈసారి మాత్రం పోటీ చేసి తీరుతానని తన వర్గంతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మళ్లీ గెలిచి పట్టు నిలుపుకొంటానంటున్నారు యెండల. వీరిద్దరి మధ్యలో ఒక్కఛాన్స్ అంటున్నారు లక్ష్మీనర్సయ్య. దీంతో మూడు ముక్కలాటలా మారిపోయింది నిజామాబాద్ అర్బన్ బీజేపీ గొడవలు.
ఇప్పటికే ఎంపీ వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా పోరు
బీజేపీ ఎంపీ వర్గంలోని నేతగా ధనపాల్‌కు ముద్రపడింది. టికెట్ రాకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతామన్న అనుమానంతో యెండల శిబిరంలో చేరారు లక్ష్మీనర్సయ్య. ప్రస్తుతం వీరి మధ్య కేడర్ చీలిపోయింది. వేర్వేరుగా ప్రజాపోరాటాలు చేస్తూ కేడర్‌ను గందరగోళంలో పడేస్తున్నారు నాయకులు. పాత ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతలపై పార్టీ చేపట్టిన నిరసనలో ఎవరికివారేగా ఉండటంతో బీజేపీ అభాసుపాలైందని కేడర్ చిన్నబుచ్చుకుందట. నియోజవర్గంలో బీజేపీ ఎంపీ వర్సెస్ యెండల అనేలా ఇప్పటికే కత్తులు దూసుకుంటున్నారు. ఈ వర్గపోరు ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందని కేడర్ ఆందోళన చెందుతున్నా.. అధిష్ఠానం పట్టించుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఎవరికి వారు ఉనికి కోసం పోరాటం
బీజేపీకి నియోజకవర్గంలో రెండు కళ్లుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాల్సి నేతలు.. అంతర్గత విభేదాలతో ఉనికి కోసం పోరాడటం రాష్ట్ర నేతలకు కూడా మింగుడు పడటం లేదట. కమలం పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే.. అగ్రనాయకత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారట. మరి.. కేడర్ ఆశిస్తున్నట్టు ఈ మూడు ముక్కలాటకు అధిష్ఠానం ఫుల్‌స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్‌క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!