Off The Record: సత్తెనపల్లిలో కన్నా వర్సెస్ అంబటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో ఏపీలో సత్తెనపల్లిలో బిగ్ ఫైట్ తప్పదా? మంత్రి అంబటి రాంబాబు లక్ష్యంగా అక్కడ టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉంటారా? టీడీపీలో చేరిన తర్వాత సత్తెనపల్లెలోనే కన్నా ఎక్కువగా పర్యటిస్తున్నారా? టీడీపీ శిబిరంలో జరుగుతున్న చర్చేంటి?
సత్తెనపల్లిలో కన్నా పోటీ చేస్తారా?
కన్నా లక్ష్మీనారాయణ. టిడిపిలో కొత్తగా చేరిన మాజీ మంత్రి. ప్రస్తుతానికి టీడీపీకి జిల్లాలో ట్రబుల్ షూటర్‌గా వినిపిస్తున్న పేరు. గ్రూపుల పేరుతో పార్టీలో ఎవరన్నా సమస్యలు సృష్టిస్తే కన్నా పేరు చెప్పి షాక్ ఇస్తున్నారట. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి టిడిపి నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో టికెట్స్ కోసం టీడీపీలోని కమ్మసామాజికవర్గ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఈ మూడు చోట్లా నాయకులు తమకు సీటు కావాలని అడిగితే.. ఆ సీటు మీకు కాదు.. కన్నా పోటీ చేయొచ్చు అని చెబుతున్నారట. వాస్తవానికి ఎక్కడ పోటీ చేయాలో కన్నాకే క్లారిటీ లేదట. ఎవరు ప్రశ్నించినా పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తా అని కన్నా బదులిస్తున్నారు. ఈ సందర్భంగా కన్నా పేరు సత్తెనపల్లిలో కాస్త గట్టిగానే వినిపిస్తోందట. ఇందుకు టీడీపీ లెక్కలు టీడీపీ దగ్గర ఉన్నాయట. సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇక్కడ మంత్రిని ఓడించాలంటే.. కన్నానే సరైన క్యాండిడేట్‌గా టీడీపీ పెద్దలు భావిస్తున్నారట.
Also Read
సత్తెనపల్లిలో కన్నా తరచూ పర్యటన
గుంటూరు పశ్చిమ.. పెదకూరపాడు నియోజకవర్గాలతో పోల్చితే సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గం ఓట్లు కొంచెం ఎక్కువ. అంబటికి కాపు ఓట్లు మళ్లకుండా కన్నాను పోటీ చేయిస్తే ప్లాన్ వర్కవుట్ అవుతుందనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందట. ఇటీవల కాలంలో కన్నా సైతం సత్తెనపల్లిలో ఎక్కువగా పర్యటించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అలా అని కన్నా మిగతా నియోజకవర్గాల్లో తిరగడం లేదా అంటే.. వెళ్తున్నారు. కానీ సత్తెనపల్లిలో కొంచెం ఎక్కువుగా తిరుగుతున్నారు. సత్తెనపల్లి టీడీపీలో నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురికీ కాకుండా కన్నాకు సీటు ఇస్తే.. వాళ్లంతా పార్టీ విజయం కోసం కచ్చితంగా కలిసి పనిచేస్తారని.. అలా కాదని ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు గోతులు తవ్వేస్తారనే అభిప్రాయంలో హైకమాండ్ ఉందట. సత్తెనపల్లిలో కన్నాను పోటీ చేయిస్తే.. మంత్రి అంబటికి చెక్ పెట్టినట్టు అవుతుంది.. ఇటు టీడీపీలో వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడుతుందనే లెక్కలు వేస్తున్నారట పసుపు పార్టీ పెద్దలు.
సత్తెనపల్లిలో బిగ్ ఫైట్ తప్పదా?
మొత్తానికి టీడీపీలో కన్నా చేరిక ఓ సంచలనం అయితే.. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మరో ఆసక్తికర అంశం. పనిలో పనిగా మంత్రి అంబటిని లక్ష్యంగా చేసుకుంటారనే ప్రచారం ఇంకా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే ఎన్నికలలో అంబటి, కన్నా మధ్య ఫైట్ బిగ్ఫైటేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి.. బయట జరుగుతున్న ప్రచారాల్లో ఏది నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!