Off The Record: వైసీపీ అధిష్టానానికి తత్వం బోధపడిందా..?
- శింగనమల, మడకశిర నియోజకవర్గాల్లో ప్రయోగాలు..
- శింగనమలలో టిప్పర్ డ్రైవర్‌కు వైసీపీ టిక్కెట్..
- రూ.10 లక్షల ఎన్నికల ఖర్చుపెట్టే స్థోమతలేని వ్యక్తికి టిక్కెట్..
- మడకశిరలో వైసీపీ అభ్యర్థిగా ఉపాధి హామీ కూలీ..
- రెండు చోట్ల పార్టీకి బలం ఉన్నా దారుణమైన ఫలితాలు..
- ఈసారి ప్రయోగాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం..
- వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్తలు..
- సీనియర్ లీడర్ శైలజానాథ్‌కు శింగనమల బాధ్యతలు..
- మడకశిరలో బలమైన ఎస్సీ నేత కోసం అన్వేషణ..
- స్థానికేతరులైనా అంగ బలం, అర్థబలం ఉంటేనే..
- మిగతా కొన్ని చోట్ల తెర మీదికి పాత నేతల వారసులు..
- ఉమ్మడి అనంతపురం వైసీపీలో భారీ మార్పులు ఉంటాయా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్టుగా… గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి కూడా చాలా రీజన్సే ఉన్నాయి. ఓవరాల్‌గా ఘోర పరాజయం ఒక ఎత్తయితే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేవలం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే ఉంది. అలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటున్నారు. ఇక్కడి శింగనమల, మడకశిర నియోజకవర్గాలనే ఉదాహరణగా తీసుకుంటే… రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు చాలా గట్టి దెబ్బే కొట్టాయన్న సంగతి కాస్త ఆలస్యంగా అర్ధమైందట. శింగనమలలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని ప్రయోగాత్మకంగా… సామాన్యుడు, టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చింది వైసీపీ. అసలు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని, కనీసం పది లక్షల రూపాయల ఎన్నికల ఖర్చుకూడా పెట్టే ఆర్థిక స్థోమతలేని వ్యక్తిని బరిలో దింపి ఒకరకంగా వైసీపీ అధిష్టానం సాహసం చేసిందన్న మాటలు అప్పట్లోనే వినిపించాయి.
ఇక మడకశిరలో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ సిట్టింగ్ తిప్పేస్వామిని కాదని.. ఉపాధి హామీ కూలికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఫ్యాన్ అధిష్టానం. ఆయనకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. ఈ రెండు చోట్ల పార్టీ బలంగా ఉన్నా, దీటైన నాయకులు కొనసాగుతున్నా….ఎన్నికల ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి. ఇలా ప్రయోగాలు చేసి చేయి కాల్చుకున్నాకగానీ…పార్టీ అధిష్టానానికి తత్వం బోథపడలేదట. దాంతో ఇప్పుడు రియలైజ్ అయి…. ఇక మీదట అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకూడదని చాలా గట్టిగా డిసైడ్ అయినట్టు సమాచారం. అందుకే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
Also Read
ముందుగా శింగనమలలో ఓడిపోయిన అభ్యర్థి వీరాంజనేయులను పక్కన పెట్టి.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన శైలజానాథ్‌కు పగ్గాలు అప్పగించారు. శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. రెండు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అందుకే ఆయనకు ఛాన్స్ ఇచ్చారట. ఇప్పటికే శింగనమలలో శైలజానాథ్ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మడకశిర విషయంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. అయితే… ఈ ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లో ఆయా సామాజికవర్గాల నుంచి అంగ బలం, అర్ధబలం ఉన్న నేతలు కనిపించడం లేదట. ఆసక్తి ఉన్న వేరే నియోజకవర్గాల నాయకులైనా సరే… ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే పరిశీలిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఒకటి రెండు చోట్ల పాత నేతల వారసులకే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సదరు వారసులు ఇప్పటికే ఫీల్డ్‌లో యాక్టివ్ గా ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో సిట్టింగులను కాదని.. టికెట్లు ఇచ్చిన స్థానాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో చాలా మార్పులే చూస్తామంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలతో ఇప్పటికే ఉన్న వారిలో టెన్షన్ మొదలైంది.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!