Off The Record: కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్టుగా… గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి కూడా చాలా రీజన్సే ఉన్నాయి. ఓవరాల్‌గా ఘోర పరాజయం ఒక ఎత్తయితే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేవలం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే ఉంది. అలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటున్నారు. ఇక్కడి శింగనమల, మడకశిర నియోజకవర్గాలనే ఉదాహరణగా తీసుకుంటే… రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని…