NTV Telugu Site icon

Off The Record: అక్కడ ఫ్యాన్ రిపేర్ వర్క్స్ సరిగా జరగడం లేదా..? ఓడిపోయినా గ్రూపుల గోల తగ్గలేదా?

Ycp

Ycp

Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో సీనియర్స్‌కి కొదవేం లేదు. అదే… ఎక్కడికక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసిందన్నది పార్టీ నేతల మాట. వీరిని కట్టడం చేసేందుకు గతంలో ఇన్ఛార్జ్‌లుగా ఉన్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నించేవారు. అభిప్రాయ తమ అనుభవాన్ని, పొలిటికల్‌ సీనియారిటీని ఉపయోగించి వేదికల మీద జరిగే గొడవల్ని నాలుగు గోడల మధ్యకు తీసుకురాగలిగేవారు. ఇక ఇటీవల పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియమితులయ్యారు. ఆ హోదాలో తాజాగా ఫస్ట్‌టైం జిల్లాకు వచ్చారాయన. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు, స్థానికనేతల సమావేశం నిర్వహించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలు, వ్యూహాల గురించి చెప్పారు. కానీ, శ్రీకాకుళం జిల్లా పార్టీ సీనియర్ లీడర్స్‌ ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం మాత్రం ఈ మీటింగ్‌కు అటెండ్‌ కాలేదు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు కారణం అవుతోంది.

సీనియర్‌ లీడర్స్‌ ఇద్దరూ జూనియర్‌ ఇన్ఛార్జ్‌ని లైట్‌ తీసుకున్నారా? అతను పెట్టే మీటింగ్‌కు మనం వెళ్ళేదేందిలేనని అనుకున్నారా? అంటూ ఆరాలు తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. అదే సమయంలో వాళ్ళు రాకున్నాసరే… కన్నబాబే నేరుగా సదరు లీడర్స్‌ ఇళ్ళకు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు. కన్నబాబు వైఖరిని ప్రశంసిస్తున్న జిల్లా పార్టీ నాయకులు… ఇద్దరు సీనియర్‌నాయకుల్ని మాత్రం తప్పుపడుతున్నారట. రాకపోవడానికి వేరే కారణాలు ఉంటే ఉండవచ్చుగానీ… రీజినల్‌ ఇన్ఛార్జ్‌ హోదాలో ఫస్ట్‌టైం వచ్చినప్పుడు మీటింగ్‌లో పాల్గొనడం కనీస మర్యాద కదా అని అంటున్నారట. వైసిపి నేతలు , కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కారణంగా గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది పార్టీ. సిక్కోలు జిల్లాలో ఒక్క ఎమ్మల్యే సీటు కూడా గెలవలేదు . దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు , ఎవరికి వారే అన్న తీరుగా ఉండటమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు.

అప్పట్లో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలు జిల్లా గ్రూపు రాజకీయాల్ని సరిచేయలేక తల్లకిందులయ్యేవారట. మీతో… మావల్ల కాదని చేతులెత్తేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయన్నది వైసీపీ వర్గాల మాట. ఇలాంటి జిల్లాల సమన్వయం సాధించడమన్నది ఇప్పుడు కన్నబాబుకు కత్తిమీద సామేనంటున్నారు పరిశీలకులు. ఇచ్ఛాపురం, టెక్కలి , ఆమదాలవలస, రాజాం, ఎచ్చెర్ల , నరసన్నపేట , పాతపట్నం వంటి నియోజకవర్గాల్లో గ్రూప్స్ మధ్య సయోధ్య కుదిరించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఈ విషయంలో మాత్రం ఆయన సక్సెస్‌ అవగలిగితే…. పార్టీ అధిష్టానానికి నమ్మకం కలగడమేగాక… తనను తాను నిరూపించుకున్నవాడవుతారని, టాస్క్‌ మాత్రం అంత తేలికైంది కాదన్న అభిప్రాయం బలంగా ఉంది. మొదట్లోనే ఇద్దరు సీనియర్స్‌ ఝలక్‌ ఇచ్చినా… నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మార్కులు కొట్టేశారని, ఇక సిక్కోలు ఫ్యా గ్రూప్స్‌ని కన్నబాబు ఎలా మేనేజ్‌ చేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.