Site icon NTV Telugu

Off The Record: రీఛార్జ్ మోడ్‌లోకి పార్టీ..? వైసీపీ కొత్త గేమ్ ప్లాన్..?

Ycp

Ycp

Off The Record: క్షవరం అయితే గానీ…. వివరం తెలియదని అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేవలం టింకరింగ్‌తో సరిపోదని, టాప్‌ టు బాటమ్‌ పార్టీని రీ స్ట్రక్చర్‌ చేయాలని అధిష్టానం డిసైడైందట. ఆ క్రమంలోనే…. మహిళా విభాగం బలోపేతంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇన్నేళ్ళలో… కీలకమైన ఆ విభాగాన్ని నిర్లక్ష్యం చేశామన్న అభిప్రాయానికి వచ్చారట పార్టీ పెద్దలు. అందుకే ఇప్పుడు ఆ కోణంలో దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే జగన్‌ 2.0పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుండగా… తాజాగా మరోసారి పాదయాత్ర టాపిక్‌ నడుస్తోంది. ఇక అదే ఊపులో.. పార్టీ మహిళా నేతల కోసం సరికొత్త ప్లాట్‌ఫాం తయారు చేయాలనుకుంటున్నారట. సాధారణంగా…. ఓటింగ్‌లో మహిళలది చాలా ముఖ్యమైన పాత్ర.

Read Also: Veeraiah Chowdary Incident: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు.

గత ఎన్నికలకు ముందు టీడీపీ కూడా మహిళా ఓటర్లను దృష్టిలో ఉంచుకుని గట్టిగా వర్కౌట్‌ చేసి సక్సెస్‌ అయింది. సూపర్‌ సిక్స్‌తో పాటు ఇతర హామీల మీద ఇంటింట్లో చర్చ జరిగేలా చేయగలిగింది. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే కోణంలో ఆలోచిస్తోందట. మహిళా ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో… తమను దాటి వెళ్ళకుండా ఇప్పట్నుంచే… పని మొదలుపెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో పార్టీ సీనియర్‌ నాయకులు చాలా మంది మీద వరుస కేసులు బుక్‌ అవుతున్నాయి. ఎవరికి ఎప్పుడు నోటీసులు వస్తాయో, ఎవర్ని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారో తెలియని పరిస్థితి. అదే… మహిళా నేతలకు ఆ స్థాయి భయం లేదు. ఒకరిద్దరు మాజీ మహిళా మంత్రుల మీద ఆరోపణలు ఉన్నా… మేటర్‌ అరెస్ట్‌లదాకా వెళ్ళకపోవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో… పార్టీ ఉమన్‌ వింగ్‌ని రీ ఛార్జ్‌ చేసి యాక్టివ్‌గా ఉంచగలిగితే…. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా… ఇబ్బందులు ఉండవన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే… మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యల మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. తాము అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఏం చేశామో, మరోసారి పవర్‌లోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నామో… పూర్తి స్థాయిలో వివరించగలిగితే ఆ వర్గంలో నమ్మకాన్ని నిలబెట్టుకోవచ్చని, అందుకే పార్టీ ఉమన్‌ వింగ్‌ని బలోపేతం చేయాలనుకుంటున్నారట వైసీపీ పెద్దలు.

Read Also: Off The Record: ఏపీ బీజేపీ నేతల్లో ఉన్నట్టుండి నైరాశ్యం..?

స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌, మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యంలాంటి వాటన్నిటినీ మరోసారి తెర మీదికి తీసుకురావాలనుకుంటున్నారట. పార్టీ అధికారం కోల్పోయాక కీలక నాయకులు చాలామంది సైలెంట్‌ అయ్యారు. రోజా, విడదల రజనీ లాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నా… ఏదో ఒక మూల కేసుల భయం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ భయాన్ని పోగొట్టడంతోపాటు మిగతా మహిళా నేతల్లో స్థైర్యం నింపగలిగితే…. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నది వైసీపీ అధిష్టానం ఆలోచన అట. పార్టీ అన్ని విభాగాల్ని రీఛార్జ్‌ చేసే కార్యక్రమం నడుస్తున్నా… మహిళా విభాగం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఆ క్రమంలోనే… పార్టీ అధిష్టానం వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించింది. మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.. మహిళలకు జగన్ పాలనలో జరిగిన లబ్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని.. సమస్యలపై పోరాడదామని ఆ మీటింగ్‌లో పిలుపునిచ్చారు. మహిళా నేతలు యాక్టివ్ అయితే మౌత్ పబ్లిసిటీ బాగా జరుగుతుందని గ్రహించిన అధిష్టానం అందుకు అవసరమైన ముందస్తు కార్యక్రమాలపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలిసింది. మహిళలు గనక అందుకుంటే… ఆ లెక్కే వేరుగా ఉంటుందని, రీచ్‌ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉండదన్నది పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలిసింది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమనే అంచనాతోనే వారికి ధైర్యాన్ని నూరిపోసి ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ ఈక్వేషన్స్, కేలిక్యులేషన్స్ ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version