NTV Telugu Site icon

Off The Record: ఆ సీనియర్ నేత మారిపోయారా..?

Botsa

Botsa

Off The Record: బొత్స సత్యనారాయణ…. లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ప్రస్తుతం ఇదే పొలిటికల్‌ హాట్‌. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ వెలుగు వెలిగిన నేత. రాజకీయ విమర్శలను సైతం తూకం వేసినట్టు చేసే బొత్సకు 2024 ఎన్నికలు చేదు అనుభవం మిగిల్చాయి. కంచుకోట లాంటి చీపురుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కళా వెంకట్రావ్ చేతుల్లో ఓడిపోయారాయన. అయితే ఆయన సీనియారిటీకి పెద్ద పీట వేసిన వైసీపీ అధినాయకత్వం… తర్వాత మండలికి పంపింది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వడం ఒక ఎత్తయితే….బొత్సపై అధికార పక్షం పోటీ పెట్టక పోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. స్థానిక సంస్థల్లో వైసీపీ ఓటింగ్ బలంగా ఉండటం ఒక కారణం అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో పర్సనల్‌గా బొత్స కూడా తన చాణక్యాన్ని ఉపయోగించారని చెప్పుకుంటారు పొలిటికల్ పండిట్స్‌. ఇక మండలిలో అడుగుపెట్టిన ఈ మాజీమంత్రికి వైసీపీ హైకమాండ్ మరో కీలక బాధ్యత అప్పగించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న పార్టీ.. మండలిలో పటిష్టంగా వున్న అపోజిషన్‌కు నాయకత్వం వహించే అవకాశాన్ని బొత్సకు ఇచ్చింది. ఇక మండలిలో లీడర్‌ ఆఫ్‌ అపోజిషన్‌గా బొత్స సత్యనారాయణ చర్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Read Also: NIMS Hospital: నిమ్స్ ఆస్పత్రిలో దారుణం.. చేయని తప్పుకు కార్మికున్ని చితకబాదిన పోలీసులు

టీడీపీ ముఖ్య నాయకత్వం LOPకి సముచిత గౌరవం ఇస్తోందన్న మాట వినిపిస్తుండగా… బొత్స కూడా వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. మామూలుగా అయితే… మాటల తూటాలతో ప్రత్యర్థుల్ని ఇరుకున పెడుతుంటారాయన. ఇప్పుడు అందుకు బదులు లేఖాస్త్రాల రాజకీయం చేయడం ఆసక్తికరంగా మారుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోపాలు, పార్టీ మీద, తనపైనా వచ్చే ఆరోపణలను ఖండించేందుకు ఇప్పుడు లేఖల్నే వాడుతున్నారాయన. ఇప్పటి వరకు మూడు కీలకమైన అంశాలపై లేఖలు విడుదల చేశారు బొత్స. వీటిలో వైజాగ్ డ్రగ్స్ కంటైనర్, విజయనగరం భూములు, విద్యుత్ చార్జీలు, వైజాగ్ ల్యాండ్ స్కాం వంటివి ఉన్నాయి. విచారణ ఎంత వరకు వచ్చింది…?. వాటిలో ప్రభుత్వం గుర్తించిన అక్రమాలు ఎన్ని…?.వాటిపై తీసుకున్న చర్యల సంగతేంటి…? అంటూ వరుసగా గవర్నమెంట్‌కు లెటర్స్‌ రాస్తున్నారు బొత్స. ఆయన లెటర్స్‌ రాయడం ఒక ఎత్తయితే…. అందుకు రిప్లయ్‌ కూడా అదే స్పీడ్‌తో వస్తోందట. అందుకే అసలేం జరుగుతోందని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇటీవల ఆయన ఫోకస్ వైజాగ్ ల్యాండ్ స్కాం మీద పెట్టారు. 2014 -19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వాన్ని షేక్ చేసిన ఈ “భూప్రకంపనలు” నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు లీడర్‌ ఆఫ్‌ అపోజిషన్‌. అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు వంటి నేతల మధ్య ఈ ల్యాండ్ స్కాం పెద్దదమారమే రేపింది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల రికార్డులు గల్లంతయ్యాయన్న కలెక్టర్ నివేదిక కుదిపేసింది. దాంతో సిట్‌ ఏర్పాటు చేసింది అప్పటి టీడీపీ సర్కార్. ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా… నివేదిక మాత్రం వెలుగు చూడలేదు. ఇలా ఏళ్ళు గడిచిపోతున్నాయి తప్ప నాటి సిట్‌ నివేదికలో ఏముందో ఇప్పటివరకు బయటికి రాలేదు. దీంతో ఈ నివేదికలో ఏముందో బయటపెట్టండంటూ బొత్స తాజాగా కోరడం వెనక కచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం ఉందని అంటున్నారు. నివేదిక బయటపడి అందులో టీడీపీ ముఖ్యలకు మిహాయింపులు ఉండి ఉంటే అది వైసీపీకి అస్త్రంగా మారుతుంది. ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న బొత్సకు అందులో ఏముందో తెలుసుకోవడం పెద్ద విషయం కాదని, అందుకే లెటర్‌ రాసి రిప్లయ్‌ని బట్టి కూటమి సర్కార్‌ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా బొత్స సత్యనారాయణ లేఖాస్త్రాలు మాత్రం టాక్‌ ఆఫ్‌ ది పొలిటికల్‌ సర్కిల్స్‌ అవుతున్నాయి.

Show comments