NTV Telugu Site icon

Off The Record: వైసీపీ నేతలపై వరుస కేసులు..! ఒకసారి జైలుకి వెళ్లొస్తే పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారా?

Ycp

Ycp

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఆరు నెలలు కావస్తోంది. కూటమి సర్కార్‌ పవర్‌లోకి వచ్చాక… నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన, తమను ఇబ్బందులు పెట్టిన నాయకులు, ఇతరుల టార్గెట్‌గా పావులు కదులుతున్నాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. వైసీపీ ప్రభుత్వంలోఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారితోపాటు పార్టీని భుజానికెత్తుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై ఇష్టా రీతిన మాట్లాడిన నేతలు అందరి మీద వరుస కేసులు బుక్‌ అవుతున్న పరిస్థితి. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులతో పాటు గత ఐదేళ్ళ వ్యవహారాల మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే… వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట వైసీపీ నాయకులు. ఈ క్రమంలోనే… చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అని కూటమి నాయకులు అంటుంటే…
మా హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కీలకంగా ఉన్న వాళ్ళని టార్గెట్‌ చేస్తూ… అక్రమ కేసులు పెడుతున్నారన్నది వైసీపీ ఆరోపణ. ఈ పరిస్థితుల్లోనే కేసులు నమోదు నమోదైన నేతలంతా ముందస్తు బెయిళ్ళ కోసం కోర్టు బాట పడుతున్నారు.

Read Also: Mulugu: ములుగు నియోజకవర్గంలో కొత్తగా మరో మండలం.. మాట నిలబెట్టుకున్న మంత్రి

పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా నియోజకవర్గాలకు దూరంగా అజ్ఞాతంలో ఉంటున్నారట. అవసరమైతే తప్ప కొందరు నేతలు అందుబాటులోకి రావటం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంకొందరు నాయకులు మాత్రం కాస్త గడుసుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేసులు, అరెస్ట్‌లకు భయపడి ఎన్నిరోజులని నియోజకవర్గానికి, కేడర్‌కు దూరంగా ఉంటాం? దానికంటే అయితే అయింది… ఒకసారి జైలుకి వెళ్లివస్తే ఏమవుతుందని సదరు లీడర్స్‌ ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.. లీగల్‌గా ప్రొసీడ్‌ ఆవుతూనే అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమవుతున్నారట కొందరు. ఇలా పొలిటికల్‌ కేసులతో జైలుకు వెళ్ళి వస్తే… పాపులారిటీ కాస్త పెరుగుతుంది, సానుభూతి వస్తుందే తప్ప ఏ మాత్రం నష్టం ఉండబోదని వాళ్ళు లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం. అలాంటి వాళ్ళ లిస్ట్‌లో ముందున్నారట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కేసులు పెడితే పెట్టుకోండి, నేను అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికీ వెళ్లననిబోనని ఆయన చేసిన తాజా వ్యాఖ్యల్ని ఈ కోణంలోనే చూడాలని అంటున్నారు పరిశీలకులు.

Read Also: Tirupati Laddu Controversy: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..! దూకుడు పెంచిన సిట్

ఒకవేళ తమపై కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఆ తర్వాత అయినా సంబంధిత అధికారులపై లీగల్ ఫైట్ చేద్దామన్న నిర్ణయానికి వచ్చారట వైసీపీ నేతలు. అలా కాకుండా అజ్ఞాతంలోకి వెళ్తే క్యాడర్ మరింత భయపడి కుంగి పోతుందన్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పుకుంటున్నారు. తాము అజ్ఞాతంలో ఉండిపోతే… కేడర్‌ చెల్లాచెదురై తర్వాత ఇబ్బందులు వస్తాయని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించాలంటే… ఆ అరెస్ట్‌ ఏదో ఒకసారి అయిపోతే పోలా..? జైలు వాతావరణాన్ని ఓపారి చూసొస్తే పోలా? అని అనుకుంటున్నారట ప్రతిపక్ష నాయకులు. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులకు సంబంధించి అరెస్టయ్యామన్న విషయాన్ని అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ ఆలోచనను ప్రభుత్వ వర్గాలు ఎలా చూస్తాయి? వైసీపీ కేడర్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Show comments