NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్‌లో సీఎం అభ్యర్థి ఎవరు..? కవిత కార్యక్రమంలో నినాదాలతో కొత్త చర్చ..!

Brs

Brs

Off The Record: కవిత సీఎం.. సీఎం కవిత.. అంటూ చేసిన స్లోగన్స్‌ పార్టీలో వెయ్యి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయట. ఇప్పటికిప్పుడు బీఆర్‌ఎస్‌లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు. పార్టీ అధికారంలో లేదు, అధ్యక్షుడు కేసీఆర్‌ యాక్టివ్‌గా ఉన్నారు. కానీ… ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతోందట బీఆర్‌ఎస్‌ వర్గాల్లో. కేసీఆర్‌ తర్వాత బీఆర్‌ఎస్‌ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అసలదేం ప్రశ్న? ఇంకెవరుంటారు? వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తప్ప… అని వాదించే నాయకులకు పార్టీలో కొదవ లేదు. గతంలో ఆయన పాల్గొన్న ఒకటి రెండు కార్యక్రమాల్లో కేటీఆర్‌ సీఎం నినాదాలు వినిపించాయి కూడా. అంతవరకు ఎలాంటి వివాదం లేదు. కానీ… తాజాగా కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో కార్యకర్తలు ఈ నినాదాలు చేయడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. గతంలో అడపాదడపా కవిత విషయంలో చర్చలు జరిగినా.. ఇంత బహిరంగంగా కేడర్‌ నినాదాలు చేసిన సందర్భాలు లేవు. కానీ… ఈసారి మాత్రం సైలెన్స్‌ బ్రేక్ అవడంతో… తెర వెనక ఏం జరుగుతోందన్న ఆరాలు మొదలయ్యాయట.

Read Also: TV Serial Actress: టీవీ సీరియల్ నటి వేధింపుల కేసులో యువకుడు అరెస్ట్

నిజంగానే ఏదో జరిగిపోతోందా? లేక కేడర్‌లో జోష్‌ నింపే ప్రయత్నమా అన్న చర్చలు సైతం పార్టీ వర్గాల్లో మొదలయ్యాయని అంటున్నారు. అదే సమయంలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ టైం ఉండగా.. ఇప్పుడసలు సీఎం నినాదాల అవసరం ఏం వచ్చింది? అంతర్గతంగా ఎక్కడో… ఏదో… కుఛ్‌ కుఛ్‌ అంటూ… నొసలు చిట్లించే బ్యాచ్‌కు కూడా తక్కువేం కాదంటున్నారు పరిశీలకులు. ఈ చర్చోప చర్చల సంగతి ఎలా ఉన్నా… జరుగుతున్న పరిణామాలు మాత్రం కేడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కవిత, కేటీఆర్… ఎవరి ప్రోగ్రామ్స్‌లో వాళ్ళ అనుచరులు సీఎం నినాదాలతో హోరెత్తుతుండటం ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారుతోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించారు కవిత. ఆ సందర్భంలో అక్కడ నాయకులు ఆమెను ఉద్దేశించి పెద్ద ఎత్తున సీఎం నినాదాలు చేశారు. అంతకు ముందు ఓ పెళ్ళికి హాజరైనప్పుడు కూడా అలాంటి స్లోగన్సే చేశారు ఎమ్మెల్సీ అనుచరులు.

Read Also: Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!

ఇక, తాజాగా బుధవారం తెలంగాణ భవన్‌లో 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు కేటీఆర్. ఈ కార్యక్రమం ఆసాంతం కేటీఆర్‌ సీఎం నినాదాలతో మార్మోగిందట. ఇలా ఎవరి ప్రోగ్రామ్‌లో వాళ్ళ అనుచరులు సీఎం నినాదాలతో హోరెత్తించడం తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్‌లో సీఎం అంటే కేసీఆర్ అన్న భావనే ఉంది. కవిత, కేటీఆర్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని, మళ్ళీ కేసీఆర్ తప్పకుండా సీఎం అవుతారని చెప్పుకొస్తున్నారు. కానీ… ఇటు అనుచరులు మాత్రం అందుకు భిన్నంగా…. ఇద్దరిని ఉద్దేశించి సీఎం నినాదాలు అందుకోవడంతో… తెర వెనక అసలేం జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయట. కవిత విషయంలో ఆ మధ్య ఒక డిఫరెంట్‌ చర్చ కూడా జరిగింది. ఫార్ములా ఈ కేసులో తన అరెస్ట్‌ ప్రస్తావన వచ్చినప్పుడు… కావాలంటే చేసుకోండి… నేనేం భయపడను అన్నారు కేటీఆర్‌. దాన్ని సెటైరికల్‌గా ప్రస్తావించిన కాంగ్రెస్‌ నాయకులు జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారన్న భ్రమలో ఉన్నారేమో… అదే నిజమైతే ఆ విషయంలో కేటీఆర్‌ కంటే ముందు కవిత ఉన్నారని అన్నారు. ఆ సెటైర్స్‌ సంగతులు ఎలా ఉన్నా… ప్రస్తుతం కేటీఆర్‌, కవిత అనుచరులు సీఎం నినాదాలతో హోరెత్తించడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూస్తున్నాయట తెలంగాణ రాజకీయ వర్గాలు.

Show comments