కవిత సీఎం.. సీఎం కవిత.. అంటూ చేసిన స్లోగన్స్ పార్టీలో వెయ్యి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయట. ఇప్పటికిప్పుడు బీఆర్‌ఎస్‌లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు. పార్టీ అధికారంలో లేదు, అధ్యక్షుడు కేసీఆర్ యాక్టివ్‌గా ఉన్నారు. కానీ... ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతోందట బీఆర్‌ఎస్ వర్గాల్లో. కేసీఆర్ తర్వాత బీఆర్‌ఎస్ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అసలదేం ప్రశ్న?