Off The Record: కూటమిలో అసమ్మతి..! డిప్యూటీ మేయర్ వ్యవహారం చిచ్చు పెట్టిందా..?
- మేయర్ ఎన్నికలో వంగవీటి రాధాకు అందరి సహకారం..
- ప్రమాణ స్వీకారం రోజున కూటమిలో అంటుకున్న అగ్గి..
- ఆహ్వానం సరిగా అందలేదని బోండా ఉమా అలక..
- డిప్యూటీ మేయర్ విషయంలో గద్దె రామ్మోహన్ కినుక?..
- పైకి వేరే చెబుతున్నా..సుజనా చౌదరిది కూడా ఆహ్వానం సమస్యేనా?..
- రాధా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందని నేతల మనోగతం?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బెజవాడ కూటమిలో మేయర్ ప్రమాణ స్వీకారం రోజున పలికిన అసమ్మతి రాగాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా మేయర్ పదవికి పోటీపడి గెలిచారు. మేయర్ అభ్యర్థిగా బరిలో దిగడానికి ఆయన అంత ఆసక్తిగా లేరని మొదట్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడిచాయి. అదే సమయంలో తన కుమారుడు సిద్ధార్థను రంగంలోకి దింపేందుకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నేరుగా సీఎం చంద్రబాబును కలిసి సిద్ధార్థ బయోడేటా ఇచ్చి… పోటీ చేయించడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారాయన. అయితే… అనూహ్యంగా పొత్తుల్లో భాగంగా మేయర్ సీటు జనసేన కోటాకు వెళ్లింది. అందులోనూ… టీడీపీ నుంచి జనసేనలోకి మారిన వంగవీటి రాధాకు ఖరారవడం చర్చకు కారణమైంది. టీడీపీలో కూడా అదే సామాజికవర్గానికి చెందిన అనేక మంది సీనియర్స్ ప్రయత్నాలు చేసినా… అవేవీ వర్కౌట్ అవలేదు. దాంతో… చివరికి వీరంతా రాధాకు ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి.
అయితే… వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ…. అందరి సహకారంతో రాధా మేయర్ అయ్యారు. నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని చిన్ని.. ఇలా అన్ని వర్గాలు కలిసి పని చేశాయి.దీంతో గెలుపు నల్లేరు మీద నడక అవగా… కూటమి ఫుల్ డామినేట్ చేసింది. కానీ…. ఆ తర్వాత నుంచే అసలు సమస్య మొదలైంది. మేయర్‌గా రాధా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అగ్గి అంటుకుంది. కార్యక్రమానికి ముగ్గురు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, సుజనా చౌదరి, కో ఆప్షన్ నెంబర్లుగా హాజరు కావాల్సి ఉంది. కానీ… ఒక్కరు కూడా వెళ్ళకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. బోండా ఉమాకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందకపోవటంతోనే వెళ్ళలేదన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. ఇక డిప్యూటీ మేయర్ పదవి తన వర్గానికి ఇవ్వలేదని గద్దె రామ్మోహన్ అలక పూనారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వేరే కారణంతో రాలేదని చెబుతున్నా… ఆయనకు కూడా సరిగా ఆహ్వానం వెళ్లలేదన్న పాయింట్ చుట్టూతే తిరుగుతోంది వ్యవహారం.
Also Read
- OTR: "ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్".. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
- OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
- OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
- OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
ఇలా కూటమి కీలక నేతలంతా రకరకాల రీజన్స్‌తో రాధా ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోవడంతో ఏదో జరుగుతోందన్న చర్చలు మొదలైపోయాయి. మేయర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించారు. అందులో భాగంగా ఆహ్వానాలు అందించే బాధ్యతను కూడా ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేషన్ అధికారులు తీసుకున్నారు. కానీ… కూటమిలోని కీలక నేతలకు మాత్రం ఆహ్వానాలు అనుకున్న రీతిలో అందలేదన్నది వాళ్ళ సన్నిహిత వర్గాల మాట. తన గెలుపు కోసం పనిచేసిన తమను పిలిచే విషయంలో రాధా ప్రత్యేక చొరవ తీసుకుని ఉంటే బాగుండేదన్నది సదరు నేతల మనోగతంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ అంశం కూడా మూడు నియోజక వర్గాల్లో నేతల అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు కూడా విజయవాడ టిడిపిలోఎంపీ కేశినేని నాని ఒక వర్గంగా, బోండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా ఒక వర్గంగా చేసిన రాజకీయాలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత నాని వైసీపీలో చేరటం, ఆ స్థానంలో కేసినేని చిన్ని ఎంట్రీ ఇచ్చి కలిసి పని చేయటంతో గ్యాప్ కనపడకుండా పోయింది. అయితే మళ్లీ ఇప్పుడు కొత్తగా నేతల అలకలు, అసమ్మతి రాగాలు మొదలు కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. వీటికి మొదట్లోనే చెక్ పెట్టడం మంచిదన్న అభిప్రాయం బెజవాడ కూటమి వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
తాజావార్తలు
-
OTR: “ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్”.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Off The Record: కూటమిలో అసమ్మతి..! డిప్యూటీ మేయర్ వ్యవహారం చిచ్చు పెట్టిందా..?
-
Karthigai Deepam Row: కార్తీక దీపం వివాదం.. సికందర్ బాదుషా దర్గాకు పోటెత్తిన భక్తులు.. కేరళం నుంచి కూడా రాక!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
ట్రెండింగ్
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!