Off The Record: తెలంగాణ బీజేపీలో అలజడి..? ఆపరేషన్ వికర్ష్ వలలో బీజేపీ నేతలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంపై ఢిల్లీలోని పార్టీ పెద్దలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా బీజేపీలో చేరికలపై టాప్ టు బాటమ్ కసరత్తు జరుగుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ నాయకులు ఆశించినట్టు వరదలా చేరికలు లేకపోయినా.. అడపా దడపా చేరినవారు ఉన్నారు. ప్రత్యేకంగా చేరికల కమిటీ వేసినా అనుకున్నంత జాయినింగ్స్ లేవు. పార్టీలో ముఖ్యనేతల మధ్య అభిప్రాయ భేదాలు చేరికల ప్రభావం చూపినట్టు సమాచారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ కూడా సంస్థాగత బలోపేతంపై క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. చేరికలపై సంతృప్తి లేకపోయినా.. ఇప్పటికే బీజేపీలో ఉన్న నాయకులు ఎవరైనా పార్టీని వీడి వెళ్లిపోతున్నారా అనే అనుమానాలు పెరుగుతున్నాయట. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన కొందరు నాయకులు కాషాయ శిబిరంలో అడ్జెస్ట్ కాలేక పోతున్నారట. బీజేపీ పద్దతులకు అలవాటు పడలేక.. ఉండలేక.. ఉక్కపోతుకు ఫీలవుతున్నారట. బీజేపీలోని ఇతర లీడర్స్‌తో మింగిల్ కావడం లేదనే చర్చ నడుస్తోంది.
Read Also: EO Lavanna: మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో.. అందుకేనంటూ లవన్న వివరణ..
Also Read
బీజేపీలో కొద్దిరోజులుగా నాయకులు పార్టీని వీడివెళ్లిపోతారు అనే అంశంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో కొందరు అలాగే జంప్ చేశారు. దీనికితోడు అధికారపార్టీ BRS కూడా రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గులాబీ పార్టీ ట్రాప్‌లో పడ్డది ఎవరన్నదే మిస్టరీ. ఉగాది నాటికి కీలక పరిణామాలకు ఆస్కారం ఉందని చెవులు కొరుక్కుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లిపోయారు. బీజేపీలో ఇమడలేక.. ఉన్న నేతలతో పొసగక బీజేపీని వీడుతున్నట్టు కన్నా ఓపెన్‌గానే చెప్పేశారు. ఇదే పరిస్థితి తెలంగాణ బీజేపీలోనూ ఉందనేది ఓ ప్రచారం. ఒకవేళ బీజేపీని వీడాలని అనుకుంటే.. వాళ్లు ఎవరు? ఈ అంశంలో ఢిల్లీ పెద్దలకు ఉన్న సమాచారం ఏంటి? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు.. తమకు అందుతున్న రిపోర్టులు ఆధారంగా బీజేపీ అధిష్ఠానం ఆరా తీస్తోందా? వలస నేతలు బీజేపీని వీడటానికే నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారట. మొత్తానికి ఎన్నికల వేళ ఆపరేషన్ వికర్ష్‌కు ఎంత మంది బీజేపీ నేతలు చిక్కుతారో.. లేక కేవలం ప్రచారంగానే ఈ అంశం మిగిలిపోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!