Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Tdp Senior Leaders Unhappy Over Party Developments In Visakhapatnam

Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..

Published Date :April 23, 2026 , 9:40 pm
By newsdesk
  • టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్‌ అసహనం..
  • పార్టీలో, ప్రభుత్వంలో విలువ లేదంటూ సణుగుళ్లు..
  • పార్టీ కమిటీల నియామకంపై ఉమ్మడి విశాఖ నేతల అసంతృప్తి..
  • ఇన్నేళ్ళ లాయల్టీకి అర్ధం ఇదేనా అంటూ పరస్పరం ప్రశ్నలు..
  • ఉమ్మడి విశాఖలో దాదాపు పది మంది సీనియర్స్‌ పక్కకు..
  • అధికార యంత్రాంగంలో కూడా సీనియర్స్‌కు విలువపోయిందా?..
  • అప్పన్న చందనోత్సవంలో ఎమ్మెల్యేల కోటా టిక్కెట్స్‌కు భారీ కోత..
  • చందనోత్సవానికి లోకల్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డుమ్మా..
  • వ్యక్తిగత పని పేరుతో అదే రోజు హైదరాబాద్‌కు గంటా..
  • జిల్లా సీనియర్స్‌లో అసంతృప్తి, గొంతెత్తి మాట్లాడలేని దైన్యం..
  • వాట్సాప్‌ కాల్స్‌లో పరస్పరం గోడు వెళ్ళబోసుకుంటున్నారా?..
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: తెలుగుదేశం పార్టీలో తరం మారుతోంది. అందుకు తగ్గట్టే ట్రెండ్‌ కూడా ఛేంజ్‌ అవుతోంది. అయితే… ఈ వ్యవహారాలు చాలామంది సీనియర్స్‌కు మింగుడు పడ్డం లేదట. మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వ్యవహారం కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతలు సైతం మాకు పార్టీలో, ప్రభుత్వంలో కనీస విలువ లేదంటూ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళ పాటు జెండా మోసిన నేతలకు సైతం ఇక అవకాశాలు మూసుకుపోయినట్టేనని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల కూర్పును చూస్తేనే ఈ విషయం అర్ధమవుతోందన్నది వాళ్ళ మాట. ఆ కమిటీల నియామకం విషయంలో విశాఖ సీనియర్స్‌ తీవ్ర మన స్తాపంతో వున్నట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం, వివిధ వర్గాల బ్యాలెన్సింగ్‌ అధిష్టానం ఇష్టమే అయినా…. ఆ బ్యాలెన్సింగ్‌లో మేం లేకపోతే… ఇన్నేళ్ళ లాయల్టీకి అర్ధం ఏముందన్నది కొందరి క్వశ్చన్‌. అందులోనూ సాంప్రదాయ రాజకీయాలకు కేరాఫ్ అయిన టీడీపీలో మొదట్నుంచి సీనియర్లకు సముచిత స్ధానం ఉంటుంది. పొలిటిబ్యూరోతోపాటు స్టేట్ కమిటీల్లో కీలకమైన పదవుల్ని ఎక్కువ అనుభవం ఉన్న వాళ్లకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఈసారి మాత్రం పూర్తిగా గతానికి భిన్నంగా జరిగిందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. విధాన నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరోలో మంత్రి వంగలపూడి అనితకు చాన్స్ దొరికితే….. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు రెండోసారి పల్లా శ్రీనివాస్‌కే దక్కాయి.

వీళ్ళిద్దర్ని మినహాయిస్తే చాలామంది సీనియర్ నేతలకు స్థానం దక్కలేదు. పార్టీ కమిటీల కూర్పులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళ పేర్లను హై కమాండ్ కనీసం పరిగణనలోకి తీసుకున్నట్టు కూడా కనిపించలేదంటున్నారు. దీంతో… దాదాపు మూడు దశాబ్దాలకుపైగా… పార్టీలో ఉన్న వాళ్ళను పక్కన పెట్టేసినట్టేనా అన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే… దశాబ్దం క్రితం టీడీపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనితకు అనూహ్యంగా రెండోసారి పొలిట్ బ్యూరోలో చాన్స్ దక్కింది. అయితే…అంతకంటే ముందు నుంచి, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు కేసులు ఎదుర్కొన్న చాలామందికి న్యాయం జరగలేదనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, సీనియర్ శాసనసభ్యుడు గణబాబుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక పప్పల చలపతిరావు, గవిరెడ్డి రామానాయుడు, పీలా గోవింద సత్య నారాయణ, గండి బాబ్జి, గిడ్డి ఈశ్వరి, మణికుమారి వంటి వాళ్ళను అధినాయకత్వం పూర్తిగా పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోందని అంటున్నారు. అటు అధికారికంగా, ఇటూ పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీన్ని అవమానంగానే భావిస్తున్నామని సన్నిహితుల దగ్గర అంటున్నారట సీనియర్లు. ఈ పరిస్థితుల్లో భారీ మెజార్టీలతో గెలిచిన ఎమ్మెల్యేలకు సైతం ప్రభుత్వ యంత్రాంగం దగ్గర పరపతి లేకుండాపోతోందట. ఎమ్మెల్యే అంటే జస్ట్‌ ఎమ్మెల్యేనే… అంతకు మించి నథింగ్ అనేలా సీనియర్ ఆఫీసర్స్‌ వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకు తాజాగా జరిగిన సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్నే ఉదాహరణగా చెబుతున్నారు.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

ఈ ఉత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన టిక్కెట్లకు భారీగా కోత పెట్టింది దేవాదాయశాఖ. అందరికీ నామ్ కే వాస్తే అన్నట్టు విదిలించేసి… అవి కూడా ఇష్టమైతే తీసుకోండి లేకుంటే మానండి అన్నట్టు వ్యవహరించారట. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటాశ్రీనివాస్ దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది చందనోత్సవానికి ఆయన డుమ్మా కొట్టడం వెనక ఇదే రీజన్‌ ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏటా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాక క్రమం తప్పకుండా కుటుంబంతో సహా దర్శనానికి వెళతారు గంటా. కానీ… ఈసారి మాత్రం సరిగ్గా అదే రోజున తనకు వ్యక్తిగత పని ఉందంటూ హైదరాబాద్‌ వెళ్ళిపోవడాన్ని బట్టి చూస్తుంటే… మాజీ మంత్రి తన అసంతృప్తిని చెప్పకనే చెప్పేశారన్న చర్చ జరుగుతోంది. అటు మాడుగుల నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు తీరుపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్ధాయి అధికారులు పట్టించుకోరు, మీరు పనిచేయరు…. ఇదే పద్ధతి కొనసాగితే సీఎంకు కంప్లయింట్ చేస్తానంటూ హెచ్చరించే వరకు వెళ్ళారాయన. ఈ పరిస్ధితుల వెనుక అసలు కారణం ‘గుడ్ లుక్స్’ అన్నది పొలిటికల్‌ టాక్‌. అధినాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయి పరిస్థితులను, పరిణామాలను అసెస్ చేసుకుంటోంది. ఆ క్రమంలోనే వివిధ కారణాలతో సీనియర్లను పక్కనబెట్టడం ఇప్పటికే మొదలైపోగా… దీన్ని తీవ్ర అవమానకరంగా భావిస్తున్నారట వాళ్ళు. అలాగని, గొంతెత్తి మాట్లాడే పరిస్ధితిలో ఎవరూ లేరు. అందికే చేసేదేం లేక…వాట్సాప్‌ కాల్స్‌లో పరస్పరం గోడు వెళ్ళబోసుకుంటున్నారట. డైరెక్ట్‌ కాల్స్‌లో మాట్లాడుకుంటే ఎవరైనా రికార్డ్‌ చేసే ప్రమాదం ఉందన్న భయంతో వాట్సాప్‌కే పరిమితమై…. ఇంత బతుకు బతికి అంటూ ఆ తర్వాత పాజ్‌ ఇస్తున్నారట పెద్దలు. ఈసంగతి తెలిసిన పార్టీ నాయకులే పాపం సీనియర్స్‌ అంటూ జాలి వాక్యాలు పలుకున్నారట.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • Chandrababu party news
  • Ganta Srinivasa Rao news
  • off the record
  • TDP committee appointments

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions