Off The Record: తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఆ పార్టీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. కానీ… గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పటినుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు. ముఖ్యంగా ఇన్చార్జ్ సుగుణమ్మకు రాష్ట్రస్థాయిలో చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆమె తీరు మాత్రం మారలేదన్నది లోకల్ టీడీపీ నేతల మాట. దీంతో… ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉన్న తమ్ముళ్ళు ఇప్పుడు మాత్రం ఓ రేంజ్‌లో ఆమె మీద రివర్స్ ఎటాక్ చేయడం కలకలం రేపుతోంది. తాజాగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలకమండలిని నియమించారు. ఛైర్మన్ సహా.. సభ్యులను పార్టీ పెద్దలు వడపోసి కూటమి పార్టీ నేతలకీ సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ యువనేత మహేష్ యాదవ్ అలియాస్ మక్కి ఛైర్మన్‌గా 11మంది సభ్యుతో పాలకమండలి నియమించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ముగిసింది.
Read Also: Affair Murder: మొగిడి ప్రాణాలు తీస్తున్న మోజు.. దారుణంగా కొంత మంది భార్యల తీరు
అయితే… ఈ ఎంపిక మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్న సుగుణమ్మకు నచ్చలేదట… ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా, ఏదో జరిగిపోయినట్టుగా తన అనుచరుల దగ్గర మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అన్యాయం జరిగిందంటూ వరుసగా నిరసనలు, ప్రెస్ మీట్ లు పెట్టించి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పైన,పార్టీ పెద్దల మీద విమర్శలు చేయించడంతో పాటు కూటమి ప్రభుత్వంలో వైసిపి నేతలకు పదవులంటూ ఆరోపణలు చేయిస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. దీంతో…ఇక లాభం లేదనుకుని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నేతలు, కార్యకర్తలందరూ ఓ రేంజ్ లో సుగుణమ్మను బహిరంగంగాను, సోషియల్ మీడియాలోను విమర్శిస్తున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా… ఆధారాలతో సహా… గత పదేళ్ళుగా సుగుణమ్మ,అమె అల్లుడు సంజయ్ చేసిన అక్రమాలను బయటపెడుతున్నారట. ప్రతిపక్షంలో ఉండగా అప్పటి మున్సిపల్ ఎలక్షన్ లో జిల్లా నేతలు పెద్దిరెడ్డితో, కరుణాకర్ రెడ్డి తో డైరెక్ట్ గా ఒప్పందం కుదుర్చుకుని అభ్యర్థులను విత్ డ్రా చేయించింది నిజమా కాదా? కార్పొరేషన్ ఎలక్షన్లో వైసిపి నుంచి ఏడు కోట్లు తీసుకున్నది నిజమా కాదా? తన మనవరాలు కీర్తిని సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తీసుకెళ్లి కాళ్లకు నమస్కారం పెట్టిచ్చి ఆశీర్వదించమని అభ్యర్థించిన విషయం జగమెరిగిన సత్యమే కదా అంటూ సోషల్ మీడియాలో తమ నాయకురాలిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు టీడీరీ కార్యకర్తలు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పని చేసిన సుగుణమ్మ ఇప్పుడు మరో డ్రామా తెర తీశారంటూ ఓరేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
Read Also: The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
అసలు సుగుణమ్మకు వైసీపీ బంధం లేకుంటే… తిరుపతి టి డి ఆర్ బాండ్ల కుంభకోణం గురించి ఎందుకు మెదపడం లేదన్నది కేడర్ క్వశ్చన్. కొండమీద జరిగిన కుంభకోణంలో కరుణాకర్ రెడ్డిని సుగుణమ్మ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఆమె… వైసీపీకి బానిసగానే పనిచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు తిరుపతి తమ్ముళ్లు. గోశాల నుండి రోజుకో వివాదాన్ని భూమన తెరపైకి తెస్తున్నా… ఏ ఒక్క రోజైనా సుగుణమ్మ మాట్లాడారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ నుంచి సుగుణమ్మ 25 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ….ఆమె పాత ఎలక్షన్ అఫిడివిట్‌ను బయటపెట్టారు. ఇంచార్జ్ వర్సెస్ లీడర్స్ మాట అటు ఉంచితే ఆమె అంతలా వారికి పదవి రాకుండా ఉండాలని ప్రయత్నాలు చేయడానికి కారణం వేరొకటి ఉందని ప్రచారం జరుగుతోంది. గంగమ్మ గుడి చైర్మన్ పదవి ఇప్పిస్తానని స్థానిక నాయకుడి నుంచి సుగుణమ్మ 20 లక్షల రూపాయలు తీసుకున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇప్పుడా వ్యక్తికి కాకుండా వేరొకరికి పోస్ట్ దక్కడంతో… ఆమె మండిపోతూ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. అందుకే ఇక లాభం లేదనే ఉద్దేశంతోనే డైరెక్ట్ వార్‌కి దిగినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సుగుణమ్మను మౌనంగా ఉండమని చెప్పినప్పటికీ తన అనుచరులతో ప్రెస్ మీట్ లో ధర్నాలు చేయించడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పదవుల పంపకం తిరుపతి తమ్ముళ్ళను రోడ్డుమీదకు వచ్చేలా చేసింది. దీని మీద పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తోరో చూడాలి.
