Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Political Rivalry Over Chengalamma Temple Trust Board Two Tdp Factions Compete For Control

Off The Record: హుండీ మీద పొలిటికల్‌ కళ్లు పడ్డాయా..? పెత్తనం కోసం టీడీపీలోని రెండు వర్గాల పోటీ..

Published Date :February 21, 2026 , 8:30 pm
By Sudhakar Ravula
  • చెంగాళమ్మ ఆలయ ఆదాయం రూ.5 కోట్లకు పైనే..
  • పెత్తనం కోసం టీడీపీలోని రెండు వర్గాల పోటీ..
  • కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్‌లు ఇచ్చుకోవచ్చన్న లెక్కలు?..
  • తన మనిషి కోసం వ్యాపారవేత్త గంగాప్రసాద్ గట్టి ప్రయత్నాలు..
  • గంగాప్రసాద్‌కు లోకల్‌ ఎమ్మెల్యే విజయశ్రీ సపోర్ట్‌..
  • తమ్ముడి కోసం హార్డ్‌కోర్‌ టీడీపీ లీడర్‌ వేనాటి సతీష్‌రెడ్డి ట్రయల్స్‌..
  • వేనాటి ఫ్యామిలీకి ఇద్దరు మంత్రుల సపోర్ట్‌..
  • రెండు వర్గాల పోటీతో అయోమయంలో టీడీపీ అధిష్టానం..
  • ఎక్కువ నాన్చవద్దంటూ టీడీపీ అధిష్టానానికి విన్నపాలు..
  • అధిష్టానం లెక్కలు వేరుగా ఉన్నాయా?..
  • ఒక వర్గానికి ఇస్తే స్థానిక ఎన్నికల్లో మరో వర్గం పని చేయదన్న భయం..
  • లోకల్ బాడీస్ ఎన్నికలయ్యేదాకా కోల్డ్‌ స్టోరేజ్‌లో పెడతారా?..
Off The Record: హుండీ మీద పొలిటికల్‌ కళ్లు పడ్డాయా..? పెత్తనం కోసం టీడీపీలోని రెండు వర్గాల పోటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: సూళ్ళూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న టెంపుల్‌ ఇది. హుండీ, విరాళాలు అన్నీ కలిపి ఏడాదికి ఐదు కోట్లకు పైనే ఆదాయం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ పెత్తనం కోసం పొలిటికల్ ప్రాణాలు తహతహలాడుతున్నాయట. పోటాపోటీగా పావులు కదుపుతూ…తమ వర్గానికే ట్రస్ట్‌ బోర్డ్‌ పదవులు దక్కేలా ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్యులు పలువురు ప్రయత్నిస్తుండటం ఆసక్తి రేపుతోంది. అమ్మవారి సేవ, ఆలయ అభివృద్ధి అంటూ పైకి ఎన్ని పురాణాలు చెప్పినా…. ఆంతర్యం మాత్రం హుండీ మీద పెత్తనం, కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి అమ్మ పేరుతో నాలుగు రాళ్ళు వెనకేసుకోవడమేనన్న అభిప్రాయం బలంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోచి పట్టున్న వ్యాపారవేత్త కొండేపాటి గంగాప్రసాద్ తన అనుచరుడు తిరుమూరు సుధాకర్ రెడ్డికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఆయనకు ఎమ్మెల్యే విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రమణ్యం సపోర్ట్ కూడా ఉందన్నది లోకల్‌ వాయిస్‌. మరోపక్క కరుడు గట్టిన టిడిపి కుటుంబంగా ఉన్న వేనాటి సతీష్ రెడ్డి సైతం తన తమ్ముడు వేనాటి సురేష్ రెడ్డికి ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. అధికారం లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న తమను కాదని అధిష్టానం ముందుకు వెళ్ళదన్నది వేనాటి ఫ్యామిలీ ధీమా.

ఇరు వర్గాలు పోటాపోటీగా అమ్మవారికంటే ఎక్కువగా టీడీపీ అధిష్టానం ప్రసన్నం కోసం పాకులాడుతున్నారట. వేనాటి సతీష్ రెడ్డి కుటుంబం లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. అలాగే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,నారాయణ కూడా సతీష్‌రెడ్డి వైపే మొగ్గుతున్నట్టు సమాచారం. అయితే…. గంగాప్రసాద్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పలుకుబడినంతా ఉపయోగించి తనవంతు ప్రయత్నాలు చేస్తుండటం మేటర్‌ని రక్తి కట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధిష్టానం కూడా డైలమాలో ఉందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.ఇరు వర్గాలు రాజకీయంగా బలమైనవి కావడంతో… పార్టీ పెద్దలు అయోమయంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో సుధాకర్ రెడ్డి అంటే టీడీపీలో కొందరికి పడదు. ఇది గంగాప్రసాద్‌ శిబిరానికి మైనస్‌ కావచ్చన్న లెక్కలున్నాయి. మరోవైపు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా….ఆలయ అభివృద్ధి, భక్తులకు సదుపాయాల సంగతి పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. పాలక మండలి లేని కారణంగా అధికారులు అవినీతిలో మునిగితేలుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ నాన్చి మేటర్‌ని బాగా కాంప్లికేట్‌ చేయకుండా వీలైనంత త్వరగా చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ని ప్రకటిస్తే మంచిదని అంటున్నారు ఉమ్మడి నెల్లూరు టీడీపీ నాయకులు.నాన్చుడు ధోరణి వల్ల క్యాడర్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందని అంటున్నారు.

Also Read

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
  • Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
  • Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
  • Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా

ఐతే ఈ విషయంలో అధిష్టానం లెక్కలు వేరుగా ఉన్నాయట. రెండు వర్గాలు పార్టీలో బలమైనవే కాబట్టి ఒకరికి ఆలయ చైర్మన్ పదవి ఇస్తే.. మరో వర్గం అసంతృప్తికి గురయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తోంది. ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుందన్న భయంతో…. కొన్నాళ్లు అసలు ఆ జోలికి పోకపోతేనే బెటరని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు పదవి ఇచ్చి నిప్పు రాజేయడంకంటే… ఎన్నికల తర్వాత ఇద్దర్నీ కూర్చోబెట్టి కాంప్రమైజ్‌ చేస్తే బెటరని అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలయ్యేదాకా ఈ విషయంలో ముందడుగు ఉండకపోవచ్చని అంటున్నారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం, అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Temple Politics News
  • Chengalamma Temple Income
  • Kondepati Gangaprasad vs Venati Satish Reddy
  • Minister Anam Ramanarayana Reddy
  • MLA Vijayashree Sullurpeta

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions