Off The Record : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై నెగిటివ్ టాక్..
- నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై నెగెటివ్ టాక్..
- సీటు ఖాళీ అయినట్టు తాజాగా ప్రకటన..
- కవిత రాజీనామాను ఆమోదించిన మండలి ఛైర్మన్..
- ఈ సీటు బీఆర్ఎస్‌కు కలిసి రావడం లేదన్న చర్చ..
- గతంలో ఎన్నికైన భూపతి రెడ్డి కూడా పార్టీ నుంచి సస్పెండ్..
- ఇద్దరి మీద అభియోగాలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు గురించిన ఒక డిఫరెంట్, సెంటిమెంట్ అంశం ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం మంగళవారం సాయంత్రం శాసనమండలి చైర్మన్ ఆ సీటు ఖాళీ అయిందని ప్రకటించడమే. కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత రాజీనామా చేయడం వరుస పరిణామాలు. రాజీనామాను మొదట చైర్మన్ ఆమోదించకపోవడంతో కవిత నేరుగా శాసనమండలి సమావేశానికి హాజరై సభలో మాట్లాడి మరీ… తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో స్టాంప్ వేసేశారు ఛైర్మన్. అదంతా ఒక ఎత్తయితే…అసలు ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం బీఆర్‌ఎస్‌కు కలిసి రావడం లేదన్న చర్చ తాజాగా మొదలైంది.
అందుకు ప్రధాన కారణం గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి కూడా సస్పెండ్ అవడమే. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ విషయం హైకోర్టు వరకు వెళ్ళింది. చివరకు ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తూ అప్పటి మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవితని కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న రీజన్‌తోనే సస్పెండ్ చేశారు. దీంతో.. సెప్టెంబర్ 3న కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. దాదాపు నాలుగు నెలల తర్వాత రాజీనామా ఆమోదం పొందింది. ఇలా ఒకే స్థానం నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతిరెడ్డి, కవిత సస్పెండ్ అవడం, ఎమ్మెల్సీ పదవులు కోల్పోవడంతో రాజకీయ వర్గాల్లో సెంటిమెంట్ చర్చ మొదలైంది. ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్‌కు కలిసి రావడం లేదని మాట్లాడుకుంటున్నారు పార్టీ నాయకులు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థానానికి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఎవర్ని అభ్యర్థిగా పెడుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!