NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది? కేటీఆర్, కవిత మీటింగ్స్ లో మోగుతున్న సీఎం నినాదాలు

Brs

Brs

Off The Record: ఓపెన్‌ విత్‌ స్పాట్‌ సీఎం సీఎం నినాదాలు నిన్న కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు వచ్చినప్పుడు చేసినవి ఇవే…. ఈ నినాదాలే….. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చర్చకు కారణం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… ఇదెక్కడి గోలరా…బాబూ… అంటూ పార్టీ పెద్దలే తలబాదుకుంటున్న పరిస్థితి. మామూలుగా అయితే… రాజకీయ నాయకులకు మీటింగ్స్‌లో ఇలాంటి నినాదాలు మాంఛి కిక్కు ఇస్తాయి. కానీ… బీఆర్‌ఎస్‌లో మాత్రం…. ఎవర్రా మీరు…. అసలెవర్రా మీరంతా…. అంటూ నినాదాలు చేస్తున్నవారిని కోపగించుకోవాల్సిన పరిస్థితి వస్తోందట. నాడు ఉద్యమ సమయంలోగాని, పదేళ్లు పవర్‌లో ఉన్నప్పుడుగానీ… బీఆర్‌ఎస్‌కు ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. పార్టీ సీఎం అభ్యర్థి ఎవరంటే… ఏంటా పిచ్చి ప్రశ్న. మా నాయకుడు కేసీఆర్‌ కాకుండా ఇంకెవరుంటారంటూ… ప్రశ్నించిన వాళ్ళనే అసలు మీకు మతుందా అని రివర్స్‌లో అడిగే పరిస్థితి. కానీ.. ప్రతిపక్షంలోకి వచ్చాక సీన్‌ మారుతోంది, కొత్త నినాదాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. చివరికి ఆ స్లోగన్స్‌తో అంతా ఇబ్బందిపడే పరిస్థితి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఇటు కేటీఆర్‌, అటు కవిత మీటింగ్స్‌లో సీఎం నినాదాలు మోగిపోతున్నాయి. అలాంటి సందర్భాల్లో నినదించేవారిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదని అంటున్నారు. దీంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఆ ఎఫెక్ట్స్‌ చాలవా అన్నట్టు… తాజాగా కేసీఆర్ పార్టీ ఆఫీస్‌కు వచ్చినప్పుడు కూడా సీఎం సీఎం… అంటూ మోతెక్కించారు పార్టీ నాయకులు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత… ఇలా ముగ్గురి మీటింగ్స్‌లో సీఎం నినాదాలు ఏంటి? ఇదంతా తెలిసి జరుగుతోందా? తెలియక జరుగుతోందా అంటూ క్వశ్చన్‌మార్క్‌ ఫేస్‌లు పెడుతున్నారు కొందరు. తెలంగాణ భవన్‌లో తాజాగా జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ రాగానే… ఒక్కసారిగా సీఎం నినాదాలతో హోరెత్తించగా…చివరికి ఆయనే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒర్లకండిరా బాబూ.. దండం పెడతానంటూ ఆయన వారించాల్సి వచ్చిందని అంటున్నారు. ఆ సంగతి అలా పక్కనబెడితే… అసలు కేసీఆర్‌ యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉండగానే… అదే కుటుంబం నుంచి మిగతా ఇద్దరి సభల్లో సీఎం నినాదాలేంటి? మేం ఎవరివైపు ఉండాలి? అంటూ కేడర్‌ కన్ఫ్యూజ్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళు ఉంది.

అంత సుదీర్ఘ సమయం ఉన్నప్పుడు గులాబీ కోయిలలు తొందపడి కూయడం, వాళ్ళని కేటీఆర్, కవిత వారించకపోవడం చూస్తుంటే… ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఈ విషయంలో క్లారిటీ లేకుంటే… పార్టీలోని సీనియర్ నాయకులు సైతం గందరగోళపడే ప్రమాదం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారని కవిత, కేటీఆర్‌ ఓవైపు చెబుతూనే… మరోవైపు తమ సమావేశాల్లో సీఎం స్లోగన్స్‌ని కట్టడి చేయకపోవడం ఏంటో కూడా అర్ధం కావడంలేదట సామాన్య కార్యకర్తలకు. దీంతో పార్టీలో ముందు ముందు ఏం జరగబోతోందని గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఈ సీఎం స్లోగన్స్‌ బీఆర్‌ఎస్‌ పాలిటిక్స్‌ని ఏ మలుపు తిప్పుతాయో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.