Off The Record: ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పదేళ్ళపాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఒక ఎత్తయితే….ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం మరింత కుంగదీసింది. ఇక పార్టీని రీ ఛార్జ్ చేయాలి, గ్రామస్థాయి నుంచి మళ్ళీ పటిష్టం చేయడం కోసం జనంలోకి దూకుడుగా వెళ్ళాలనుకుంటున్న టైంలో… కవిత రూపంలో ఊహించని మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మూడు నెలల క్రితమే తేడా వచ్చినా… అప్పటి నుంచి అడపా దడపా మాత్రమే పార్టీని ఇబ్బందిపెట్టే స్టేట్‌మెంట్స్ ఇస్తూ వచ్చారామె. కానీ….తాజాగా కీలక నాయకులు హరీష్‌రావు, సంతోష్‌రావు టార్గెట్‌గా చేసిన ఆరోపణలు ఒక రకంగా పార్టీలో ప్రకపంనలు పుట్టించాయన్న విశ్లేషణలున్నాయి. ఇక ఆ తర్వాత బీఆర్‌ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, కవిత కూడా పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. హరీష్‌రావు మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు కవిత. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నందున వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారోనని ఉత్కంఠగా ఎదురు చూశారు చాలామంది. ఈ క్రమంలో శనివారం నాడు హైదరాబాద్ తిరిగి వచ్చారు మాజీమంత్రి. అయితే…అక్కడ మీరంతా ఊహిస్తున్నంత సీన్ ఏదీ లేదన్నట్టు సింపుల్‌గా సమాధానం చెప్పేశారు హరీష్. గతంలో ఇతర పార్టీలు ఎలాంటి ఆరోపణలు చేశాయో అలాంటి వాటినే కవిత చేశారంటూ తేలిగ్గా కొట్టి పడేశారాయన. పైగా… ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చేసి కొత్త చర్చకు తెర తీశారాయన.
Read Also: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇలా కవిత మాటలను హరీష్ రావు సింపుల్ గా తీసుకోవడంపై పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయట. స్పందిస్తే… కవితను పెద్దగా చేసినవాడినవుతానన్న ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగానే… ఆయన రియాక్ట్ అవలేదని చెప్పుకుంటున్నారు. తన మీద కవిత చేసిన అవినీతి ఆరోపణల విషయంలో గట్టిగా మాట్లాడకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆ ఆరోపణల మీద తీవ్రస్థాయిలో స్పందించడం ద్వారా ఒరిగేదేంలేదని, అందుకే… ఇతర రాజకీయ పక్షాలకు సమాధానం చెప్పినట్టుగానే ఆమెకు కూడా చెప్పి ఉండవచ్చన్నది పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయం. తాజా వివాదం తర్వాత తొలిసారి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, కేటీఆర్‌తో భేటీ అయ్యారు హరీష్‌రావు. పూర్తిగా కవిత వ్యాఖ్యల గురించి చర్చించడానికే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఆమె విషయంలో ఇక దూకుడుగా మాట్లాడమంటూ పార్టీ నేతలకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది గులాబీ అధిష్టానం. ఇలాంటి టైంలో కూడా మాట్లాడకుండా ఉంటే మరింత ప్రమాదమన్నది పార్టీ పెద్దల అంచనాగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే…. హరీష్‌రావు కూడా కామ్‌గా ఉండాల్సిన అవసరం లేదని కేసీఆర్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: Manchu Manoj : మీరు నా వెనకాల ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు
ఒకవేళ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవలేకున్నా…గట్టిగా ఖండించాలని చెప్పినట్టు తెలుస్తోంది. హరీష్‌రావు విదేశీ పర్యటన నుంచి రాగానే కవిత వ్యాఖ్యలపై మీడియా సమావేశం పెట్టాలనుకున్నారట. కానీ… ఫామ్‌హౌస్ భేటీలో దీనిపై క్లారిటీ వచ్చినట్టు తెలిసింది. ప్రత్యేకించి ఆమెను విమర్శించడానికే ప్రెస్‌మీట్ పెట్టకుండా…. వేరే అంశానికి సంబంధించి ఏర్పాటు చేసినప్పుడు దీనికి సంబంధించి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సూచించారట కేసీఆర్. బీఆర్‌ఎస్సే కవితకు బలం అని, ఒక్కసారి వదిలి బయటికి వెళ్తే… ఆమె వీకైపోతారని మొదట్నుంచి పార్టీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు దాన్నే ప్రాక్టికల్‌గా నిరూపిస్తూ…. లైట్ తీసుకోవడం ద్వారా…ఆమెకు ఎలాంటి సొంత బలం లేదని నిరూపించాలనుకుంటున్నారట. హరీష్‌రావు తేలిగ్గా మాట్లాడ్డం కూడా అందులో భాగమే అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. పార్టీ మొత్తం ఒకవైపు, తాను మరోవైపు ఉన్న క్రమంలో…. కవిత ఇప్పుడు తన సొంత బలాన్ని ఎలా నిరూపించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
