Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Mla Yarlagadda Venkat Rao Vs Chalasani Anjaneyulu

Off The Record: గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ డైరీ చైర్మన్ చలసాని.. అసలేం జరిగింది..?

Published Date :October 17, 2025 , 9:30 pm
By Sudhakar Ravula
  • గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్‌ డైరీ ఛైర్మన్‌ చలసాని..
  • వైసీపీ హయాంలో కూడా డైరీ ఛైర్మన్‌గా చలసాని ఆంజనేయులు..
  • వైసీపీతో కాంప్రమైజ్‌ అయ్యారని ఇప్పుడు ఎమ్మెల్యే ఆరోపణలు..
  • మాజీ ఎమ్మెల్యే వంశీకి సహకరించారని కామెంట్స్‌..
  • కొత్త ఫ్యాక్టరీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు..
  • చలసాని ఆంజనేయులును గట్టిగా టార్గెట్‌ చేసిన యార్లగడ్డ..
  • ఇన్నేళ్ళలో పెద్దగా వివాదాలేం లేని చలసాని ఆంజనేయులు..
  • వైసీపీ టైంలో కూడా టీడీపీ వాళ్ళని డైరెక్టర్స్‌ని చేశానని క్లారిటీ..
  • ఫ్యాక్టరీ ప్రారంభానికి నాటి సీఎంని, ఎమ్మెల్యే వంశీని పిలవలేదన్న చలసాని..
Off The Record: గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ డైరీ చైర్మన్ చలసాని.. అసలేం జరిగింది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: గన్నవరం టిడిపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మధ్య వ్యవహారం టీడీపీకే తలనొప్పిగా మారుతోందట. వ్యవహారం చూస్తుంటే… వీళ్ళిద్దరూ అసలు ఒకే పార్టీలో ఉన్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట. 2019 ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు విజయ డైరీ చైర్మన్‌గా పగ్గాలు తీసుకున్నారు చలసాని ఆంజనేయులు. అప్పుడు యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో ఉన్నారు. కానీ…నాడు టీడీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టడంతో యార్లగడ్డకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ పరిణామక్రమంలో…. 2024 ఎన్నికలకు ఏడాది ముందు వెంకటరావు వైసీపీని వీడి టిడిపిలో చేరి కూటమి అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించారు. గెలిచిన వెంటనే…. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వాళ్లపై ఫోకస్ పెట్టారు అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. అదే ఊపులో… విజయ డైరీ చైర్మన్‌ను కూడా టార్గెట్ చేయటం చర్చగా మారింది. చలసాని ఆంజనేయులు టిడిపిలో సీనియర్ లీడర్. అలాంటి సొంత పార్టీ నేత మీదికే ఎమ్మెల్యే అస్త్రాలు ఎక్కుపెట్టడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది.

చలసాని ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ తరపున పదవి పొందారని, కానీ…ఆ ఐదేళ్ళలో పార్టీ కోసం పనిచేయకుండా… తనది పాల పార్టీఅని చెప్పుకునేవారన్నది యార్లగడ్డ విమర్శ. అలా చెప్పుకుంటూ… ఐదేళ్ళు వైసీపీ వారికి అనుకూలంగా పనిచేశారని, కాబట్టే ఆయన పదవి కొనసాగిందన్నది ఎమ్మెల్యే వెంకట్రావు ప్రధాన ఆరోపణ. అలాగే అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీకి తెరవెనుక సహకరించారని, వంశీ అనుచరులకు పెద్ద ఎత్తున మిల్క్‌బూత్‌లు కేటాయించారన్నది యార్లగడ్డ ఇంకో ఆరోపణ. ఈ క్రమంలోనే.. వీరవల్లి దగ్గర నిర్మించిన కొత్త విజయ డైరీ ఫ్యాక్టరీలో భారీ కుంభకోణం జరిగిందని, అక్రమాలపై విచారణ చేయాలని గెలిచిన వెంటనే ఫిర్యాదులు చేశారు యార్లగడ్డ. అలాగే…చలసాని ఆంజనేయులు టార్గెట్‌గా… ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో కనిపించలేదని, చంద్రబాబు పర్యటన సందర్భంగా కూడా రాలేదని విమర్శించారు. డైరీలో ముగ్గురు డైరెక్టర్లను ఇష్టా రీతిన నియమించారని, ఆ నియామకాలను రద్దు చేయాలన్నది యార్లగడ్డ ఇంకో డిమాండ్‌. విజయ డైరీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించారాయన. దీంతో చలసానిని గట్టిగానే టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

టీడీపీ సీనియర్‌ లీడర్‌గా ఏళ్ళ తరబడి ఉన్నారు చలసాని. పార్టీలో అందరితో పరిచయాలున్నాయి. వివాదాస్పదుడనే రిమార్క్‌లు ఏవీ లేవు. యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల కారణంగానే…. ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఈ పరిస్థితుల్లో…చలసాని రాజీనామాకు సిద్ధమవడంతో… అధిష్టానం నుంచి ఆగాలని సంకేతాలు వచ్చాయట. ఎమ్మెల్యే ఆరోపణలకు ఆంజనేయులు వర్గం కౌంటర్‌ ఇంకోలా ఉంది. ఐదేళ్ళ వైసిపి ప్రభుత్వం హయాంలో కూడా…ఏటా ముగ్గురు చొప్పున 15 మంది టిడిపికి చెందిన వారిని డైరెక్టర్స్‌గా ఎంపిక చేశామని, కావాలంటే చెక్‌ చేసుకోమని సవాల్‌ విసురుతున్నారు. 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్యాక్టరీ ప్రారంభానికి కూడా అప్పటి సీఎం జగన్‌ను గానీ, స్థానిక ఎమ్మెల్యే వంశీని గాని పిలవలేదని గుర్తు చేస్తోంది చలసాని వర్గం. జిల్లాలో ఎవరికీ లేని సమస్య యార్లగడ్డకే ఎందుకని, తనమీద చేస్తున్న ఆరోపణలకు డైరెక్ట్‌గా స్పందించాల్సిన అవసరం లేదని అంటున్నారు చలసాని. మొత్తంగా ఇద్దరు నేతల వివాదం గన్నవరం టీడీపీలో కలకలంరేపుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gannavaram
  • Off The Record about MLA Yarlagadda Venkat Rao vs Chalasani Anjaneyulu

తాజావార్తలు

  • Harish Rao : గిరిజనుల ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు

  • Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

  • Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

  • Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్‌కు బంపర్ అవకాశం

  • Iran War: భారత్‌కు వస్తున్న ఇరాన్ చమురు నౌక చైనాకు మళ్లింపు.. కారణం ఏమిటి..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions