Site icon NTV Telugu

Off The Record: ఐయామ్ కమింగ్ అంటూ కవిత.. ఐయామ్ నాట్ అవైలబుల్ అంటూ కేటీఆర్..

Ktr Vs Kavitha

Ktr Vs Kavitha

Off The Record: బీఆర్ఎస్‌ పార్టీలో…గత రెండు నెలలుగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం…దుమారం రేపుతూనే ఉంది. తన తండ్రికి లేఖ రాసిన దగ్గర నుంచి…ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. గులాబీ పార్టీ చెందిన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ…పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు. సొంతంగానే తెలంగాణ జాగృతి తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ కంటే ఎక్కువగా జనాల్లోకి దూసుకెళ్తున్నారు. మొన్నటి వరకు పార్టీ మీద, పార్టీ నాయకుల మీద బహిరంగ విమర్శలు చేయలేదు. తాజాగా పార్టీలోని సీనియర్ నాయకులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలా చిలికిచిలికి గాలివానగా మారుతున్న సమయంలో…రక్షాబంధన్ కేసీఆర్‌ కుటుంబంలో సంతోషాన్ని తెస్తుందని కేడర్ భావించింది. ఈ రక్షాబంధన్‌తో అయినా సరే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్..ఎమ్మెల్సీ, చెల్లెలు కవిత కలుస్తారని భావించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అన్న కేటీఆర్‌కి…చెల్లెమ్మ కవిత రాఖీ కడుతుందని అందరూ ఊహించారు. చివరి నిమిషంలో క్యాడర్ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి.

Read Also: Nityapelli Koduku : మైనర్‌తో సహా నాలుగు పెళ్లిళ్లు… ఐదో పెళ్లికి రెడీ కానిస్టేబుల్ కృష్ణంరాజు

గత సంవత్సరం రాఖీ పండుగకు కవిత జైల్లో ఉండడంతో కేటీఆర్ రాఖీ కట్టించుకోలేకపోయారు. తెలంగాణ భవన్‌లోనే అక్కడికి వచ్చిన మహిళలతో రాఖీ కట్టించుకున్నారు కేటీఆర్. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న రాఖీ పండుగకి ఘనంగా జరుగుతుందని అనుకున్నారు. అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడం…నాయకులను టార్గెట్ చేస్తూ… తిట్టడం లాంటివి జరిగినా రాఖీతో అన్ని సమస్యలు సమసిపోతాయని అనుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్టీవీ స్పెషల్ లైవ్ షోలో…తాను కేటీఆర్‌కు రాఖీ కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కవిత వెల్లడించారు. దాంతోపాటు తాను చెప్పిన విధంగా దయ్యాల జాబితాలో తన అన్న కేటీఆర్ లేడని కూడా ఆమె కుండబద్దలు కొట్టారు. ఇంత బహిరంగంగా ఆమె చెప్పడంతో…ఈసారి కచ్చితంగా రాఖీ అన్నాచెల్లెళ్లను కలుపుతుందని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే కవిత…తన అన్న కేటీఆర్‌కి ముందు రోజే తాను వస్తున్నట్టు ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు కవిత సన్నిహితులు చెబుతున్నారు. కవిత మేసేజ్‌కు…తాను నాట్ అవాలబుల్ అంటూ కేటీఆర్‌ నుంచి రిటర్న్‌ మెసేజ్ పంపినట్టు చెబుతున్నారు. ఆయన మెసేజ్ పెట్టిన విధంగానే… కేటీఆర్‌ అందుబాటులో లేరు. రక్షాబంధన్‌కి ఒక రోజు ముందే బెంగళూరు వెళ్లి…అక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసుపై న్యాయనిపుణులతో మాట్లాడుతారని చెబుతున్నారు.

Read Also: WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్

రాఖీ కట్టడానికి కవిత సిద్ధమైనా సరే.. అన్నయ్య కేటీఆర్ మాత్రం కట్టించుకోవడానికి సిద్ధంగా లేడని బిఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చెల్లెలి మీద కోపంతోనో లేకుంటే తనకున్న అర్జెంటు పని మీదనో కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో…పార్టీలో ఉన్న మహిళా నాయకులు కూడా నిరాశకు గురయ్యారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కేటీఆర్ నివాసానికి.. లేకుంటే తెలంగాణ భవన్ కు వెళ్లి రాఖీలు కట్టేవాళ్ళు మహిళా నాయకులు. కానీ కేటీఆర్ హైదరాబాదులో లేకపోవడంతో తాము రాఖీలు కట్టలేకపోయామని బిఆర్ఎస్ మహిళ నేతలు చెప్పుకుంటున్నారు. మిగతా పార్టీల కంటే బిఆర్ఎస్‌కు ఈ రాఖీ పండుగ ప్రత్యేకంగా ఉంటుందని భావించిన క్యాడర్‌కు నిరాశ మిగిల్చింది. భవిష్యత్తులో కవిత, కేటీఆర్ కలిసే అకేషన్ వస్తుందా ? ఏం జరుగుతుందో చూద్దాం.

Exit mobile version