Off The Record: యనమల అడగనంటూనే అడుగుతున్నారా..? బెదిరిస్తున్నారా..? బ్లాక్మెయిల్ చేస్తున్నారా..?
- యనమల రామకృష్ణుడు అడగనంటునే అడుగుతున్నారా? ..
- పార్టీని బెదిరిస్తున్నారా...బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ..
- గతంలో ఎన్నడూలేనిది దేవుడి మీద ఎందుకు భారం వేశారు? ..
- అధిష్టానం పట్టించుకోవడం లేదా పట్టించుకోనట్టు నటిస్తోందా? ..
- తన కల కలగానే మిగిలిపోతుందని యమనల ఎందుకంత ఫీలవుతున్నారు?..
- జీవితంలో ఒక్కసారైనా రాజ్యసభ ఎంపీగా పని చేయాలని యనమల కల ..
- 2 స్థానాల్లో తనకు ఒకటి దక్కాలని వీరోచిత ప్రయత్నాలు..
- అవకాశం అడిగితే వచ్చేది కాదు..భగవంతుడు అనుకోవాలని వేదాంతం..
- అడగనంటూనే ప్రతీసారి పదవీ ప్రస్తావన ఎందుకు?..
- యనమల బెదిరిస్తున్నారా...బ్లాక్మెయిల్ చేస్తున్నారా?..
- చిన్నల్లుడి ఎపిసోడ్ తర్వాత గరంగరంగా హైకమాండ్? ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా రామకృష్ణుడికి మాత్రం ఏదో పదవి గ్యారెంటీగా ఉండేది. అయితే ఆయన ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా మంత్రిగా, మండలి ప్రతిపక్ష నేతగా పీఏసీ చైర్మన్ గా, స్పీకర్‌గా పార్టీ ఆయనకు చాలా పదవులు కట్టబెట్టింది. కష్టకాలంలో ఉన్నప్పుడు రామకృష్ణుడు కూడా పార్టీకి అదేవిధంగా ఉపయోగపడ్డారు. అయితే గతేడాది ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత నియోజకవర్గానికే పరిమితమయ్యారు యనమల. మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు ప్రయారిటీ లేకుండాపోయిందని చర్చ సాగుతోంది.
మొదటి నుంచీ యనమలకు ఒక కోరిక వుందన్నది ఆయనతో పాటు అనుచరులు ఈమధ్య నిత్యం చెప్పుకుంటున్న మాట. జీవితంలో ఒక్కసారైనా రాజ్యసభ సభ్యుడిగా పని చేయాలని ఆయన కల అట. చాలాసార్లు పెద్దల సభ గురించి పార్టీ ముందు ప్రపోజల్స్ పెట్టారు. బహిరంగ వేదికల మీద కూడా తన జీవిత కాలపు కోరికను బయటపెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ రేస్ మీద టిడిపిలో గట్టిగానే కసరత్తు జరుగుతోంది. పసుపు పార్టీకి పెద్దల సభకు రెండు స్థానాలు దక్కుతాయి. ఈ రెండింటిలో ఒకటి ఎలాగైనా తనకు దక్కాలని యనమల వీరోచితంగా ప్రయత్నిస్తున్నారు. ఆఖరి అస్త్రం కూడా ప్రయోగిస్తున్నారు. పదవుల కోసం చాలామందికి తాను సాయం చేశాను గానీ, తాను ఎవరినీ సహాయం కోరలేదని అంటున్నారు.. సన్నిహితులు పార్టీని రాజ్యసభ అడగాలని తనకు సలహాలు ఇస్తున్నారని, ఆ అవకాశం మనం అడిగితే వచ్చేది కాదని, భగవంతుడు అనుకోవాలని వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఆయన అనుకుంటే జరగనిది అంటూ ఏదీ ఉండదని గుర్తు చేస్తున్నారు. పార్టీ పెద్దలు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పార్టీ తనను 44 ఏళ్ళు పోషించిందని చెబుతూనే, తనకు పదవి ఇవ్వండి పరిగెడతాను అని అడగలేనని గుర్తు చేస్తున్నారు. పార్టీ మనుగడ కోసం శత్రువులకు కూడా సాయం చేస్తానంటూ ఎండింగ్ టోన్ సౌండ్ పెంచుతున్నారు. అసలు యనమల ఉద్దేశం ఏంటి…? పదవి అడగనంటూనే ప్రతిసారి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
ఇప్పటి వరకు ఏ ఫ్యామిలికీ ఇవ్వని అవకాశాలు యనమలతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిందని పార్టీలో మరో వర్గం అంటోంది. అయినా జీవితకాలం మేం పల్లకిలో కూర్చుంటూనే ఉంటాం అంటే మిగతా వాళ్ళు మోస్తూనే ఉండాలా అని ప్రశ్నించేవారూ వున్నారు. యనమల బెదిరిస్తున్నారా…బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడిగే వాళ్లూ ఎక్కువే వున్నారు. ఎవర్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలో పెద్దలకు తెలుసు….పదేపదే ఆ ప్రస్తావన తీసుకుని రావాల్సిన అవసరమేంటని కాస్త విసుగ్గానే మాట్లాడుకునే వారూ వున్నారు. కొన్ని ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయని గుర్తు చేస్తున్నారు. అయినా ఆ స్థాయిలో దగ్గర్నుంచి చూసిన వ్యక్తికి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యనమలను పరిగణలోకి తీసుకునే అవకాశం దాదాపు కనిపించడం లేదు. చిన్నల్లుడు మహేష్ యాదవ్ ఎపిసోడ్ తర్వాత పార్టీ మరింత గరంగరంగా ఉంది. ఇక అదేపనిగా అడగడం మానుకోవడం మంచిదని ఉచిత సలహాలు ఇస్తున్నారు కొందరు నేతలు. రామకృష్ణుడు మాత్రం రాజ్యసభ కోసం వీలుచిక్కినప్పుడల్లా ట్రయల్స్ వేస్తూనే వున్నారు. తన పొలిటికల్ రిటైర్మెంట్ ఘనంగా ఉండాలని కోరుతున్నారు. ప్రయత్నించి ప్రయత్నించి….చివరాఖరుకు భగవంతుడిపై భారం వేశారు. మరి పైవాడు ఏం తలుస్తాడో..?
తాజావార్తలు
-
Homemade Oil : కల్తీకి చెక్.. ఇంట్లోనే ప్యూర్ నూనె సింపుల్‌గా ఇలా చేసుకోండి..!
-
Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
-
El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
-
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!