Off The Record: గుంటూరు కారం ఘాటు మాఫియా బ్యాచ్‌కి రివర్స్ అయిందా?
- ఏదో ఒక రూపంలో మిర్చి కంటెయినర్స్ రిజెక్ట్ అవడం కామన్..
- తాజాగా మూడు కంటెయినర్స్‌ని తిరస్కరించిన చైనా..
- మిన్ను విరిగి మీద పడ్డట్టు ఓ వర్గం నానా హడావిడి..
- రైతుల్లో నైరాశ్యం నింపి చవగ్గా సరకు కొట్టేసే ప్రయత్నమా?..
- పురుగు మందుల అవశేషాల పేరుతో 3 కంటెయినర్స్ రిజెక్ట్..
- గుంటూరు నుంచి నిరుడు లక్షా 90వేల టన్నులు ఎక్స్పోర్ట్ ..
- ఈ ఏడాది ఇప్పటి వరకు 4వేల 300 కంటైనర్లలో పంట..
- వేల కంటెయినర్స్‌లో మూడు రిజెక్ట్ అయితే ఎందుకంత హంగామా..
- ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో 15 నుంచి 20 లక్షల బస్తాల తేజ మిర్చి..
- రిజెక్షన్ పేరుతో రైతుల్ని భయపెడితే ఎంతో కొంతకు అమ్మేస్తారని ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆసియాలోనే అతిపెద్దది గుంటూరు మిర్చియార్డు. ఇక్కడి నుంచి ఏటా వేల కోట్ల రూపాయల విలువైన మిరప పంట దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. అందుకు తగ్గట్టే ఎక్స్‌పోర్టర్స్ కూడా చాలామందే ఉంటారు ఇక్కడ పురుగు మందుల అవశేషాలనో, మరో పేరుతోనో… అప్పుడప్పుడూ కొన్ని కంటెయినర్స్ విదేశాల్లో రిజెక్ట్ అవడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. అలాగే… ఇటీవల కూడా మూడు మిర్చి కంటెయినర్స్ చైనాలో రిజెక్ట్ అయ్యాయి. కానీ… గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వీటి విషయంలో పెద్ద రచ్చే జరుగుతోంది. అదేదో మిన్ను విరిగి మీద పడిపోయింది, అసలు గుంటూరు మిర్చికి ఇక భవిష్యత్తే లేదన్నంత హడావిడి చేస్తోంది ఓ వర్గం. సరిగ్గా ఇక్కడే చాలా మందికి అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? తెర వెనక విషయాలు వేరే ఉన్నాయా? రేటు బాగుంటుందని ఆశిస్తున్న రైతుల్లో నైరాస్యం నింపేసి కారు చౌకగా సరకు కొట్టేసేందుకు మిర్చి మాఫియా జడలు విప్పిందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి చాలా మందిలో. ఇటీవల గుంటూరు నుంచి చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో మూడు కంటైనర్లను అక్కడి అధికారులు తిరస్కరించారు.
అందులో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి ఆ పంటను ఎగుమతి చేసిన మూడు కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది చైనా. ఈ వ్యవహారం గుంటూరులో హాట్ టాపిక్ అయింది. పురుగు మందుల అవశేషాలు మోతాదు కంటే ఎక్కువగా ఉన్నాయంటూ విదేశాల్లో గుంటూరు మిర్చిని తిరస్కరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చైనాతోపాటు ఇతర దేశాలు కూడా ఇలాగే తిరస్కరించాయి. అయినా.. అప్పుడెప్పుడూ జరగనంత చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతోందన్నది బిగ్ క్వశ్చన్. గుంటూరు నుంచి అత్యధికంగా మిర్చి ఎగుమతి అయ్యేది చైనాకే. ఏటా రెండు లక్షల టన్నులదాకా డ్రాగన్ కంట్రీకి పంపుతుంటారు. నిరుడు లక్షా 90వేల టన్నులు ఎక్స్పోర్ట్ అవగా….ఈ ఏడాది ఇప్పటివరకూ 65వేల 500టన్నుల మిర్చిని పంపారు. దాదాపు 4వేల 300 కంటైనర్ల పంటను చైనా పంపితే… ఇందులో కేవలం మూడు కంటైనర్ల మిర్చిని మాత్రమే తిరస్కరించారు. పెద్ద మొత్తంలో ఎక్స్‌పోర్ట్స్ జరుగుతున్నప్పుడు రెండు మూడు కంటైనర్లను తిరస్కరించడం పెద్ద మేటరేం కాదని వ్యాపారులే చెబుతున్నారు. అలాంటిది బ్రహ్మాండం బద్దలైపోయినట్టు దాని గురించే ఎక్కువ చర్చించడం వెనక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందని అంటున్నారు. చైనాకు ప్రధానంగా ఘాటు ఎక్కువగా ఉండే తేజ రకం మిర్చి ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం గుంటూరుతోపాటు చుట్టుపక్కల ఉన్న కోల్డ్ స్టోరేజీలలో ఈ రకం పంట 15నుంచి 20లక్షల బస్తాల వరకు నిల్వవు ఉన్నట్టు అంచనా. ఆ స్టాక్ కూడా రెండో కోత మిర్చి. సాధారణంగా రెండో కోత మిర్చి నాణ్యంగా ఉంటుంది.
Also Read
దానికి డిమాండ్ కూడా కొంచెం ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్లో అన్నిరకాల మిర్చి వెరైటీల ధరలు క్వింటాల్ 20 వేలకుపైనే ఉన్నాయి. ఆ లెక్కన ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటకు ఇంకా ఎక్కువ ధర పలుకుతుందన్నది రైతుల లెక్క. సరిగ్గా ఇక్కడే కొందరు కేటుగాళ్ళు మాఫియాలా మారి పావులు కదిపినట్టు చెప్పుకుంటున్నారు. తేజ రకం మిర్చి మూడు కంటైనర్లు చైనాలో రిజెక్ట్ అయ్యాయని గుంటూరులో తెగ ప్రచారం చేసేసి రైతుల్లో ఒక రకమైన భయం పుట్టించాలన్నది వాళ్ళ ప్లాన్‌గా తెలుస్తోంది. పురుగు మందుల పేరుతో ఎక్కువ రిజెక్షన్స్ పెరిగితే… ధర తగ్గిపోతుందన్న భయంతో…. కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న సరకును రైతులు రైతులు ఎంతోకొంతకు అమ్మేసుకుంటే తాము చవగ్గా కొట్టేయవచ్చన్నది ఆ మిర్చి మాఫియా ప్లాన్‌గా తెలుస్తోంది. మూడు కంటైనర్ల మిర్చి రిజెక్ట్ అయిన ఈ వ్యవహారం గురించి ఎంత ఎక్కువ ప్రచారం జరిగితే అంత ధర తగ్గుతుందన్నది వాళ్ళ ప్లాన్ అట. కానీ… ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో… ప్రచారం చేసినవారు సైలెంట్ అయిపోయినట్టు చెబుతున్నారు. గతంలో ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో కంటైనర్లను తిరస్కరించినప్పుడు కూడా ఇంత హడావుడి జరగలేదని… మార్కెట్లో మిర్చికి మంచి ధర ఉన్నప్పుడు మాత్రమే ఇంతలా ప్రచారం చెయ్యడం వెనుక కారణాలు మాత్రం అవేనన్నది గుంటూరు టాక్.
తాజావార్తలు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
-
Chairman’s Desk: అసలు ప్రభుత్వాల బాధ్యతేంటి..? పార్టీలు చేస్తున్న పనేంటి..?
-
Off The Record: ట్రాప్‌లో పడుతున్నామా? కూటమిలో చర్చ
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!