Off The Record: మార్గాని భరత్ తీరు తేడాగా ఉందా..? ఆటిట్యూడ్ ఏ మాత్రం తగ్గించుకోవడం లేదా..?
- మాజీ ఎంపీ మార్గాని తీరు తేడాగా ఉందా?..
- ఎవ్వర్నీ పట్టించుకోకుండా సర్వం నేనే అంటున్నారా?..
- ఎంపీ సెల్ఫ్ ప్రమోషన్ని లోకల్ లీడర్స్ తట్టుకోలేకపోతున్నారా?..
- జిల్లా పార్టీలో మార్గాని సింగిల్‌గా మిగిలిపోతున్నారా?..
- జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుతో కూడా గ్యాప్?..
- జక్కంపూడి రాజా, చెల్లుబోయిన కలిసి కార్యక్రమాలు..
- మార్గాని ఇన్ఛార్జ్ అయితే మున్సిపల్ ఎలక్షన్స్‌కు దూరం అంటున్న కొందరు..
- మాజీ ఎంపీ హెడ్ వెయిట్‌ని తట్టుకోలేమంటున్న లోకల్ లీడర్స్..
- మార్గానికి గ్రౌండ్ లెవల్ రాజకీయం తెలియదన్న కామెంట్స్..
- ఇంకా ఎంపీగానే ఫీలవుతున్నట్టున్నారని సెటైర్స్..
- మార్గాని భరత్ సెల్ఫ్ గోల్స్ ఎక్కువ వేసుకుంటున్నారా?..
- డబ్బా కొట్టే వాళ్ళు చుట్టూ ఉంటే చాలనుకుంటున్నారా?..
- మాజీ ఎంపీ ఆటిట్యూడ్ తగ్గించుకోవడంలేదన్న టాక్..
- మిగతా నేతలంతా కలిసి భరత్‌ని సింగిల్ చేసేశారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్… 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పోటీ చేసి ఎంపీ అయిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన తీరు కాస్త తేడాగానే ఉందని చెప్పుకుంటారు. పార్టీలోను, రాజకీయాల్లోను మొదటి నుంచి ఉన్న వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేసి… సర్వం నేనే అన్నట్టు సొంత రాజకీయాలు చేసేవారట. జక్కంపూడి ఫ్యామిలీ మొదటి నుంచి రాజమండ్రి కేంద్రంగా పాలిటిక్స్ చేస్తోంది. జక్కంపూడి రామ్మోహన్రావు గతంలో రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పని చేశారు. ఆయన కుమారుడు రాజా గతంలో రాజానగరం ఎమ్మెల్యేగా, ప్రస్తుతం కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. మార్గాని, రాజా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ…. ఒకరంటే ఒకరికి అస్సలు పడదని పార్టీ వర్గాలే చెప్పుకుంటాయి. ఇద్దరూ కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరట. అదంతా ఒక ఎత్తయితే…. ఈ మధ్య జిల్లాలో మాజీ ఎంపీ వ్యవహారం కాకరకాయ కాస్తా…. కీకరకాయ అయినట్టుగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన సెల్ఫ్ ప్రమోషన్స్‌ని తట్టుకోలేక ఇదెక్కడి అతిరా.. బాబూ… అంటూ పార్టీ కోఆర్డినేటర్స్, నేతలు దూరం పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వైసీపీ తరపున ఏ కార్యక్రమం చేయాలన్నా… మార్గాని సింగిల్ గానే మిగిలిపోతున్నారట. తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెల్లుబోయిన వేణు ఉన్నారు. ఆయన రాజమండ్రి రూరల్ పార్టీ కో ఆర్డినేటర్ కూడా. ఈ క్రమంలో వేణుకి భరత్‌కి కూడా ఈ మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది.
జక్కంపూడి రాజా, చెల్లుబోయిన కలిసి కార్యక్రమాలు చేస్తూ… భరత్‌ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. మార్గాని లక్కీగా ఎంపీ అయిపోయి… మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటూ ఆ ఇద్దరి వర్గం చెబుతోందట. త్వరలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. 2024 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు భరత్. దీన్ని బేస్ చేసుకుని రేపు మున్సిపల్ ఎలక్షన్స్‌లో కూడా ఆయన ఇన్‌ఛార్జ్‌గా ఉంటే తాము అసలు పోటీ చేయబోమని చెప్పేస్తున్నారట కొందరు స్థానిక నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం సహజమే, అలాంటి వాటిని తట్టుకోగలంగానీ…. సొంత పార్టీలోనే మాజీ ఎంపీ హెడ్ వెయిట్‌ని మాత్రం అస్సలు తట్టుకోలేం, దానివల్ల గెలిచే సంగతి తర్వాత…. కనీసం పోటీ కూడా ఇవ్వలేమని అంటున్నట్టు తెలిసింది. మార్గాని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండేవారు కాదు. అందుకే ఇప్పుడు మిగతా నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు అందరూ ఆయనంటే దూరం దూరం అంటున్నారట. గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు తెలియని వాళ్ళతో మనకి అవసరం లేదని క్లారిటీగా చెప్పేస్తున్నట్టు సమాచారం. ఆయన ఒకవేళ ఏదైనా ప్రోగ్రాం కలిసి చేద్దామన్నా… తెలివిగా ఎస్కేప్ అవుతున్నారట. ఎక్స్ ఎంపీ సెల్ఫ్ ప్రమోషన్ మీద పెట్టిన శ్రద్ధ రాజకీయాల మీద పెట్టి ఉంటే…. మేటర్ వేరే విధంగా ఉండేదంటూ సెటైర్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. భరత్‌కు మనం ఏం చెప్పినా నచ్చదు, ఆయన వినడు అంటూ ఓపెన్ గానే అంటున్నారు కొంతమంది.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఆయన తనను తాను అతిగా ఊహించుకుంటాడని, ఇంతకంటే పెద్ద లీడర్లును చాలామందిని చూశామని, కనీసం లౌక్యం తెలియదని నాయకుడితో కలిసి నడవం ఎలాగంటూ రాజమండ్రి వైసీపీలోనే చర్చ జరుగుతోందంటున్నారు. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్న భరత్… వాళ్లు రివర్స్ అటాక్ ఇస్తే సమాధానం చెప్పలేకపోతున్నారంటూ సొంత పార్టీలోనే ఓ వర్గం హ్యాపీగా ఫీల్ అయిపోతోందని అంటున్నారు. అదే సమయంలో.. భరత్ ఇంకా ఎంపీగానే ఫీలవుతున్నారని, తాను మాజీ అయిపోయి చాలా రోజులైందన్న సంగతి మర్చిపోయారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట లోకల్ వైసీపీ వర్గాల్లో. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఆ విషయం గ్రహించకుండా రెడీ… యాక్షన్…, కెమెరా అంటే సెట్ అవ్వదని కూడా మాట్లాడుకుంటోంది వైసీపీ కేడర్. లక్కీగా ఒకసారి ఎంపీ అయ్యారు. ఆ హుందాతనాన్ని కాపాడుకోవాలిగానీ…. అనవసరపు హైప్ క్రియేట్ చేసుకుంటే ఎప్పటికీ మాజీగానే ఉండిపోతారంటూ లోకల్ లీడర్లు మాట్లాడుకుంటున్నారట. కొందరైతే…. కనీసం ఆయన దగ్గరికి వెళ్లాలన్నా…. అమ్మో మార్గాని భరత్ అంటున్నారట… ప్రచారం కోసం ముందు ఏదేదో మాట్లాడేస్తారు. విషయం స్పష్టత వచ్చాక సెల్ఫ్ గోల్ చేసుకుంటారనే వాళ్ళు సైతం ఉన్నారట. పార్టీ కోసం పనిచేయకున్నా ఫర్లేదు, డబ్బా కొట్టేవాళ్ళు ఉంటే చాలు ఆయనకు అంటూ…అనేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు రాజమండ్రి వైసీపీలో. పార్టీ పెద్దల బ్లెస్సింగ్స్‌తో పాటు కేడర్ని కూడా కలుపుకోవాలి కదా అని కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు మాజీ ఎంపీకి హిత బోధ చేస్తున్నా…. అలా చెప్పే వాళ్ళని లైట్ తీసుకుంటున్నారు కానీ అసలు విషయం అర్థం చేసుకోవడం లేదట. మొత్తానికి మాజీ ఎంపీ ఆటిట్యూడ్ మాత్రం తగ్గించుకోవడం లేదన్నది నియోజకవర్గంలో ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికీ తాను ఎంపీగా ఫీల్ అవుతూ హడావిడి చేస్తున్నారు. ఇది చూసి ఆయనతో ఉంటే అసలుకే ఎసరొస్తుందనుకుని మిగతా నేతలు భరత్‌ని సింగిల్ చేసేశారట. ఈ పరిస్థితుల్లో ఆయన సీరియస్ పాలిటిక్స్ చేయలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!