Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్‌కు కూడా భారమేనా?
- బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్ట్‌లో దానం నాగేందర్..
- మిగతా తొమ్మిది మందికి, దానం కేసుకు మధ్య తేడా..
- రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ..
- ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ ప్రత్యర్థుల టార్గెట్..
- దానం లక్ష్యంగా కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టే ప్లాన్..
- కాంగ్రెస్ కూడా దానం నాగేందర్‌ని భారంగా ఫీలవుతోందా?..
- పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారన్న ఫీలింగ్?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలపడుతోంది. పార్టీ మార్పు వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ ఆయన్ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో రెండు పార్టీలు ఆయన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి… ఇప్పటి వరకు ఆయన మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి చర్చలో పెట్టాలని చూస్తున్నాయి. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. పార్టీ మార్పు ఆరోపణల విషయంలో మిగతా ఎమ్మెల్యేలు అందరిదీ ఒక ఎత్తయితే… దానం నాగేందర్ కేసు డిఫరెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి గెలిచారాయన. తర్వాత ఆ పదవికి రాజీనామా చేయకుండానే… లోక్‌సభ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు.
సరిగ్గా ఈ పాయింట్ మీదే ఫోకస్ చేస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. ఆయన వ్యవహారం ఎన్నికల నియమావళికి విరుద్ధమని వాదిస్తున్నాయి. అందుకే ఎమ్మల్యేని టార్గెట్ చేస్తూ… అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టేలా పావులు కదుపుతున్నారట. మిగిలిన MLAలు… పార్టీ ఫిరాయింపుపై రకరకాల వాదనలు వినిపించినా….నాగేందర్ మాత్రం రికార్డెడ్‌గా దొరికారన్నది ఆ రెండు పార్టీల అభిప్రాయంగా తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారన్న అంశం మీదే ఫోకస్ పెడుతున్నాయి ప్రత్యర్ధి పార్టీలు. వాళ్ళ వ్యూహం అలాఉంటే…
ఇటు కాంగ్రెస్ కూడా… దానం కొరకరాని కొయ్యలా మారారన్న అభిప్రాయంతో ఉందట. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి… ఆయన ఏదో ఒక అంశాన్ని ఎత్తుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ పీసీసీ నాయకత్వం కాస్త అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ముఖ్య నేతలను పొగడ్తలతో ముంచెత్తడం.. ప్రభుత్వం మీద డ్యామేజింగ్ కామెంట్స్ చేయడం లాంటివి తలనొప్పిగా మారినట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. దీంతో.. ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి ఏంటన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. అటు ప్రత్యర్థులకు టార్గెట్ అ్యయారు, ఇటు సొంత పార్టీలో సపోర్ట్ లేదు. దీంతో ఇప్పుడాయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.
Also Read
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?