NTV Telugu Site icon

Off The Record: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలక ఎపిసోడ్‌ ముగిసినట్టేనా? డిమాండ్స్ ఏంటి? హైకమాండ్ భరోసా ఏంటి?

Jeevan Reddy

Jeevan Reddy

Off The Record: గడిచిన మూడు వారాలుగా తెలంగాణ కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ నలుగుతోంది. పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టిన ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ని చేర్చుకోవడంపై అలకబూనిన జీవన్‌రెడ్డి ఒక దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్‌ అగ్ర నేతలంతా రంగంలోకి దిగి ఆయన్ని బుజ్జగించాల్సి వచ్చిందట. ఢిల్లీ పెద్దల మంత్రాంగంతో చివరికి కూల్‌ అయ్యారు జీవన్‌రెడ్డి. వాళ్ళు ఇచ్చిన హామీలకు ఓకే చెప్పేశారాయన. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉ్ననా… తనకు కనీసం గౌరవం కూడా లేకుండా చేశారంటూ ఆవేదన చెందిన ఎమ్మెల్సీ.. రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికి కాస్త మెత్తబడ్డా.. వ్యవహారం పూర్తిగా కొలిక్కి రాకపోవడంతో సీన్‌ ఢిల్లీకి మారింది.

Read Also: SS Rajamouli on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై ప్రశంసలు కురిపించిన దర్శకధీరుడు

ఇతర.. పార్టీ పెద్దలతో పాటు అక్కడే ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ దీపా దాస్‌మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డితో ఢిల్లీలో భేటీ అయ్యారు జీవన్‌. ఆ చర్చల తర్వాతే శాంతించారట ఆయన. వీళ్ళిద్దరితో పాటు కేసీ వేణుగోపాల్‌ కూడా చర్చల్లో పాల్గొని జీవన్ రెడ్డికి భవిష్యత్ రాజకీయంపై భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే.. పార్టీ నాయకత్వం తనను అవమానించిందని రెండు మూడు రోజులుగా జీవన్‌రెడ్డి వాయిస్ వినిపిస్తున్న క్రమంలో.. పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ మీడియా సమక్షంలోనే వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్‌ చేరిక విషయంలో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమమేనని అంగీకరించారాయన. ఇక అధిష్టానం ఆయనకు సముచిత గౌరవం ఇస్తుందని, సమయం.. సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు సీఎం.. ఈ క్రమంలో మరో వాదన కూడా వినిపిస్తోంది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

జీవన్‌రెడ్డి కేబినెట్‌ బెర్త్‌ ఆశిస్తున్నారన్నది దాని సారాంశం. అయితే.. సామాజిక సమీకరణాల కోణంలో అది కుదురుతుందా..? అన్న డౌట్స్‌ కూడా వెంటనే వస్తున్నాయి. మంత్రి పదవి సంగతి తర్వాత ప్రస్తుతానికైతే… ఆయనకు ఒక విషయంలో గట్టి హామీ వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన వెంటనే… తిరిగి ఛాన్స్‌ ఇస్తామని, కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు భరోసా ఇచ్చినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో జీవన్ రెడ్డి ని మండలికి పంపే అంశంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే… రైతు రుణమాఫీ లాంటి అంశాలపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాంగ్రెస్‌ సర్కార్‌. అలాంటి బాధ్యత ఏదో ఒకటి ఆయనకు ఇవ్వవచ్చంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారిన జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌కు ఇక తెరపడినట్టేనన్నది పార్టీ వర్గాల ఫీలింగ్‌.