Off The Record about BRS Sitting MLAs: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటు అధికార BRS పార్టీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది. సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు దక్కుతాయి..? కొత్తవారికి అవకాశం ఉంటుందా..? ఇటు విపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ అభ్యర్థులుగా బరిలో ఉండేది ఎవరు అన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం పర్యటనలో కేటీఆర్ పర్యటన… ఆయన చేసిన కామెంట్స్‌తో ఆ నియోజవర్గ BRS అభ్యర్థి డిసైడ్ అయినట్టేనా? అన్న చర్చ జరుగుతోంది.
Read Also: TS Assembly Budget Session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వంసిద్ధం.. గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో TRS ఓటమి పాలైంది. ఈటల రాజేందర్‌కు పోటీగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగారు.అప్పుడే కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి MLCగా అవకాశం ఇచ్చారు కేసీఅర్. అప్పటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి మధ్య అంతర్గతంగా నువ్వా- నేనా అన్నట్టు పోటీ రాజకీయాలు సాగుతూ వస్తున్నాయి. ఇద్దరు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా కేటీఆర్ హుజురాబాద్ పర్యటనలో చేసిన కామెంట్స్‌తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీచేసే అభ్యర్థి ఎవరో చెప్పకనే చెప్పారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Read Also: Off The Record: అసెంబ్లీకి గవర్నర్ తమిళిసై.. గవర్నర్, సర్కార్ మధ్య స్నేహం బలపడేనా?
మరోవైపు కౌశిక్‌రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే గెల్లు శ్రీనివాస్ పరిస్థితి ఎంటన్న చర్చ ఇప్పుడు BRSలో జరుగుతోంది. శ్రీనివాస్‌కు ఏదోఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారా… లేక మరేదైనా ఆఫర్ ఇస్తారా… అన్నది చూడాలి. ఇటు హుజురాబాద్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కకపోతే… గెల్లు శ్రీనివాస్ యాదవ్ సైలెంట్‌గా ఉంటారా, లేక మళ్లీ పోటీకి పట్టుబడతారా అన్నది తేలనుంది. మొత్తంమీద హుజురాబాద్ BRSలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలతో అక్కడ అధికార పార్టీలో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది… నువ్వా- నేనా అన్నట్టు ఉన్న ఇద్దరిలో ఎవరు నెగ్గుతారు… ఎవరు తగ్గుతారు అనేది తేలాలంటే… కొంతకాలం వేచిచూడాల్సిందే!