Off The Record: ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్‌లో కూడా పెద్దగా పరియం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో మిస్టర్ కూల్ అన్న పేరుంది ఆయనకు. దాదాపు పది నెలల క్రితం వరకు ఆయన పొలిటికల్ లైఫ్ సాఫీగానే ఉన్నట్టు అనిపించింది. వైసీపీ అధిష్టానంతో కాస్తో కూస్తో విభేదాలున్నా… భయంకరమైన ఇబ్బందులేవీ రాలేదని, ఆన వాయిస్ వినిపించేదని చెప్పుకుంటారు. కానీ… ఏడాది క్రితం వైసీపీని వీడి జనసేనలో చేరాక పొలిటికల్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించకుండా పోయారాయన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో ఉన్న పాత వివాదాలు పెద్ద సమస్యగా మారాయట. బాలినేని జనసేనలో చేరినా… జిల్లాలో మాత్రం ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్నారన్నది లోకల్ వాయిస్.
Read Also: Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?
అయినా ఇటు జనసేన కానీ.. అటు టీడీపీ అధిష్టానంగానీ.. బాలినేనితో సమన్వయం చేసేందుకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవలేక.. తన వర్గాన్ని సముదాయించలేక సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. 1999లో తొలిసారి ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వాసు కాంగ్రెస్ పార్టీ తరపున 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. వైఎస్ఆర్ క్యాబినెట్‌లో, ఆ తర్వాత వైసీపీ తరపున గెలిచి 2019 జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. క్రమంగా రకరకాల కారణాలతో జగన్‌తో గ్యాప్ పెరిగి…. 2024 ఎన్నికల తర్వాత జనసేన వైపు నడిచారు బాలినేని. అదే సమయంలో లోకల్ టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన తమ మిత్రపక్షంలో చేరినా…ఎప్పటికీ ప్రత్యర్ధేనని ప్రకటించారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.
Read Also: Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్
మరోవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌తో పాటు మరోనేత కంది రవిశంకర్ వంటి వాళ్ళను తన వెంట ఉంచుకోగలిగారు జనార్ధన్. దీంతో కేవలం వైసీపీ నుంచి బాలినేనితో పాటు జనసేనకు వెళ్లిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆయన వెంట ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన సమన్వయం కీలకంగా ఉండటంతో.. బాలినేనిని కొన్నాళ్లు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారట. అందుకే ఆయన ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు.జనసేనలో చేరే సమయంలో బాలినేని ఎలాంటి డిమాండ్స్ చేయక పోయినా…పవన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారన్న ప్రచారం కూడా ఒక దశలో జోరుగా జరిగింది. అలాగే…పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా జనసేన నుంచే లీకులు వచ్చాయి. కానీ…ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడసలు జనసేనలో బాలినేని పాత్ర ఏంటి.. పవన్ ఆయనను రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారనే విషయంలో కూడా స్పష్టత లేదు. అటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం పొలిటికల్‌గా ఆయనకు.. ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డికి అనివార్యం. టీడీపీ, జనసేన పొత్తు కారణంగా ఒకవేళ బాలినేని పోటీకి దూరమైతే… ఫ్యూచర్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉండటంతో ఆ శిబిరంలో ఆందోళన వ్యక్తం అవుతోందట.
Read Also: Srisailam Laddu Prasadam: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్రకోణం..!
జనసేనలో మాజీ మంత్రి పాత్రపైనే ఓ స్పష్టత రాకపోవటంతో ఆయన వెంట నడిచేందుకు పలువురు జిల్లా కీలక నేతలు తటపటాయిస్తున్నట్టు సమాచారం. అటు ఆయన కూడా తనదేంటో అర్ధంకాని స్థితిలో వాళ్ళని గట్టిగా రమ్మని అనలేక గమ్ముగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేనలో చేరాక కేవలం ఒకటి, రెండు అవసరమైన సందర్బాల్లో మాత్రమే ఒంగోలు వచ్చినట్లు సమాచారం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ ఇలాంటి పరిస్దితులు చూడలేదని, ఇప్పుడు ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్ లో. మరోవైపు అసలు బాలినేని జనసేనలో కొనసాగుతారా.. లేదా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. ఆయన రాజకీయ భవితవ్యం ఏంటి.. ఏ టర్న్ తీసుకుంటుంది.. అడుగులు ఎటు వైపు అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
