Nizamabad Mlas Headache : తల పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నారు అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. అనుచరుడు ఏకు మేకై వ్యవహారాలు నడపటంతో తలపట్టుకున్నారట. తాజా ఘటనలో అధిష్ఠానానికి MLAలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరుగుతోందట.
ఎమ్మెల్యేలకు మింగుడు పడని మేయర్ భర్త తీరు
నిజామాబాద్ నగరంలోని సాయినగర్‌లో 300 గజాల స్థలం టీఆర్‌ఎస్‌లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అనుచరుడు కదా అని అందలం ఎక్కిస్తే.. ప్రజల్లో పరువు తీస్తున్నాడని మేయర్ భర్త తీరుపై లబోదిబోమంటున్నారట ఎమ్మెల్యేలు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్ గుప్తలకు మేయర్ దండు నీతు భర్త శేఖర్ తీరు మింగుడుపడటం లేదట.
Also Read
నష్ట నివారణ చర్యల్లో ఎమ్మెల్యేలు
ఆ మధ్య నిజామబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చినప్పుడు.. భూ వివాదాల విషయంలో మేయర్ భర్తను గట్టిగానే హెచ్చరించారు. కానీ శేఖర్ తీరు మారక.. ఇప్పుడు రోడ్డెక్కడంతో అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియక కలవర పడుతున్నారట ఎమ్మెల్యేలు. పైగా ఈ వివవాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి అల్లుడు సంపత్ పేరు ప్రస్తావనకు రావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
సీనియర్ల మధ్య వివాదాలు తలెత్తకుండా అలర్ట్
వివాదానికి కారణమైన వ్యక్తులను కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేష్‌గుప్తా. చివరకు దండు శేఖర్‌పై అసహనం వ్యక్తం చేసి.. దూకుడు తగ్గించాలని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సమస్య రోడ్డెక్కి రచ్చ కావడంతో విషయాన్ని టీఆర్‌ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యేలు. గతంలోనే ఎమ్మెల్సీ కవిత హెచ్చరించి ఉండటంతో.. తాజా రగడ పార్టీ సీనియర్ల మధ్య కొత్త వివాదాలు తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారట.
టీఆర్ఎస్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తలు
మేయర్ భర్త విషయంలో అంతిమ నిర్ణయం టీఆర్ఎస్ హైకమాండ్‌కు వదిలేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆలస్యమైందని.. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరమని ఎమ్మెల్యేలు సూచించారట. నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌పై భూ వివాదాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి పెట్టారట అధికారపార్టీ నేతలు. దీంతో మేయర్ భర్త గురించి తెలిసినా.. MLAలు చేతులు కాలకా ఆకులు పట్టుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. మరి.. పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్‌లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!